ISL 2020 21: చివరలో విలియమ్స్ గోల్.. మోహన్ బగాన్‌కు మరో విజయం!!

గోవా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ టోర్నీ ఏడో సీజన్‌లో ఏటికే మోహన్ బగాన్ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. గోవా వేదికగా గురువారం రాత్రి చెన్నయిన్ ఎఫ్‌సీతో జరిగిన మ్యాచులో 1-0తో మోహన్ బగాన్ విజయాన్ని అందుకుంది. 91వ నిమిషంలో విలియమ్స్ గోల్ బాది మోహన్ బగాన్‌కు విజయాన్ని అందించాడు. చివరి రెండు మ్యాచులలో ఒకటి ఓడి.. మరొకటి డ్రా చేసుకున్న ఏటికే.. ఈ మ్యాచులో విజయాన్ని అందుకుని సత్తాచాటింది.
తొలి అర్ధ భాగంలో ఏటికే మోహన్ బగాన్ ఆధిపత్యం చెలాయించింది. అయితే చెన్నయిన్ ఎఫ్‌సీ కూడా గట్టిపోటీ ఇచ్చింది. మోహన్ బగాన్ కొట్టిన గోల్స్‌ను చెన్నయిన్ పదేపదే అడ్డుకుంది. దీంతో తొలి అర్ధ భాగంలో ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. రెండో అర్ధ భాగంలో కూడా ఇరు జట్లు గోల్ కోసం ప్రయత్నాలు చేసినా.. అవి ఫలించలేదు. దీంతో మ్యాచులో ఒక్క గోల్ కూడా నమోదు కాదనిపించింది. అయితే 91వ నిమిషంలో విలియమ్స్ గోల్ బాది మోహన్ బగాన్‌ను 1-0తో ఆధిక్యంలో నిలిపాడు. 13 మ్యాచులు ఆడిన చెన్నయిన్ 3 విజయాలతో పట్టికలో 6వ స్థానంలో ఉంది.
శుక్రవారం జరిగే పోరులో ఈస్ట్ బెంగాల్ ఎఫ్‌సీతో ముంబై సిటీ తలపడుతుంది. ఈ మ్యాచులో ముంబై సిటీ ఫేవరేట్ జట్టుగా బరిలోకి దిగనుంది. ముంబై సిటీ, ఏటికే మోహన్ బగాన్, గోవా ఎఫ్‌సీ టాప్-3లో ఉన్నాయి. 11 మ్యాచులలో 8 విజయాలు అందుకుని 26 పాయింట్లతో ముంబై అగ్రస్థానంలో ఉంది. 12 మ్యాచులు ఆడిన ఏటికే 7 విజయాలతో 24 పాయింట్లు ఖాతాలో వేసుకుని రెండో స్థానంలో ఉంది. గోవా ఐదు విజయలతో 19 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. హైదరాబాద్, నార్త్ ఈస్ట్ యునైటెడ్ టాప్-5లో ఉన్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications