న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

ఐఎస్‌ఎల్ 2020.. హైదరాబాద్‌ ఎఫ్‌సీ జట్టు ఇదే!!

ISL 2020: Full team list of Hyderabad FC

హైదరాబాద్: తొలి సీజన్‌ (2019-20)లో అనుకున్నంత స్థాయిలో ప్రదర్శన కనబరచని హైదరాబాద్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ (ఎఫ్‌సీ) ఈ సారి మెరుగైన ప్రదర్శన ఇవ్వాలనే పట్టుదలతో ఉంది. ఇందుకోసం స్పెయిన్‌కు చెందిన మాన్యుయెల్‌ మార్కజ్‌ను తమ హెడ్‌ కోచ్‌గా కూడా నియమించింది. గత సీజన్‌లో హైదరాబాద్‌ ఎఫ్‌సీ పూర్తిగా తేలిపోయింది. కేవలం రెండు విజయాలు మాత్రమే నమోదు చేసి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచి నిరాశ పరిచింది. దీంతో ఈసారి మెరుగైన ప్రదర్శన ఇవ్వాలని చూస్తోంది.

రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ పద్ధతిన జరిగే ఈ టోర్నీలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. అనంతరం సెమీ ఫైనల్స్‌ జరుగుతాయి. కరోనా ఉండటంతో ఈసారి ఇంటా, బయట పద్ధతిలో కాకుండా ఒకే చోట సెమీస్‌ మ్యాచ్‌లు జరుగుతాయి. ఇక్కడ విజేతలుగా నిలిచిన జట్లు ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ఇప్పటి వరకు లీగ్‌ తొలి అంచె మ్యాచ్‌ తేదీలను మాత్రమే నిర్వాహకులు ప్రకటించారు. డిసెంబర్‌లో రెండో అంచె పోటీలతో పాటు సెమీస్, ఫైనల్‌ తేదీలను ప్రకటించే అవకాశం ఉంది. సోమవారం ఒడిశాతో హైదరాబాద్ తన తొలి మ్యాచులో తలపడనుంది.

హైదరాబాద్‌ ఎఫ్‌సీ జట్టు:
గోల్‌ కీపర్లు: లాల్బియాక్లువా జోంగ్టే, లక్ష్మీకాంత్, మానస్‌ దూబే, సుబ్రతా పాల్‌.

డిఫెండర్లు: ఆకాశ్‌ మిశ్రా, ఆశిష్‌ రాయ్, చింగ్లెన్‌సనా సింగ్, డింపిల్‌ భగత్, కిన్‌సైలాంగ్‌ ఖోంగ్సిట్, నిఖిల్‌ ప్రభు, ఒడి ఒనైందియా, సాహిల్‌ పన్వార్‌.

మిడ్‌ ఫీల్డర్లు: అభిషేక్‌ హల్దార్, ఆదిల్‌ ఖాన్, సాహిల్‌ తవోరా, హలిచరన్‌ నర్జారీ, హితేశ్‌ శర్మ, జావో విక్టోర్, లల్దాన్‌మవియా రాల్టే, లూయిస్‌ సస్ట్రే, మార్క్‌ జొతాన్‌పుయా, మొహమ్మద్‌ యాసిర్, నిఖిల్‌ పూజారి, సౌవిక్‌ చక్రవర్తి, స్వీడెన్‌ ఫెర్నాండెస్‌.

ఫార్వర్డ్స్‌: సాంటాన, సాండ్రెజ్, ఇషాన్‌ డే, జోల్‌ చియానీస్, లాలాంపుయా, లిస్టన్‌ కొలాకో, రోహిత్‌ దను.

హెడ్‌ కోచ్‌: మాన్యుయెల్‌ మార్కజ్‌.

2019 ప్రపంచకప్‌కు రాయుడిని ఎంపిక చేయకపోవడం తప్పే: మాజీ సెలెక్టర్2019 ప్రపంచకప్‌కు రాయుడిని ఎంపిక చేయకపోవడం తప్పే: మాజీ సెలెక్టర్

Story first published: Saturday, November 21, 2020, 18:40 [IST]
Other articles published on Nov 21, 2020
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X