For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ISL 2020 21: ఈస్ట్ బెంగాల్ vs చెన్నయిన్ ఎఫ్‌సీ.. ముఖాముఖీ రికార్డ్స్!!

ISL 2020-21: SC East Bengal vs Chennaiyin FC Head to Head Record

పనాజి: ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) ఫుట్‌బాల్‌ టోర్నీ 2020-21 సీజన్‌లో భాగంగా ఈరోజు రాత్రి ఈస్ట్ బెంగాల్, చెన్నయిన్ ఎఫ్‌సీ జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. గత సీజన్‌లో రన్నరప్‌గా నిలిచిన చెన్నైయిన్ 113 మ్యాచ్‌ల్లో 43 విజయాలతో లీగ్‌లో 38.05 శాతం సక్సెస్ రేటును కలిగి ఉంది. అయితే ఈ సీజన్లో మాత్రం ఇంకా ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేదు. ఆ జట్టు ఖాతాలో కేవలం రెండు పాయింట్లు మాత్రమే ఉన్నాయి. పట్టికలో చిట్టచివరి స్థానంలో ఉంది.

చెన్నయిన్ ఎఫ్‌సీ ఆడిన ఆరు మ్యాచులలో రెండు విజయాలు అందుకుని 8 పాయింట్లతో పట్టికలో ఎనిమిదవ స్థానంలో ఉంది. ఈ మ్యాచులో చెన్నయిన్ ఫెవరేట్ జట్టుగా బరిలోకి దిగుతోంది. చెన్నైయిన్ ఇటీవల ఎఫ్‌సీ గోవాపై 2-1 తేడాతో విజయం సాధించి రెండు స్థానాలు మెరుగుపరుచుకుని ఆరవ స్థానానికి చేరుకుంది. ఐఎస్‌ఎల్‌ టోర్నీలో ఇరు జట్లు తొలిసారి తలపడనున్నాయి. 2019-20 సీజన్‌లో చెన్నైయిన్ 39, ఈస్ట్ బెంగాల్ 23 గోల్స్ చేశాయి.

ఐఎస్‌ఎల్‌ 2020-21 సీజన్‌లో భాగంగా గురువారం, శుక్రవారం మ్యాచులు లేవు. క్రిస్టమస్ పండగ సందర్భంగా రెండు రోజులు మ్యాచులు షెడ్యూల్ చేయలేదు. ఈరోజు మళ్లీ మ్యాచ్ జరగనుంది. ముంబై సిటీ 16 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. ఏటీకే మోహన్ బగాన్ అదే 16 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. బెంగళూరు ఎఫ్‌సీ (12), నార్త్ ఈస్ట్ యునైటెడ్ (11), ఎఫ్‌సీ గోవా (11) టాప్-5లో ఉన్నాయి.

Story first published: Saturday, December 26, 2020, 18:35 [IST]
Other articles published on Dec 26, 2020
-
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+