ఢిల్లీ డైనమోస్ దుమ్ము దులిపేసిన జంషెడ్‌పూర్ ఎఫ్‌సీ

హైదరాబాద్: ఇండియన్ సూపర్‌లీగ్‌లో బాగంగా జరుగుతున్న ఫుట్‌బాల్ మ్యాచ్‌లో బుధవారం జంషెడ్‌పూర్ జట్టు ఢిల్లీ జట్టుతో తలపడింది. అంతకుముందు 3 మ్యాచ్‌లలో చూపించిన తీరుకు భిన్నంగా ఆడి విజేతగా నిలిచింది. మొదటి భాగంలో తన ఆధిక్యాఆన్ని ప్రదర్శించిన దిల్లీ జట్టుల రెండో భాగంలో దానిని నిలుపుకోలేకపోయింది.
21వ నిమిషంలో మొదటి అవకాశాన్ని జంషెడ్‌పూర్ చేజిక్కించుకుంది. ఇజు అజూకా బాక్స్‌లో ఉండగా బికాష్ .జైరు వేసిన బాల్‌ను అడ్డుకుని గోల్‌ని ఆపాడు. 71శాతం ఆట ఢిల్లీ చేతిలోనే ఉన్న తరుణంలో జంషెడ్‌పూర్ జట్టు సమయం కోసం వేచి చూసి తన డిఫెండ్ ప్రతిభను కనబర్చింది.
పాపం ఢిల్లీ జట్టుకు జంషెడ్‌పూర్ గోల్‌కీపర్ సుబ్రతాపౌల్ ఏకంగా నాలుగు క్లీన్ షీట్‌లు అయ్యేలా చేశాడు. ఢిల్లీ గోల్‌కీపర్‌గా సిద్దార్థ్ సింగ్ ఉన్న సమయంలో ఇజు అజూకా చేసిన ఒకే ఒక గోల్ మ్యాచ్ విన్నింగ్ పాయింట్‌గా మారింది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications