Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ISL 2020: చెన్నయిన్‌ ఎఫ్‌సీతో జంషెడ్‌పూర్‌‌ ఎఫ్‌సీ ఢీ.. జట్లు ఇవే!!

ISL 2020-21: Jamshedpur FC vs Chennaiyin FC Preview, Predicted starting XI

హైదరాబాద్‌: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 మాదిరే ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) 2020 కూడా క్రీడా అభిమానులను అలరిస్తోంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఒక్కో గోల్‌ మాత్రమే నమోదు అయినా.. మూడో మ్యాచ్‌లో‌ మాత్రం అసలైన ఫుట్‌బాల్‌ వినోదాన్ని పంచింది. ఇక గతరాత్రి హైదరాబాద్‌ ఎఫ్‌సీ అదరగొట్టింది. ఏకైక గోల్ కొట్టినా.. హైదరాబాద్‌ ఆటగాళ్లు మ్యాచ్ ఆసాంతం గొప్పగా ఆడారు. ఇది భాగ్యనగర ఫుట్‌బాల్‌ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఈరోజు రాత్రి చెన్నయిన్‌ ఎఫ్‌సీతో జంషెడ్‌పూర్‌‌ ఎఫ్‌సీ తలపడనుంది.

2017లో లీగ్‌లో ఆరంగేట్రం చేసిన జంషెడ్‌పూర్ ఎఫ్‌సీ ఇప్పటివరకు ప్లేఆఫ్‌ చేరలేదు. దీంతో ఈసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని బరిలోకి దిగుతోంది. టిపి రహేనేష్, నరేందర్ గెహ్లోట్, జాకిచంద్ సింగ్, నెరిజస్ వాల్స్కిస్ జంషెడ్‌పూర్ ఎఫ్‌సీకి ప్రధాన ఆటగాళ్లు. వీరందిపైనే ఆ జట్టు ఆశలు పెట్టుకుంది. ఫార్వర్డ్ నిక్ ఫిట్జ్‌గెరాల్డ్ (ఆస్ట్రేలియా) మరియు డిఫెండర్ స్టీఫెన్ ఈజ్ (నైజీరియా) ఆలస్యంగా జట్టులో చేరారు.

మరోవైపు చెన్నైయిన్ ఎఫ్‌సీ ఫైనల్స్‌కు అర్హత సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈ సీజన్లో కోచ్ ఓవెన్ కోయిల్‌ లేకపోవడం చెన్నైయిన్ ఎఫ్‌సీకి కాస్త ప్రతికూలాంశం. కొత్త కోచ్ సిసాబా లాస్లో చెన్నైయిన్ ఎఫ్‌సీ జట్టును ముందుండి నడిపించే అవకాశం ఉంది. లాస్లో 4-2-3-1తో ఫార్ములాను ఉపయోగించుకునే అవకాశం ఉంది. కోయిల్ మాత్రం అటాకింగ్ ఫార్ములాను ఉపయోగించేవాడు.

జట్లు:
జంషెడ్‌పూర్‌‌ ఎఫ్‌సీ:
టిపి రహేనేష్, లాల్డిన్లియానా రెంత్లీ, నరేందర్ గెహ్లోట్, పీటర్ హార్ట్లీ, సందీప్ మండి, ఐటర్ మన్రాయ్, అమర్జిత్ కియామ్, జాకిచంద్ సింగ్, అలెక్స్ లిమా, నికోలస్ ఫిట్జ్‌గెరాల్డ్, నెరిజస్ వాల్స్కిస్.

చెన్నైయిన్ ఎఫ్‌సీ:
విశాల్ కైత్, రీగన్ సింగ్, ఎలి సాబియా, ఎనెస్ సిపోవిక్, జెర్రీ లాల్రిన్జులా, ఎడ్విన్ సిడ్నీ వాన్స్‌పాల్, అనిరుధ్ థాపా; ఫత్ఖులో ఫత్ఖులోవ్, రాఫెల్ క్రివెల్లారో, లల్లియన్జులా చాంగ్టే, ఎస్మాయిల్ గోన్కల్వ్స్.

Story first published: Tuesday, November 24, 2020, 15:30 [IST]
Other articles published on Nov 24, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+