Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ISL 2020 21: ఒడిశాతో ఈస్ట్ బెంగాల్‌ ఢీ.. చివరి మ్యాచ్‌లో విజయం ఎవరిది?

ISL 2020-21: Odisha FC vs SC East Bengal preview, Predicted XIs

గోవా: ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) ఏడో సీజన్‌లో మరో మ్యాచుకు సమయం ఆసన్నమైంది. ఈరోజు రాత్రి 7.30 గంటలకు బాంబోలిమ్‌లోని జిఎంసి స్టేడియంలో ఒడిశా ఎఫ్‌సీతో ఎస్సీ ఈస్ట్ బెంగాల్‌ ఢీ తలపడనుంది. పాయింట్ల పట్టికలో చివరి స్థానాల్లో ఉన్న రెండు జట్లు ఈ సీజన్‌లో చివరి మ్యాచ్ ఆడనున్నాయి. ఒడిశా, ఈస్ట్ బెంగాల్‌ ఈ సీజన్‌లో పూర్తిగా నిరాశపరిచినప్పటికీ.. ఓ విజయంతో టోర్నీని ముగించాలని చూస్తున్నాయి.

ఒడిశా ఎఫ్‌సీ ఈ ఐఎస్‌ఎల్ సీజన్‌లో ఏకంగా 12 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. గత ఐదు మ్యాచులలో నాలుగు ఓడి, ఒకటి డ్రా చేసుకుంది. ఒడిశా ఇప్పటివరకు 19 మ్యాచులు ఆడి ఒకేఒక్క విజయం సాధించి.. పట్టికలో చివరిదైన 11వ స్థానంలో ఉంది. 19 మ్యాచులు ఆడిన ఈస్ట్ బెంగాల్ మూడు విజయాలతో పట్టికలో 9వ స్థానంలో ఉంది. ఇరు జట్లు తమ్ ఆచివరి మ్యాచులో అయినా విజయం సాధించాలని చూస్తున్నాయి. మరి ఎవరు గెలుస్తారో చూడాలి.

పాయింట్ల పట్టికలో ఏటికే మోహన్ బగాన్, ముంబై సిటీ, నార్త్ ఈస్ట్ యునైటెడ్ టాప్-3లో ఉన్నాయి. 19 మ్యాచులలో 12 విజయాలు అందుకుని 40 పాయింట్లతో ఏటికే అగ్రస్థానంలో ఉంది. 19 మ్యాచులు ఆడిన ముంబై 11 విజయాలతో 37 పాయింట్లు ఖాతాలో వేసుకుని రెండో స్థానంలో ఉంది. నార్త్ ఈస్ట్ ఎనమిది విజయాలతో 33 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. గోవా ఎఫ్‌సీ, హైదరాబాద్‌ ఎఫ్‌సీ టాప్-5లో ఉన్నాయి.

జట్లు (అంచనా):
ఒడిశా: అర్ష్‌దీప్ సింగ్, స్టీవెన్ టేలర్, జాకబ్ ట్రాట్, రాకేశ్ ప్రధాన్, కమల్‌ప్రీత్ సింగ్, జెర్రీ మావిహ్మింగ్‌తంగా, వినిత్ రాయ్, పాల్ రామ్‌ఫాంగ్‌జావా, బోరింగ్‌డావో బోడో, మాన్యువల్ ఒన్వు, డియెగో మారిసియో.

ఈస్ట్ బెంగాల్: మీర్షాద్ మిచు (జికె), స్కాట్ నెవిల్లే, సార్థక్ గొగ్లూయి, నబీన్ రభా, గుర్జిందర్ కుమార్, ఫనాయ్ లాల్‌రెంపుయా, మహ్మద్ రఫీక్, అజయ్ ఛెత్రి, ఆరోన్ అమాడి హోల్లోవే, బ్రిట్టో పిఎమ్.

Story first published: Saturday, February 27, 2021, 19:37 [IST]
Other articles published on Feb 27, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+