Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

"నా జట్టును చాంపియన్‌గా నిలుపుతా"

కోల్‌కతా: ఐఎస్‌ఎల్‌ తొలి సీజన్‌ చాంపియన్‌గా నిలిచిన అట్లెంటికో డి కోల్‌కతా (ఎటికె)ను తిరిగి మూడో ఎడిషన్‌ టోర్నీ చాంపియన్‌గా నిలబెట్టాలని జట్టు సారధి హోల్డర్‌ పోస్టిగా వ్యాఖ్యానించాడు. ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌)లో చాంపియన్ల జట్టుకు సారథ్యం వహించాలన్నదే తన కల అని పోర్చుగీస్‌ ఆటగాడు అయిన ఎటికే సారధి హెల్డర్‌ పోస్టిగా వ్యాఖ్యానించాడు.

వచ్చేనెల రెండో తేదీ నుంచి అసోం రాష్ట్ర రాజధాని గౌహతిలో మొదలయ్యే టోర్నీలో తన కెప్టెన్సీలో 'ఎటికే' జట్టును చాంపియన్ల జట్టుగా నిర్మించాలన్నది తన ఉత్తమ కల అని పేర్కొన్నాడు.

స్పెయిన్‌లోని సెగోవెలియాలో మూడు వారాల ప్రీ సీజన్‌ శిక్షణ ముగించుకున్న అట్లెంటికో డీ కోల్‌కతా జట్టు గురువారమే కోల్‌కతాకు చేరుకున్నది. జట్టు కోల్‌కతాకు చేరుకుని సేద తీరక ముందే కోచ్‌ జోస్‌ మోలినా సమయం వృధా చేయకుండా వెంటనే ప్రాక్టీస్‌ ప్రారంభించేశాడు కూడా. క్రీడాకారులు సైతం తమ ముందు ఉన్న షెడ్యూల్‌ గురించి అసమ్మతి వ్యక్తంచేయడం లేదు.

ISL: Atletico de Kolkata's Helder Postiga dreams of becoming champion as captain

వచ్చే నెల నుంచి మొదలయ్యే ఐఎస్‌ఎల్‌ మూడో సీజన్‌లో 'ఎటికె' జట్టు సారధిగా తన మనస్సులో మాటను బయటపెట్టాడు. జట్టు కెప్టెన్‌గా తనముందు ఒకే ఒక లక్ష్యం ఉందన్నాడు. అది తన జట్టును ఉత్తమమైందిగా తీర్చిదిద్దడమేనన్నాడు. ఐఎస్‌ఎల్‌ మూడో ఎడిషన్‌లో తన జట్టును రెండోసారి చాంపియన్లకు ప్రతినిధిగా తయారుచేయాలన్నదే తన సంకల్పం, కల అని పేర్కొన్నాడు.

క్రిస్టియానో రొనాల్డోతో కలిసి ఆడిన పొస్టిగా మోకాలికి గత ఏడాది చెన్నైయిన్‌ ఎఫ్‌సి జట్టుతో ఎటికె జట్టు ప్రారంభ మ్యాచ్‌లో ఆడుతున్నప్పుడు రెండుసార్లు గాయం కావడం యాదృచ్చికమే. ఇదిలా ఉంటే జట్టులోని ముగ్గురు క్రీడాకారులు క్లబ్‌తో తమకు గల కార్యకలాపాల వల్ల స్పెయిన్‌ టూర్‌కెళ్లలేకపోయారు. దీంతో వారంతా గురువారం జట్టుతో కలిసి, వచ్చే నెల నుంచి జరిగే లీగ్‌ మ్యాచ్‌ల కోసం ప్రాక్టీస్‌ ప్రారంభించారు.

సునిల్‌ చెత్రి రాకపై కొనసాగుతున్న అనిశ్చితి

ప్రస్తుతం ఐఎస్‌ఎల్‌ తొలి సీజన్‌లో ముంబై సిటీ ఎఫ్‌సి తరఫున పాల్గొన్న సునిల్‌ చెత్రి ప్రస్తుతం ఆయన నేతృత్వంలోని బెంగళూర్‌ క్లబ్‌ ఎఎఫ్‌సి కప్‌ టోర్నీలో పాల్గొంటున్నది. ఈ నేపథ్యంలో ఐఎస్‌ఎల్‌ మూడో సీజన్‌లో సునిల్‌ చెత్రి రంగ ప్రవేశంపై అనిశ్చితి కొనసాగుతున్నది. ఎఎఫ్‌సిలో తొలి సెమీస్‌లో సింగపూర్‌ టీం టాంపిన్‌రోవర్స్‌ను మట్టి కరిపించిన బెంగళూరు ఇప్పటికే సెమీ ఫైనల్స్‌కు చేరుకున్నది.

చివరి సెమీస్‌లో మలేషియాతో వచ్చేనెల 19న తలపడుతుంది. బెంగళూరు ఎఫ్‌సి కోచ్‌ సైతం ఎఎఫ్‌సి టోర్నీ పూర్తి కాకముందే వచ్చేనెల రెండో తేదీ నుంచి ప్రారంభమయ్యే ఐఎస్‌ఎల్‌లో అడుగు పెట్దొందని గట్టిగా వార్నింగ్‌ ఇచ్చాడు. దీంతో వచ్చేనెల 19వ తేదీలోగా ఐఎస్‌ఎల్‌లో సునిల్‌ చెత్రి అడుగు పెట్టే అవకాశాలు సంక్లిష్టంగానే ఉన్నది.

Story first published: Tuesday, November 14, 2017, 10:06 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+