Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బెంగుళూరు ఖాతాలో గెలుపు: 1-0 తేడాతో నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఎఫ్‌సీ ప‌రాజ‌యం

ISL: Bengaluru FC register first away win; beat NorthEast United FC 1-0

హైదరాబాద్: ఇండియ‌న్ సూప‌ర్ లీగ్‌లో భాగంగా గౌహ‌తిలోని ఇందిరా గాంధీ స్టేడియంలో బెంగుళూరు ఎఫ్‌సీ, నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఎఫ్‌సీ తలపడ్డాయి. ఇరు జట్ల హోరాహోరీ పోరులో బెంగుళూరు 1-0 పాయింట్లతో విజయం సాధించింది. మికూ చేసిన గోల్ ఆట‌కు కీల‌కంగా మారింది. మికు 13వ నిమిషంలో గోల్ వేసేందుకు ప్ర‌య‌త్నించ‌గా ప్ర‌త్య‌ర్థి జ‌ట్టుకు చెందిన టీపీ రెహెనేశ్ అడ్డుకున్నాడు.

క్రితం వారం గోవా ఫుట్‌బాల్ జ‌ట్టుతో బెంగుళూరు ఫుట్‌బాల్ జ‌ట్టు త‌ల‌ప‌డిన విష‌యం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ప‌రాజయం పాలైన బెంగుళూరు శుక్ర‌వారం నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఎఫ్‌సీతో ఆడేందుకు చాలా ఓర్పును ప్ర‌ద‌ర్శించింది. జ‌ట్టులో కీల‌కమైన గోల్‌ను 47వ నిమిషంలో మికూ చేశాడు.

ఆ త‌ర్వాత 71వ నిమిషంలో సునీల్ చెత్రి చేసేందుకు ప్ర‌య‌త్నించ‌గా లెన్నీ రోడ్రిగ్స్ అడ్డుకోవ‌డంతో గోల్ విఫ‌ల‌మైంది. చివ‌ర వ‌ర‌కు మ‌రో గోల్ చేసేందుకు ప్ర‌య‌త్నించిన బెంగుళూరు జ‌ట్టుకు ప్ర‌త్య‌ర్థి జ‌ట్టు గ‌ట్టి పోటీ ఇచ్చింది. దీంతో ఒక గోల్‌తోనే స‌రిపెట్టుకోవాల్సి వ‌చ్చింది.

కాగా సునీల్ చెత్రి వివాహానంత‌రం జ‌రిగిన మొద‌టి మ్యాచ్‌లో పాల్గొన్నాడు. పెళ్లికూతురు మోహన్ బగాన్ దిగ్గజ పుట్‌‌బాలర్ సుబ్రతా భట్టాచార్య కూతురు సోనమ్ అన్న విషయం విదిత‌మే.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Saturday, December 9, 2017, 12:35 [IST]
Other articles published on Dec 9, 2017
Read in English: BFC beat NorthEast 1-0
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+