న్యూఢిల్లీ: ఇండియన్ సూపర్ లీగ్-2016 పదో రౌండ్ పూర్తయి తదుపరి దశకు చేరుకున్నది. ఈ దశలో జట్లన్నీ పై చేయి సాధించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. లీగ్ కీలక దశకు చేరుకుంటున్న ప్రస్తుత తరుణంలో మిడ్ ఫీల్డర్లు ప్రతి జట్టుకు అవసరమే. ఈ సీజన్‌లో ఎనిమిది జట్లలో ప్రతిభ కనబరుస్తున్న మంచి మిడ్ ఫీల్డర్ల గురించి ఒక లుక్కేద్దాం.
సారధ్యంతోపాటు ఫ్లోరెంట్ మాలౌదా అండ
ఢిల్లీ డైనమోస్ సారధిగా ఫ్లోరెంట్ మాలౌదా ప్రత్యర్థి జట్లపై చెలరేగిపోవడంలో నంబర్ వన్ ప్లేయర్ అంటే అతిశేయోక్తి కాదు. లీగ్ అంతటా అత్యధిక స్థాయిలో జట్టు సభ్యులందరికీ సాయంచేయడంలో ఈ ఫ్రెంచ్ ప్లేయర్ చరిత్ర నెలకొల్పాడు. సూపర్ మాచన్స్ కు వ్యతిరేకంగా జరిగిన మ్యాచ్‌లో రెండు గోల్స్ సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు ఫ్లోరెంట్ మాలౌదా.
చెన్నైయిన్‌తో జరిగిన చేసిన నాలుగు గోల్స్ లోనూ అసిస్టెన్స్ అందించాడు. సరైన సమయంలో చెన్నై జరిగిన మ్యాచ్ లో లీగ్‌లోనే హీరో ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సొంతం చేసుకున్న మాలౌదా.. ఐఎస్ఎల్ అభిమానుల కలల సంద్రంలో 50 పాయింట్లు సాధించుకున్నాడు. అతడి విలువ కూడా రూ.10.8 కోట్లు పలుకుతున్నదంటే అతిశేయోక్తి కాదు.

కేరళకు బెస్ట్ సికె వినీత్
ఒకవేళ ఐఎస్ఎల్ 2016లో తొలి రంగ ప్రవేశమైతే సికె వినీత్.. అభిమానుల ఫాంటసీల్లో ఆసక్తి రేకెత్తిస్తున్న వారిలో మొదటి వరుసలో ఉంటారని ప్రతీతి. పేస్ వింగర్ అయిన కేరళ బ్లాక్ బస్టర్స్‌కు చెందిన ఈ మిడ్ ఫీల్డర్ బెంచ్ నుంచి ఎఫ్ సి గోవాపై జరిగిన మ్యాచ్ 2 - 1 స్కోర్‌తో విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ప్రత్యర్థి జట్లకు డిఫెన్సివ్‌లో చుక్కలు చూపించడంలోనూ సూపర్బ్. ఆయన డిఫెన్స్ అంటే ప్రత్యర్థులకు హడలే మరి. జట్టు విజయానికి మరికొన్ని గోల్స్ సాధించడంలో కీలక పాత్ర పోషించిన ఈ 28 ఏళ్ల వినీత్ భవిష్యత్ లోనూ తన జట్టు ప్లేయర్లకు సాయం అందించగలడని భావిస్తున్నారు. కాకపోతే అభిమానుల ఫాంటసీ టీంలో వినీత్ విలువ రూ.7 కోట్లు మరి.
రికవరీలో అగస్టో సూపర్బ్
సూపర్ మాచన్స్‌లో నెమ్మదిగా తన ప్రతిభను ప్రదర్శిస్తూ ముందుకు వెళుతున్న బ్రెజిలియన్ ప్లే మేకర్ రాఫెల్ అగస్టో ఒకరు. ప్రస్తుత టోర్నీలో జట్లన్నీ సెమీస్ దిశగా దూసుకెళ్తున్న తరుణంలో చెన్నైయిన్ రాఫెల్ అగస్టో కీలకం. జట్టులో మిడ్ ఫీల్డర్ గా వ్యవహరిస్తున్న రాఫెల్ ప్రస్తుత సీజన్‌లో రెండు సార్లు అసిస్టెన్స్ ఇచ్చి మిడ్ ఫీల్డర్‌గా తన స్థానానికి న్యాయం చేకూర్చాడు.
మూడు క్లీన్ చిట్లు కూడా కలిగి ఉన్న ఈ బ్రెజిలియన్ ఆటగాడు ఈ సీజన్ లో చెన్నైయిన్ జట్టును 39 బంతుల నుంచి రక్షించాడు. మిడ్ ఫీల్డర్ గానే ముంబై ప్లేయర్ లుసియాన్ గోయాన్ తర్వాత స్థానం రాఫెల్ దే. ఎనిమిది మ్యాచ్ లు ఆడిన రాఫెల్ 29 పాయింట్లు పొందాడు. అభిమానుల ఫాంటసీ టీమ్ లో చోటు దక్కించుకున్న రాఫెల్ అగస్టో విలువ రూ. 6.9 కోట్లు పలుకుతున్నది.
దౌటీ విలువ రూ.9.9 కోట్లు
అట్లెటికో డీ కోల్‌కతా స్టార్ ప్లేయర్లలో సమీగ్ దౌటీ ఒకరు. జట్టుకు రెండు గోల్స్ సాధించడంతోపాటు ఎనిమిది మ్యాచ్ లలో 34 పాయింట్లు పొందాడు. ప్రస్తుత సీజన్‌లో అట్లెటికో డీ కోల్‌కతా పీక్ దశకు చేరుకోకున్నాగత సీజన్లో సౌతాఫ్రికన్ వింగర్ మూడు గోల్స్ సాధించాడు. ఆరు అసిస్టెన్స్ ఇచ్చాడు. ఈ ఏడాది చివరి వరకూ సమర్థుడిగా ఎదుగుతాడని ఆశిస్తున్నాడు. తొలిసారి హీరో ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న దౌటీ తన ప్రతిభను మరింత బలోపేతం చేసుకున్నాడు. అభిమానుల ఫాంటసీ టీంలో దౌటీ విలువ రూ.9.9 కోట్లు పలుకుతున్నది.