Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐఎస్ఎల్‌లో గోవా అరుదైన రికార్డు: 100వ మ్యాచ్‌లో ఘన విజయం

ISL FT: Goa 2 - 0 NorthEast United; Coro scores, Leudo sent off

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐఎస్ఎల్)లో గోవా ఎఫ్‌సి జట్టు వరుస విజయాలతో దూసుకుపోతోంది. లీగ్‌లో భాగంగా గోవా ఎఫ్‌సి జట్టు ఆడిన వందో మ్యాచ్‌లో ఆ జట్టు విజయం సాధించింది. ఆరో సీజన్‌లో భాగంగా బుధవారం గోవాలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో నార్త్‌ఈస్ట్‌ యునైటెడ్‌తో జరిగిన మ్యాచ్‌లో గోవా 2-0తేడాతో గెలుపొందింది.

ఫలితంగా ఇండియన్ సూపర్ లీగ్‌లో వంద మ్యాచ్‌లు ఆడిన జట్టుగా గోవా ఎఫ్‌సి నిలిచింది. అంతేకాదు సొంత మైదానంలో గోవాకు ఇది 50వ మ్యాచ్ కావడం విశేషం. ఈ లీగ్‌లో 100 గోల్స్ చేసిన జట్టుగా గోవా ఎఫ్‌సి జట్టు అరుదైన గుర్తింపు పొందింది. తాజా విజయంతో పాయింట్ల పట్టికలో గోవా ఎఫ్‌సి పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని అందుకుంది.

బుధవారం నాటి మ్యాచ్‌లో ఇరు జట్లు గోల్స్ కోసం హోరా హోరీగా తలపడ్డాయి. అయితే, తొలి అర్ధభాగంలో ఇరు జట్లు గోల్‌ను నమోదు చేయలేకపోయాయి. మ్యాచ్‌ 68వ నిమిషంలో నార్త్‌ఈస్ట్‌ ఆటగాడు మిస్లావ్‌ కోమోర్‌స్కి ఓన్‌గోల్‌ చేయడంతో గోవా ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత ఫెర్రాన్‌ (82వ ని) లభించిన పెనాల్టీని గోల్‌గా మలచడంతో 2-0తో గెలిచింది.

ప్రస్తుతం పాయింట్ల పట్టికలో గోవా ఎఫ్‌సి 24 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా... ఏటీకే 21 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతుంది. ఇక, ఈ సీజన్‌లో ఐఎస్ఎల్ అరంగేట్రం చేసిన హైదరాబాద్ ఎఫ్‌సి జట్టు ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడి కేవలం ఒక్క మ్యాచ్‌లోనే విజయం సాధించి పట్టికలో ఆఖరు స్థానంలో కొనసాగుతోంది.

Story first published: Thursday, January 9, 2020, 13:14 [IST]
Other articles published on Jan 9, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+