వాస్కోడిగామా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) 2020-21లో భాగంగా శుక్రవారం రాత్రి ఈస్ట్ బెంగాల్, కేరళ బ్లాస్టర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 1-1 గోల్స్‌తో 'డ్రా'గా ముగిసింది. ఈ మ్యాచ్‌లో మొదటి నుంచి ఈస్ట్ బెంగాల్‌దే ఆధిపత్యం సాగింది. అయితే బెంగాల్ చేసిన ప్రయత్నాలను కేరళ సమర్థంగా అడ్డుకుంది. మరోవైపు కేరళ కూడా గోల్ అవకాశాలను చేజార్చుకోవడంతో.. తొలి అర్ధభాగం ముగిసినా రెండు జట్లూ స్కోరు చేయలేకపోయాయి.
విరామం తర్వాత 64వ నిమిషంలో జోర్డాన్ ముర్రే చేసినా గోల్‌తో కేరళ ఆధిక్యంలోకి వెళ్లింది. దాదాపు మ్యాచ్ చివరి వరకు ఆ జట్టు ఆధిక్యాన్ని కాపాడుకుంటూ వెళ్లడంతో.. గెలుపు కేరళదే అనుకున్నారు అందరూ. కానీ 90వ నిమిషంలో ఈస్ట్ బెంగాల్ ఆటగాడు స్కాట్ నెవిల్లె బంతిని నెట్లోకి పంపి స్కోరు సమం చేశాడు. ఆ తర్వాత రెండు జట్లు మరో గోల్ కొట్టకపోవడంతో మ్యాచ్ డ్రా అయింది.
ఐఎస్ఎల్ 2020-21లో భాగంగా ఈరోజు రాత్రి 7.30 గంటలకు ముంబై సిటీ, హైదరాబాద్ ఎఫ్‌సీ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచులో వరుస విజయాలతో ఊపుమీదున్న ముంబై సిటీ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. ముంబై ఆడిన పది మ్యాచులలో ఎనమిది విజయాలు అందుకుని.. 25 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఇక హైదరాబాద్ ఆడిన పది మ్యాచులలో నాలుగు విజయాలు, మూడు డ్రాలు, మూడు పరాజయాలను ఎదుర్కొంది. హైదరాబాద్ 15 పాయింట్లతో నాలుగవ స్థానంలో ఉంది.
4 పరుగుల తేడాలో మూడు వికెట్లు.. ఆసీస్ స్కోర్ 332/8!!
మైఖేల్‌లో ఫాంటసీ పుట్‌బాల్ ఆడండి. బహుమతులు గెలవండి