Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

తొలి గెలుపుకోసం చెన్నై, గోవా పాట్లు

పనాజీ: ఎఫ్‌సి గోవా జట్టుతోపాటు గత ఏడాది చాంపియన్‌ చెన్నైయిన్‌ జట్లు తొలి విజయం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. తమ ఆట తీరు మెరుగు పరుచుకొనేందుకు పనాజీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో గురువారం సాయంత్రం ఏడు గంటలకు తల పడనున్నాయి.

ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచ్‌ల్లో చెన్నైయిన్‌ ఎఫ్‌సి కేవలం ఒక్క పాయింట్‌ మాత్రమే గెలుచుకుని ముందడుగు వేసేందుకు మార్గాలు అన్వేషిస్తున్నది. ఈ మ్యాచ్‌కైనా మెరుగైన ఆటతీరు ప్రదర్శించాలని జట్టు సభ్యులను చెన్నై కోచ్‌ మార్కో మాట్టరాజీ అభ్యర్థించాడు.

సెమీ ఫైనల్‌లోకి ప్రవేశించేందుకు అడ్డంకులు కొని తెచ్చుకోవద్దని తమ క్లబ్‌ విజయం కోసం జట్టు సభ్యులు తమ ఆటతీరును ప్రదర్శించాలని మాట్టరాజీ సూచించాడు. గత ఏడాది జరిగిన మ్యాచ్‌లో ఎఫ్‌సి గోవాపై చెన్నై 3 - 2 స్కోర్‌ తేడాతో అద్భుతమైన విజయం సాధించింది.

ISL: Chennaiyin FC to face Goa on Today

ఢిల్లీ డైనమోస్‌ చేతిలో 1 - 3 స్కోర్‌ తేడాతో జట్టు ఓటమిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశాడు. ఒకవేళ ఆట నిబంధనలు మార్చి 12వ ప్లేయర్‌గా తనను తీసుకుంటే తానూ ఆడేందుకు సిద్ధమన్నాడు. ఢిల్లీ డైనమోస్‌తో చవిచూసిన ఘోర పరాజయం గత మూడేండ్లలోనే అత్యంత దారుణమని వ్యాఖ్యానించాడు.

89వ నిమిషం వరకు లీడ్‌చేసినా చివరిక్షణంలో మిస్సవ్వవచ్చునని, దానివల్ల షాక్‌కు గురి కావచ్చునని తెలిపాడు. కానీ ఢిల్లీతో జరిగిన ఓటమి నుంచి బయటకు రావాలని జట్టు సభ్యులను కోరాడు.

ఐఎస్‌ఎల్‌ 3 ఎడిషన్‌ రెండో రౌండ్‌ దాటినా పుణె ఇంకా బోణీ చేయనేలేదు. చీఫ్‌ కోచ్‌ జికో ఇంద్రజాల వ్యూహాలతో ముందుకు వెళ్లినా నార్త్‌ఈస్ట్‌ యునైటెడ్‌, ఎఫ్‌సి పుణె సిటీ జట్లతో ఓటమిని చవిచూసింది.

'మేం మంచి ఫలితం కోసం సిద్ధమయ్యాం. తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలుపుకోసం బాగానే ఆడినా ఫలితం సాధించలేకపోయాం. మేం మరో మంచి మ్యాచ్‌ కోసం సిద్ధమయ్యాం' అని జికో వ్యాఖ్యానించాడు. గతం నుంచి ప్రేరణ పొందాల్సిన అంశాలేమీ లేవని స్పష్టంచేశాడు.

గత ఏడాది ఐఎస్‌ఎల్‌ రెండో సీజన్‌లో ఫైనల్స్‌లో చెన్నైయిన్‌ చేతిలో పుణె ఓటమి పాలైంది. గత ఏడాది ఫైనల్స్‌ ఓటమికి ప్రతీకారం అని వ్యాఖ్యానించేందుకు జికో నిరాకరించాడు.

గత ఏడాది 34 గోల్స్‌లో పాయింట్ల పట్టికలో టాప్‌గా నిలిచిన గోవా.. తొలి సీజన్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. తమ కుర్రాళ్లు బాగానే ఆడుతున్నా.. ప్రత్యర్థి జట్ల క్రీడాకారులు, ప్రత్యేకించి గోల్‌ కీపర్లు గోల్స్‌ కాకుండా అడ్డుకుంటున్నారని వ్యాఖ్యానించాడు. గాయంతో బాధపడుతున్న సుభాషిష్‌ రాయ్‌ ఆడాలా? వద్దా? అన్న అంశంపై వైద్యులు నిర్ణయం తీసుకుంటారని జికో తెలిపాడు.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+