పానాజీ: మూడో సీజన్ టోర్నీ ప్రారంభానికి ముందు రియోకి వెళ్లిన ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) జట్టు ఎఫ్‌సి గోవా ప్రీ సీజన్ మ్యాచ్‌ల్లో 1 I 0 స్కోరు తేడాతో తొలి విజయాన్ని సొంతం చేసుకుంది.
అటాకింగ్‌లో డైనమిక్ బ్రెజిలియన్ స్ట్రైకర్ రాఫెల్ కోయెల్హో సహకారంతో రాబిన్ సింగ్ దాన్ని 55 నిమిషంలో గోల్‌చేసి జట్టును విజయ తీరాలకు నడిపించాడు. ఆ క్షణం నుంచి మ్యాచ్ పూర్తయ్యే వరకు ఇండియన్లు డిఫెన్స్‌కే ప్రాధాన్యం ఇస్తూ బ్రెజిల్ జట్టుకు మళ్లీ అవకాశం ఇవ్వకుండా వ్యవహరించడంతో ఎఫ్‌సి గోవా జట్టుకు చిరస్మరణీయమైన విజయం సొంతమైంది.
గోవా జట్టు కోచ్ జికో రియోలో తొలిసారి సంప్రదాయ 4 I 4 I 2 ఫార్ములా అమలుచేసి చూపాడు. ఒకవైపు సారధి లుసికో, మరోవైపు యంగ్‌స్టర్ రాఫెల్ దుమాస్ భాగస్వామ్యంతో పూర్తిస్థాయి డిఫెన్స్‌ను ఆచరించాడు.
ఫుల్గాంకో కార్డోజో, రాజు గ్వైకాడ్ పూర్తిగా మైదానం వెనుక పొజిషన్లు తీసుకుంటే.. మిడ్ ఫీల్డ్‌లో త్రిండానే గోంకాల్వేస్, రిచర్లేసన్ బారోబాసా, సంజయ్‌బాల్ముచ్చుతో కలిసి జాఫ్రే పూర్తిగా అటాకింగ్ పాత్ర పోషించాడు. మరోవైపు రాబిన్‌సింగ్, రాఫెల్ కోయెల్హో కూడా ఎఫ్‌సి గోవా తరఫున పూర్తి అటాకింగ్ చేస్తుండగా లక్ష్మీకాంత్ కట్టిమణి గోల్ పోస్ట్ వద్ద పొజిషన్‌లో సిద్ధంగా ఉన్నాడు.

ఈ మ్యాచ్ తొలి హాఫ్ అంతా సాదాసీదాగానే సాగింది. ఏ పక్షం కూడా మ్యాచ్‌ను తమ నియంత్రణలోకి తీసుకోలేకపోయాయి. ఎఫ్‌సి గోవా జట్టు ఒత్తిళ్లను ఆహ్వానిస్తూనే మరోవైపు ప్రత్యర్థిపై డిఫెన్సింగ్ ధోరణిలో ఆడుతూ సమర్థవంతమైన ఆట తీరు ప్రదర్శించింది. ఇరు జట్లు గోల్ కోసం చేసేందుకు పలు అవకాశాలు వచ్చినా సద్వినియోగంచేసుకోలేకపోయాయి. తొలి హాఫ్ మ్యాచ్ ముగిసే వరకు ఇరు పక్షాలు ఆచితూచి ఆడుతూ ముందుకు సాగాయి.
ఇరు పక్షాలు రెండో హాఫ్‌లో మ్యాచ్ తీరును వేడెక్కించాయి. క్రీడాకారులంతా ఓపెనర్ కోసం ఫార్వర్డ్ వెంచర్ కోసం ప్రయత్నించారు కానీ బ్రేక్ సాధించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. జికో తమపై పెట్టుకున్న నమ్మకాన్ని గోవా ఆటగాళ్లు వమ్ము కానివ్వలేదు. జాఫ్రీ రెండు నిమిషాల వ్యవధిలో రెండుసార్లు గోల్ చేసేందుకు గల అవకాశాలను జార విడుచుకున్నాడు.
బ్రెజిలియన్లపై ఒత్తిడి పెంచడంలో జయప్రదంగా ముందుకు సాగిన ఎఫ్‌సి గోవా ఆటగాళ్లు గైక్వాడ్, రాబిన్ డిఫెన్స్‌తో 55 నిమిషంలో అద్భుతమైన విజయాన్ని సొంతంచేసుకున్నారు.
ఎఫ్‌సి గోవా సారథి కొట్టిన షాట్‌ను గోల్ కీపర్ అడ్డుకున్నా, తన ఎదురుగా వచ్చిన బంతిని రాఫెల్ కొయెల్హో మిస్ కానివ్వలేదు. ఒకసారి ఆధిపత్యం సాధించిన తర్వాత బంతిపై నియంత్రణ కొనసాగించడంలో ఎఫ్‌సి గోవా ఆటగాళ్లు మంచి ఆటతీరు ప్రదర్శించారు.
జులియో సెస్సార్, రైనాల్డోలను మిడ్‌వేలో ప్రవేశపెడితే జాఫ్రీ, రాబిన్‌సింగ్ ఇన్‌స్టంట్‌గా భారత్ టీంపై సానుకూల ప్రభావం చూపారు. రెండో హాఫ్ మ్యాచ్ చివరి క్షణాల్లో గోవా త్రయం మందార్‌రావు దేశాయి, రోమియో ఫెర్నాండెజ్, కీనన్ అహ్మెదాలను ముందుకు తేవడంతో బ్రెజిలియన్ జెయింట్లపై ఎఫ్‌సి గోవా చిరస్మరణీయ విజయం సాధించింది.
ప్రీ సీజన్‌లో నెలరోజుల శిక్షణ ముగించుకున్న ఎఫ్‌సి గోవా జట్టు.. ఈ నెల 25న మరో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడిన తర్వాత స్వదేశానికి బయలుదేరుతుంది. వచ్చేనెల నాలుగో తేదీన గౌహతిలో నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఎఫ్‌సి జట్టుతో ఎఫ్‌సి గోవా జట్టు తలపడతాయి.