వాస్కో: ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్ఎల్) ఏడో సీజన్లో మరో మ్యాచ్ ఫలితం తేలకుండానే ముగిసింది. ఆదివారం హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్, జంషెడ్పూర్ ఫుట్‌బాల్ క్లబ్ మధ్య జరిగిన లీగ్ మ్యాచ్ గోల్స్ లేకుండానే డ్రా అయింది. దాంతో ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. హైదరాబాద్‌కు ఇది వరుసగా మూడో డ్రా కాగా.. జంషేడ్‌పూర్‌కు 5వది. రెండు మార్పులతో బరిలోకి దిగిన హైదరాబాద్.. ప్రారంభంలో మెరుగ్గా ఆడింది.
9వ నిమిషంలోనే గోల్ చేసే అవకాశం వచ్చినా జంషెడ్పూర్ గోల్ కీపర్ టీపీ రెహనేష్ సమర్థవంతంగా అడ్డుకున్నాడు. హాఫ్ మార్క్ టైమ్‌లో హాలీచరణ్ సర్జారీ కొట్టిన ఫైన్ షాట్‌ను కూడా అద్భుతంగా సేవ్ చేశాడు. ఈ రెండు సంఘటనల నుంచి తేరుకున్న తేరుకున్న జంషేడ్‌పూర్.. అటాకింగ్‌కు దిగింది. అయితే హైదరాబాద్ కీపర్‌ను తప్పించే సాహసం మాత్రం చేయలేకపోయారు.
ఫస్ట్ హాఫ్‌లో ఒక్క గోల్ కూడా కాకపోవడంతో సెకండ్ హాఫ్ మరింత బోరింగ్‌గా ఆడారు. ఇరు జట్లు డిఫెన్స్‌కే ప్రాధాన్యమివ్వడంతో క్లియర్ కట్ గోల్ చేసే అవకాశం ఒక్కరికీ రాలేదు. హైదరాబాద్ ఎఫ్‌సీ ప్లేయర్ సాంటానా షాట్‌కు ప్రయత్నించినా టార్గెట్‌ను ఛేదించలేకపోయాడు. హితేశ్ శర్మ కొట్టిన ఫ్రీకిక్ కూడా వృథా అయ్యింది.అయితే 87వ నిమిషంలో జంషెడ్పూర్ కొట్టిన ఫస్ట్ షాట్‌ను హైదరాబాద్ నిలువరించింది. ఇంజ్యూరీ టైమ్‌లో జంషెడ్పూర్ ప్లేయర్ షారుక్ గోల్ కొట్టినంత పనిచేసినా సక్సెస్ కాలేదు. దాంతో గోల్స్ లేకుండానే మ్యాచ్ ముగిసింది.
మరో మ్యాచ్ డ్రా..
మరోవైపు బెంగళూరు ఎఫ్‌సీ, ఒడిశా ఎఫ్‌సీ మధ్య జరిగిన మరో మ్యాచ్ కూడా 1-1తో డ్రా అయింది. బెంగళూరుకు పొర్తాల్(82వ నిమిషం) ఒడిశాకు డిగో మౌరిసియో(8వ నిమిషం) గోల్స్ అందించారు. తాజా విజయంతో బెంగళూరు 14 పాయింట్లతో ఏడో ప్లేస్‌లో ఉండగా.. ఒడిశా ఎనిమిది పాయింట్లతో లాస్ట్ ప్లేస్‌లో కొనసాగుతోంది.
మైఖేల్‌లో ఫాంటసీ పుట్‌బాల్ ఆడండి. బహుమతులు గెలవండి