Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ISL 2020 21: ముంబైని ఓడిస్తేనే జంషెడ్‌పూర్‌కు సెమీస్ ఆశలు.. హెడ్-టు-హెడ్ రికార్డ్స్!!

ISL 2020-21: Jamshedpur FC vs Mumbai City FC preview, Predicted XIs

గోవా: ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) ఏడో సీజన్‌లో మరో కీలక పోరుకు సమయం ఆసన్నమైంది. ఈరోజు రాత్రి 7.30 గంటలకు గోవాలోని తిలక్ మైదాన్ స్టేడియంలో ముంబై సిటీ ఎఫ్‌సీని జంషెడ్‌పూర్ ఎఫ్‌సీ ఢీ కొననుంది. ఈ మ్యాచ్ జంషెడ్‌పూర్ జట్టుకి చాలా కీలకం. ముంబైని ఓడిస్తేనే జంషెడ్‌పూర్‌కు సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి. జంషెడ్‌పూర్ 18 మ్యాచ్‌ల్లో 21 పాయింట్లతో పట్టికలో ఏడవ స్థానంలో ఉంది. వచ్చే రెండు మ్యాచులలో గెలిస్తే.. ప్లేఆఫ్ బెర్త్‌ దక్కించుకోవడానికి ఇతర జట్టు ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఒకవేళ ఒక మ్యాచ్ ఓడినా అంతే సంగతి.

జంషెడ్‌పూర్ ఎఫ్‌సీ ఈ ఐఎస్‌ఎల్ సీజన్‌లో ఏడు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. కేరళ బ్లాస్టర్స్ (8), ఒడిశా ఎఫ్‌సీ (10) మాత్రమే జంషెడ్‌పూర్ కంటే ఎక్కువ మ్యాచులు ఓడిపోయాయి. మరోవైపు ముంబై సిటీ ఇప్పటికే ప్లేఆఫ్స్‌లో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. అయితే హెడ్-టు-హెడ్ గణాంకాలు జంషెడ్‌పూర్ జట్టుకే అనుకూలంగా ఉన్నాయి. మూడు మ్యాచ్‌లను గెలిచి.. మరో రెండింటిని డ్రా చేసుకుంది. 34 పాయింట్లతో ముంబై పట్టికలో రెండో స్థానంలో ఉంది.

పాయింట్ల పట్టికలో ఏటికే మోహన్ బగాన్, ముంబై సిటీ, హైదరాబాద్‌ ఎఫ్‌సీ టాప్-3లో ఉన్నాయి. 18 మ్యాచులలో 12 విజయాలు అందుకుని 39 పాయింట్లతో ఏటికే అగ్రస్థానంలో ఉంది. 17 మ్యాచులు ఆడిన ముంబై 10 విజయాలతో 34 పాయింట్లు ఖాతాలో వేసుకుని రెండో స్థానంలో ఉంది. హైదరాబాద్‌ ఆరు విజయలతో 27 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. గోవా ఎఫ్‌సీ, నార్త్ ఈస్ట్ యునైటెడ్ టాప్-5లో ఉన్నాయి.

జట్లు (అంచనా):
జంషెడ్‌పూర్: రెహనేష్ టిపి (జికె), లాల్డిన్లియానా రెంత్లీ, స్టీఫెన్ ఈజ్, పీటర్ హార్ట్లీ, రికీ లల్లవ్‌మావ్మా, ఐటర్ మన్రోయ్, అలెక్స్ లిమా, విలియం లాల్నున్‌ఫెలా, ఫరూఖ్ చౌదరి, సిమిన్లెన్ డౌంగెల్, నెరిజస్ వాల్స్కిస్.

ముంబై సిటీ: అమృందర్ సింగ్ (జికె), విఘ్నేష్ దక్షిమమూర్తి, మౌర్తాడా పతనం, హెర్నాన్ సంతాన, అమీ రానావాడే, రౌలిన్ బోర్గెస్, అహ్మద్ జహౌ, సై గొడ్దార్డ్, రేనియర్ ఫెర్నాండెజ్, రేనియర్ ఫెర్నాండెజ్, బిపిన్ సింగ్, ఆడమ్ లే ఫోండ్రే.

Story first published: Saturday, February 20, 2021, 19:16 [IST]
Other articles published on Feb 20, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+