For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చెన్నై జట్టుకి ఇది రెండో సారి

ISL, Bengaluru FC 2 - 3 Chennaiyin FC: 5 moments that shaped the final

హైదరాబాద్: నాలుగు నెలలు పాటు సాగిన యుద్దంలో మిగిలిన తొమ్మిది జట్లను వెనక్కి నెట్టి చెన్నెయిన్ ఎఫ్‌సీ జట్టు లీగ్ టైటిల్ గెలుచుకుంది. ఇలా జరగడం చెన్నై జట్టుకు రెండోసారి. 2015 సంవత్సరంలో తొలిసారి విజేతగా నిలిచిన చెన్నయిన్‌ ఎఫ్‌సీ మరోసారి కప్పును కైవసం చేసుకుంది. దీంతో ఈ ఇండియన్‌ సూపర్‌ లీగ్‌కు తెరపడింది.

అసాధారణ ప్రదర్శనతో ఫైనల్‌కు దూసుకొచ్చిన కొత్త జట్టు బెంగళూరు ఎఫ్‌సీ టైటిల్‌ లో గెలవడంలో విఫలమైంది. లీగ్ జాబితాలోనే టాప్ స్థానంలో నిలిచిన బెంగుళూరు జట్టు శనివారం ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో చెన్నయిన్‌ చేతిలో 3-2తో ఓడింది.

సునీల్ చెత్రి తొలి గోల్‌ను చేసినా:
కెప్టెన్‌ సునీల్‌ ఛెత్రి 9వ నిమిషంలో చేసిన గోల్‌తో మొదట బెంగళూరు 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఐతే ఆ తర్వాత దూకుడు పెంచిన చెన్నయిన్‌ వరుసగా 3 గోల్స్‌ కొట్టింది. మైసన్‌ ఆల్వ్‌స్‌ (17, 45వ నిమిషం) రెండు గోల్స్‌ చేయగా.. రాఫెల్‌ ఆగస్టో (67వ) జట్టు ఆధిక్యాన్ని 3-1కు పెంచాడు. ఆ తర్వాత బెంగళూరు మరో గోల్‌ మాత్రమే చేయగలిగింది.

2014లో ఆరంభమైన ఐఎస్‌ఎల్‌లో.. ఈసారి అత్యధికంగా 10 జట్లు టైటిల్‌ కోసం పోటీపడ్డాయి. బెంగళూరు ఆటగాళ్లు ఇన్నేళ్లు వేరే జట్ల తరపున ఆడుతూ వచ్చారు. ఇప్పుడు కొత్తగా బెంగుళూరు, జంషెడ్‌పూర్‌ లీగ్‌లో చేరడంతో వారికంటూ ప్రత్యేక జట్టుగా పోటీ చేశారు. అంతేగాక బెంగుళూరు జట్టే చివరి వరకూ టాప్‌గా నిలిచింది. మొత్తం నాలుగు సీజన్‌లలో రెండుసార్లు అథ్లెటికో డి కోల్‌కతా విజేతగా నిలవగా.. మరో రెండుసార్లు చెన్నయిన్‌ కప్పు సొంతం చేసుకుంది.

Story first published: Sunday, March 18, 2018, 11:13 [IST]
Other articles published on Mar 18, 2018
-
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+