పాటోర్డా: ఐఎస్ఎల్ జట్టుని నడపడం ప్రపంచంలోకెల్లా అతిపెద్ద సవాలని కేరళ బ్లాక్ బస్టర్స్ చీఫ్ కోచ్ స్టీవ్ కొప్పెల్ సంచలన వ్యాఖ్యలుచేశాడు. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ సహ - యజమానిగా ఉన్నకేరళ బ్లాక్ బస్టర్స్‌కు అనుభవం కలిగిన ఇంగ్లిష్ మేనేజర్‌గా కొప్పెల్.. తన జట్టు పెర్పార్మెన్స్ పట్ల ఆందోళన చెందుతున్నాడు.
ఐదు మ్యాచ్‌ల్లోనూ ఐదు మార్కులే పొందిన తన జట్టును ఎలా ముందుకు తీసుకెళ్లాలని సతమతమవుతున్నట్లు తెలిపాడు. 'తుది జట్టు ఎంపికలో మీ పాత్ర లేకున్నాఏ మేనేజర్‌కైనా ఇది అతిపెద్ద సవాల్. మా జట్టులో ఫ్రాన్స్, స్పెయిన్, ఆఫ్రకాలతోపాటు భారతీయులు ప్లేయర్లుగా ఉన్నారు.
మీకు అన్ని రకాల కోచ్‌లు అందుబాటులో ఉండే.. ఏదో ఒక స్టయిల్ జట్టులో మెజారిటీ సభ్యులకు సూటవుతుంది. అప్పుడు ఆ జట్టు విజయవంతంగా ముందుకు వెళుతుంది' అని చెప్పాడు. సోమవారం ఎఫ్ సి గోవా జట్టుతో మ్యాచ్ జరుగనున్న నేపథ్యంలో కొప్పెల్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

మాంఛెస్టర్ యునైటెడ్ మాజీ వింగర్‌గా కొప్పెల్ 'ప్రపంచ ఫుట్‌బాల్ లీగ్‌లో 15 వారాల్లో జట్టు మేనేజ్‌మెంట్ అతిపెద్ద సవాల్ అని నేను భావిస్తున్నా. ఇది కేవలం నా ఒక్కటి సమస్యే కాదు. మొత్తం ఆర్గనైజేషన్‌కు వర్తిస్తుంది'అని అన్నాడు. కేరళ బ్లాక్ బస్టర్స్‌కు మూడో కోచ్ కావడం గమనార్హం.
తొలి రెండేండ్లలో పీటర్‌టేలర్, డేవిడ్‌జేమ్స్ ప్రధానకోచ్‌లుగా వ్యవహరించారు. 'ఫుట్‌బాల్ ఆటలో నా అనుభవం గొప్పదే కావచ్చు. దాన్ని అనుసరించే వారిని బట్టి విలువ మారుతుంది. ప్రతి ఒక్కరూ పరస్పరం స్నేహపూర్వకంగా వ్యవహరిస్తేనే ముందుకెళ్లడం సాధ్యం. ప్రయాణంలో ఇతరులు మనకు సహకరించకుంటే కష్ట పడాల్సి వస్తుంది. మొత్తం అనుభవం అంతా భయానకంగా ఉంది' అని ఆందోళన వ్యక్తంచేశాడు.
కోచిలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌ల్లోనూ సుమారు 55 వేల మంది అభిమానులు హాజరైనా డ్రాగా ముగించడం ఆందోళన కలిగిస్తున్నది. అభిమానుల నుంచి అద్భుతమైన మద్దతు లభిస్తున్నా ముందుకు దూసుకెళ్లకపోవడంతో బహుళ ప్రయోజన స్టేడియంలు నిర్మించాలని ప్రతిపాదిస్తున్నాడు కొప్పెల్. ఇంగ్లండ్‌లో మాదిరిగా పలు రకాల స్టేడియంలు ఇక్కడ లేవని, ఇంగ్లండ్‌లో మాదిరిగా భయపడాల్సిన అవసరంలేదన్నాడు.
విజయం కోసం కేరళ, గోవా పాట్లు
ఎఫ్ సి గోవా, కేరళ బ్లాక్ బస్టర్స్ జట్లు ఇటీవల తాము సాధించిన పాజిటివ్ ఫలితాల ఆధారంగా సోమవారం జరిగే మ్యాచ్‌లో విజయంపై కేంద్రీకరించాయి. ముంబై సిటీ ఎఫ్‌సితో జరిగిన తొలి మ్యాచ్‌లో విజయం, తర్వాత నాలుగు మ్యాచ్‌ల్లో నాలుగు పాయింట్లు సాధిస్తే.. కేరళ కూడా గత రెండు మ్యాచ్‌ల్లో రెండు నాలుగు పాయింట్లు, తొలి మూడు మ్యాచ్‌ల్లో ఒక్క పాయింట్ మాత్రమే సాధించి పాయింట్ల పట్టికలో దిగువన ఉన్నాయి.
ఎఫ్ సి గోవా చీఫ్ కోచ్ జికో మాట్లాడుతూ తాము ముందుకు వెళ్లాలంటే సోమవారం జరిగే మ్యాచ్‌లో గెలుపొందాల్సిన అవసరం ఉందని, ఇతర సీజన్లతో పోలిస్తే ఈ ఏడాది టోర్నమెంట్ చాలా బ్యాలెన్స్‌డ్‌గా సాగుతున్నదన్నారు. తమ ప్రధాన లక్ష్యం 'టాప్ - 4'లో నిలవడమేనని, కనుక ఫోకస్ అంతా కేరళ బ్లాక్ బస్టర్స్‌తో జరిగే మ్యాచ్‌పైనే పెట్టామన్నారు. తొలి మ్యాచ్ లో విజయం సాధించినా.. తర్వాత నాలుగు మ్యాచ్‌ల్లో తమ కుర్రాళ్ల ఆటతీరు మరీ దారుణంగా ఉన్నదని జికో ఆందోళన వ్యక్తంచేశాడు.
ప్రత్యర్థి జట్లతో జరిగే మ్యాచ్‌లలో సొంత పొరపాట్లే ఎక్కువని అన్నాడు. గత రెండు మ్యాచ్‌ల్లోనూ గ్రెగోరీ ఆర్నోలిన్, సారధి లుసియో జట్టులోకి రావడం సానుకూల పరిణామం అని తెలిపాడు. లుసియో, గ్రేగరీ అందుబాటులో ఉండటంతో సెంట్రల్ బ్యాక్ జోడీగా వారిని ఉపయోగించుకోనున్నట్లు తెలిపాడు. మ్యాచ్ ప్రారంభానికి ముందు జరిగే ప్రాక్టీస్‌ను బట్టి తుది జట్టు కూర్పు సాధిస్తామన్నారు. పూర్తిగా ఫిట్‌గా ఉన్న ఆటగాళ్లతోనే బరిలోకి దిగుతామని చెప్పాడు.
ఇక కేరళ బ్లాక్‌బస్టర్స్ గత 3 మ్యాచ్ ల్లోనూ మూడు గోల్స్ మాత్రమే చేసింది. అరోన్ హుగెస్, సెడ్రిక్ హెంగ్‌బార్ట్, సందేశ్ జిగ్నాస్ వంటి డిపెన్సివ్ ఆటగాళ్లు ఉన్నారు. కేవలం డిఫెన్స్‌పైనే కేంద్రీకరించి మ్యాచ్‌కు సిద్ధం కాబోమని జట్టు కోచ్ స్టీవ్ కొప్పెల్ వ్యాఖ్యానించాడు.