Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కేరళతో పుణె మ్యాచ్ డ్రా: శిక్షకుల అసంతృప్తి

పుణె: పుణె సిటీ తన సొంత గడ్డపై డిఫెండింగ్ చాంపియన్ చెన్నైయిన్‌తో ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్ డ్రా గా ముగిసింది. తొమ్మిది వేల మందికి పైగా అభిమానులు హాజరైన ఈ మ్యాచ్‌ డ్రా ముగియడంపై పుణె కోచ్ ఆంటోనియో హబాస్ అసంతృప్తికి గురైతే పుణెపై విజయం సాధించపోవడంపై చెన్నైయిన్ కోచ్ మార్కో మాట్టరాజీ షాక్‌కు గురయ్యాడు.

చెన్నై సంచనలం జెజె లాల్పెఖౌలా 28వ నిమిషంలో చేసిన గోల్‌ను సెకండాఫ్‌ 82వ నిమిషంలో అనిబల్ రోడ్రిగ్స్ అద్భుతంగా చేసిన ఫ్రీ కిక్ గోల్ పోస్ట్‌కు చేరడంతో స్కోర్ ను సమంచేసింది. జట్టు పెర్పార్మెన్స్ పట్ల పుణె సిటీ సారధి ఆంటోనియో హబాస్ డిజప్పాయింట్ కాగా, చెన్నైయిన్ ఆటతీరు ఆ జట్టు కోచ్ మార్కో మాట్టరాజీని దిగ్భ్రాంతికి గురిచేసింది.

తమ జట్టు పెర్పార్మెన్స్ నచ్చలేదని మాట్టరాజీ వ్యాఖ్యానించాడు. ప్రారంభంలోనే గోల్ చేసిన తమ కుర్రాళ్లు చివరిదశలో అనిబల్ గోల్ చేయకుండా అడ్డుకోలేకపోవడం ద్వారా పొరపాటు చేశారన్నాడు. పుణె జట్టు ప్లే సమయంలోనే అవకాశాలు కల్పించుకుంటున్న వైనాన్ని గుర్తుచేశాడు.

ISL: FC Pune City salvage a point against Chennaiyin FC in 1-1 draw

మ్యాచ్ మొదలైన రెండో నిమిషంలోనే జెజె దూరం నుంచి ఇన్ సైడ్ హాఫ్‌లో హన్స్ ముల్లర్ కు పంపిన బంతిని పుణె గోల్ కీపర్ ఎడెల్ బెటే పర్‌ఫెక్ట్‌గా అడ్డుకున్నాడు. డ్రామనే ట్రారో పంపిన హెడ్డర్ గోల్ కిందకు రాదని రిఫరీలు తేల్చేశారు. దీంతో ఇరు జట్లు కూడా గోల్ చేసే అవకాశాలు కోల్పోయాయి.

28వ నిమిషంలో జెజె లాల్పెఖౌలా అసాధారణ రీతిలో పంపిన బంతి నేరుగా గోల్ పోస్ట్ చేరడంతో సూపర్ మచాన్స్ లీడ్‌కు దారి తీసింది. దుడు పంపిన బంతిని బెటె అడ్డుకోవడంతో సెకండాఫ్‌లో పూర్తిగా ఆధిక్యం సాధించే పరిస్థితిని చెన్నై దిగజార్చుకున్నది. ఆ వెంటనే రాహుల్ భెకె అందుకున్నా మరోసారి బెటె తిప్పికొట్టాడు.

అంతకుముందు తొలి హాఫ్‌లో ఎడుయారో ఫెరీరా దూరం నుంచి పంపిన బంతి.. జెజె చేతుల్లోకి వెళ్లింది. జెజె పంపిన బాల్ ను కీపర్ బెటె అడ్డుకున్నాడు. చివరిసారిగా జొన్నాథన్ లుక్కా దూరం నుంచి పంపిన బంతి కూడా గోల్ పోస్ట్ మీదుగా వెళ్లిపోవడంతో మ్యాచ్ ఫలితం డ్రాగా ముగిసింది.

సెకండాఫ్‌లో 54వ నిమిషంలో జెర్రీ లాల్రింజులా పాస్ చేసిన బంతిని ట్రార్ పవర్‌ఫుల్ ఎఫర్ట్‌తో గోల్ పోస్ట్ కు పంపినా.. చెన్నై సారధి జాన్ ఆర్నె రైస్ అడ్డుకుని ప్రత్యర్థి జట్టు దూకుడుగా వెళ్లకుండా నిలువరించాడు. మరో నిమిషం తర్వాత లుక్కా ఫ్రీ కిక్ ద్వారా పంపిన బంతి నేరుగా క్రాస్ బార్‌ను దాటేసి వెళ్లిపోయింది.

ట్రార్ మరోసారి 63వ నిమిషంలో లుక్కా పంపిన పాస్ ను తెలివిగా గోల్ చేసేందుకు ప్రయత్నించినా బంతి తిరుగుతూ వెళ్లిపోయింది. 82వ నిమిషంలో అనిబల్ రెండోసారి బంతిని టచ్ చేయడంతో నేరుగా పుణె ఖాతాలో ఒక పాయింట్ చేరి స్కోర్ సమమైంది.

తర్వాత కెర్ర్ పాయింట్ సాధించేందుకు ఫ్రీకిక్ ద్వారా బంతిని గోల్ పోస్ట్ కు పంపినా సక్సెస్ కాలేకపోయాడు. సబ్ స్టిట్యూట్ గా వచ్చిన డేవిడ్ సుక్కీ రూపంలో వచ్చిన అవకాశాన్ని కూడా చెన్నైయిన్ సద్వినియోగంచేసుకోలేకపోయింది. పుణె గోల్ కీపర్ బెటె సుక్కీ పంపిన అడ్డుకుని చెన్నై విజయానికి అడ్డుగోడగా నిలిచింది.

ఏది ఏమైనా డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన చెన్నైయిన్.. హెడ్ కోచ్ హబాస్ రాకతోనేనైనా దశ తిరుగుతుందని భావించిన పుణె జట్లకు నిరాశే మిగిలింది. అయితే కోచ్ హబాస్ కేవలం ఒక్క పాయింట్ మాత్రమే సాధించడంతో సాటిస్పై కాకున్నా.. జట్టు పెర్పార్మెన్స్ మాత్రం చాలా బాగుందని ప్రశంసించాడు.

చెన్నైయిన్ డిఫెండింగ్ చాంపియన్ అని గుర్తుచేసిన హబాస్.. వారిపై మ్యాచ్ డ్రా ముగియడమూ గొప్పేనన్నారు. గత ఏడాది తమ జట్టు సెమీ ఫైనల్స్‌కు వెళ్లలేదన్నాడు. ఇక పుణెలో డిఫెండర్ ఫెరీరా సైతం సొంత గడ్డపై మ్యాచ్ ఫలితం సాధించలేకపోవడం నిరాశాజనకమేనన్నాడు. తాము చాలా బాగా ఆడామని, తమ జట్టు ఆడిన మ్యాచ్‌ల్లోకెల్లా ఇది బెస్టని వ్యాఖ్యానించాడు.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+