Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ISL 2020 21: బెంగళూరు చిత్తు.. కేరళ బ్లాస్టర్స్ ఖాతాలో మరో విజయం!!

ISL 2020-21: Rahul KP shine Kerala Blasters FC beats Bengaluru FC with 2-1

గోవా: ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) ఫుట్‌బాల్‌ టోర్నీ ఏడో సీజన్‌లో కేరళ బ్లాస్టర్స్ ఎఫ్‌సీ జట్టు మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. గోవా వేదికగా బుధవారం రాత్రి బెంగళూరు‌ ఎఫ్‌సీతో జరిగిన మ్యాచులో 2-1తో కేరళ బ్లాస్టర్స్ విజయాన్ని అందుకుంది. దీంతో ఏడో సీజన్‌లో కేరళ బ్లాస్టర్స్ మూడో విజయాన్ని అందుకుంది. తొలి అర్ధభాగంలో బెంగళూరు‌ ఆధిపత్యం ప్రదర్శించినా.. రెండో భాగంలో రెండు గోల్స్ కొట్టిన కేరళ జయకేతనం ఎగురవేసింది.

23వ నిమిషంలో క్లెటన్ సిల్వా గోల్ కొట్టి బెంగళూరు‌ ఎఫ్‌సీ జట్టు ఖాతా తెరిచాడు. తొలి అర్ధభాగం ముగిసేసరికి కూడా మరో గోల్ నమోదుకాకపోవడంతో బెంగళూరు‌ ఆధిక్యంలో నిలిచింది. రెండో భాగంలో కేరళ బ్లాస్టర్స్ అద్భుతంగా పుంజుకుంది. ఏకంగా రెండు గోల్స్ కొట్టి మ్యాచును సొంతంచేసుకుంది. 73వ నిమిషంలో లాల్తాతంగ ఖవ్ల్రింగ్, 93వ నిమిషంలో రాహుల్ కేపీ గోల్స్ బాదారు. 12 మ్యాచులు ఆడిన కేరళ 3 విజయాలతో పట్టికలో 9వ స్థానంలో ఉంది. ఇక బెంగళూరు‌ 7వ స్థానంలో ఉంది.

బుధవారం జరిగే పోరులో చెన్నయిన్ ఎఫ్‌సీతో ఏటికే మోహన్ బగాన్ తలపడుతుంది. ఈ మ్యాచులో ఏటికే ఫేవరేట్ జట్టుగా బరిలోకి దిగనుంది. ముంబై సిటీ, ఏటికే మోహన్ బగాన్, గోవా ఎఫ్‌సీ టాప్-3లో ఉన్నాయి. 11 మ్యాచులలో 8 విజయాలు అందుకుని 26 పాయింట్లతో ముంబై అగ్రస్థానంలో ఉంది. 11 మ్యాచులు ఆడిన ఏటికే 6 విజయాలతో 21 పాయింట్లు ఖాతాలో వేసుకుని రెండో స్థానంలో ఉంది. గోవా ఐదు విజయలతో 19 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది.

Story first published: Thursday, January 21, 2021, 8:43 [IST]
Other articles published on Jan 21, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+