వాస్కోడిగామా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) 2020-21లో భాగంగా ఆదివారం సాయంత్రం జంషెడ్పూర్తో జరిగిన మ్యాచులో నార్త్ ఈస్ట్ యునైటెడ్ 2-1తో విజయాన్ని అందుకుంది. ఏడు మ్యాచుల తర్వాత నార్త్ ఈస్ట్ ఓ విజయాన్ని అందుకుంది. చివరి ఐదు మ్యాచులలో ఓ విజయం, రెండు ఓటములు, రెండు డ్రాలను ఎదురొంది. నార్త్ ఈస్ట్ 12 మ్యాచులలో 3 విజయాలతో 15 పాయింట్లు ఖాతాలో వేసుకుని పత్రికలో ఐదవ స్థానంలో ఉంది.
36వ నిమిషంలో అశుతోష్ మెహతా గోల్ చేసి నార్త్ ఈస్ట్ యునైటెడ్ జట్టుకు ఆధిక్యాన్ని అందించాడు. దీంతో తొలి అర్ధ భాగాన్ని నార్త్ ఈస్ట్ 1-0తో ముగించింది. 61 నిమిషంలో బ్రౌన్ మరో గోల్ చేసి నార్త్ ఈస్ట్ ఆధిక్యాన్ని 2-0కు పెంచాడు. 89వ నిమిషంలో జంషెడ్పూర్ ఆటగాడు పీటర్ హార్ట్లీ గోల్ చేసి నార్త్ ఈస్ట్ ఆధిక్యాన్ని 1-2కి తగ్గించాడు. ఆపై మరో గోల్ నమోదుకాకపోవడంతో నార్త్ ఈస్ట్ విజయాన్ని అందుకుంది. ఆదివారం జరిగిన మరో మ్యాచ్ డ్రా అయింది. గోవా-ఏటీకే మధ్య జరిగిన మ్యాచ్ 1-1తో డ్రా అయింది. ఈరోజు చెన్నయిన్, ఈస్ట్ బెంగాల్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.
ఫుట్బాల్ ప్రముఖ క్రీడాకారులు కల్హానోగ్లు, హెర్నాండెజ్లకు జరిపిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలింది. ఎలాంటి లక్షణాలు లేకున్నా ఇద్దరు క్రీడాకారులకు కరోనా సోకిందని ఏసీమిలన్ జట్టు తెలిపింది. ఏసీ మిలన్ జట్టు సభ్యులందరికీ కరోనా పరీక్షలు చేయగా వారిలో కల్హానోగ్లు, హెర్నాండెజ్లకు కరోనా పాజిటివ్ అని తేలింది. జట్టులోని మిగతా సభ్యులకు కరోనా నెగిటివ్ అని తేలింది. కరోనా సోకిన కల్హానోగ్లు, హెర్నాండెజ్లను ఐసోలేషన్ కు తరలించి వారిని వైద్యులు చికిత్స చేస్తున్నారని ఫుట్ బాల్ క్లబ్ తెలిపింది. దిగ్గజ క్రీడాకారులు కరోనా బారిన పడటంతో వారు జట్టులో ఆడటం లేదని ఫుట్ బాల్ క్లబ్ మేనేజరు స్టెఫానో పియోలి చెప్పారు.
కంటతడి పెట్టిస్తోన్న హార్దిక్ పాండ్యా భావోద్వేగపూరిత పోస్ట్!!
మైఖేల్లో ఫాంటసీ పుట్బాల్ ఆడండి. బహుమతులు గెలవండి