For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డబుల్ ధమాఖా.. రేపు రెండు మ్యాచ్‌లు.. అభిమానులకు పండగే!!

ISL 2020-21: Two matches tomorrow, Chennaiyin FC vs Kerala Blasters kick off

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 మాదిరే ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) 2020 కూడా అభిమానులకు డబుల్ ధమాఖా ఇవ్వనుంది. ఐఎస్‌ఎల్‌ 2020లో భాగంగా ఆదివారం (నవంబర్ 29) రెండు మ్యాచ్‌లు ఫుట్‌బాల్‌ అభిమానులను అలరించనున్నాయి. సాయంత్రం 5 గంటలకు జంషెడ్‌పూర్ ఎఫ్‌సీ, ఒడిశా ఎఫ్‌సీ జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. ఇక రాత్రి 7:30 గంటలకు చెన్నయిన్‌ ఎఫ్‌సీ, కేరళ బ్లాస్టర్ ఎఫ్‌సీ జట్లు తలపడనున్నాయి. రెండు మ్యాచ్‌లు హోరాహోరీగా సాగనున్నాయి.

ప్రస్తుతం బెంగళూరు ఎఫ్‌సీ, హైదరాబాద్ ఎఫ్‌సీ జట్లు తలపడుతున్నాయి. 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం అయింది. ఇరు జట్లు కూడా రెండో మ్యాచ్ ఆడుతున్నాయి. హైదరాబాద్ ఆడిన ఒక మ్యాచ్ గెలవగా.. బెంగళూరు ఓడిపోయింది. హాఫ్ టైం ముగిసేసరికి ఇరు జట్లు ఒక్క గోల్ కూడా కొట్టలేదు.

జంషెడ్‌పూర్ vs ఒడిశా జట్లు:
జంషెడ్‌పూర్ ఎఫ్‌సీ: రెహ్నేష్ పరంబ, పీటర్ హార్ట్లీ, స్టీఫెన్ ఈజ్, సందీప్ మండి, లాల్డిన్లియానా రెంత్లీ, అలెక్స్, జితేంద్ర సింగ్, ఐటర్ మన్రోయ్, నెరిజస్ వాల్స్కిస్, ఐజాక్ వన్మల్సావ్మా, జాకిచంద్ సింగ్.
ఒడిశా ఎఫ్‌సీ: అర్ష్‌దీప్ సింగ్, గౌరవ్ బోరా, స్టీవెన్ టేలర్, హెన్డ్రీ ఆంటోనే, శుభం సారంగి, మార్సెలిన్హో లైట్ పెరీరా, సౌరభ్ మెహర్, తోయిబా సింగ్, డియెగో మారిసియో, మాన్యువల్ ఓంవు, నందకుమార్ సేకర్.

చెన్నయిన్‌ vs కేరళ బ్లాస్టర్ జట్లు:
చెన్నయిన్‌ ఎఫ్‌సీ: విశాల్ కైత్, ఎనెస్ సిపోవిక్, ఎలి సాబిక్, అనిరుధ్ థాపా, లల్లియన్‌జులా చాంగ్టే, రాఫెల్ క్రివెల్లారో, ఎస్మాల్ గోన్వాల్వ్స్, రీగన్ సింగ్, జెర్రీ లాల్రిన్జులా, మెమో, జాకుబ్ సిల్వెస్ట్ర్.
కేరళ బ్లాస్టర్ ఎఫ్‌సీ: అల్బినో గోమ్స్, కోస్టా న్మోయిన్సు, జెస్సెల్ కార్నెరో, బకరీ కోన్, సెర్గియో సిడోంచా, సీత్యసేన్ సింగ్, విసెంటే గోమెజ్, సహల్ అబ్దుల్ సమద్, కరుతదత్కుని ప్రశాంత్, నిషు కుమార్, గ్యారీ హూపర్.

Story first published: Saturday, November 28, 2020, 20:33 [IST]
Other articles published on Nov 28, 2020
-
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+