Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ISL 2020: ఈస్ట్ బెంగాల్ vs మోహన్ బగాన్.. జట్లు ఇవే!!

ISL 2020-21: SC East Bengal vs ATK Mohun Bagan Preview, Predicted starting XI

హైదరాబాద్‌: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 మాదిరే ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) 2020 కూడా క్రీడా అభిమానులను అలరిస్తోంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఒక్కో గోల్‌ మాత్రమే నమోదు అయినా.. మూడో మ్యాచ్‌లో‌ మాత్రం అసలైన ఫుట్‌బాల్‌ వినోదాన్ని పంచింది. ఇక హైదరాబాద్‌ మ్యాచ్ అందరిని ఆకట్టుకుంది. కేరళ, నార్త్ ఈస్ట్ జట్ల మధ్య గురువారం జరిగిన మ్యాచ్ కూడా అభిమానులను అలరించింది. శుక్రవారం కూడా రసవత్తరపోరు జరగనుంది. కోల్‌కతాకే చెందిన ఎస్సీ ఈస్ట్ బెంగాల్, ఏటీకే మోహన్ బగాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ రెండు జట్ల మధ్య పోటీని ఆసియాలోనే ప్రతిష్టాత్మకంగా భావిస్తారు.

ఈస్ట్ బెంగాల్ కోచ్ రాబీ ఫౌలర్ మాట్లాడుతూ... 'ఈ మ్యాచ్ మా ఆటగాళ్లకు చాలా కఠినమైనది. ఇది జట్టుకు గొప్ప ఆరంభం అవుతుంది. అన్ని సవాళ్లకు సిద్ధంగా ఉన్నాం. గెలవడానికి ప్రయత్నిస్తాం. మాపై ఎలాంటి ఒత్తిడి లేదు. మోహన్ బాగన్‌పై అన్ని విధాలా ఒత్తిడి తెచ్చేలా ఆడుతాం. ఇతర జట్ల మాదిరిగా సన్నద్ధం కావడానికి మాకు చాలా వారాలు లేవు. కాని మేము నిజంగా మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నాం. మా మద్దతుదారుల కోసం గొప్పగా ఆడాలని నేను ఎప్పుడూ కోరుకుంటున్నాను. కానీ దురదృష్టవశాత్తు అది జరగదు. ఈసారి నిరాశపరచం' అని అన్నాడు.

జట్లు:
ఈస్ట్ బెంగాల్: డెబ్జిత్ మజుందర్, గుర్తేజ్ సింగ్, డేనియల్ ఫాక్స్, స్కాట్ నెవిల్లే, సమద్ మల్లిక్, మట్టి స్టెయిన్మాన్, మహ్మద్ రఫీక్, యూజీనిసన్ లింగ్డో, ఆంథోనీ పిల్కింగ్టన్, జాక్వెస్ మాగోమా, జెజే లాల్పెఖ్లువా.

మోహన్ బాగన్: అరిందం భట్టాచార్జా; ప్రీతమ్ కోటల్, సందేశ్ జింగాన్, తిరి, ప్రబీర్ దాస్, ప్రణయ్ హాల్డర్, జేవియర్ హెర్నాండెజ్, కార్ల్ మెక్‌హగ్, సుభాషిష్ బోస్, రాయ్ కృష్ణ, డేవిడ్ విలియమ్స్.

Story first published: Friday, November 27, 2020, 15:42 [IST]
Other articles published on Nov 27, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+