Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐఎస్ఎల్ 2020.. ఏ జట్టుకు ఎంత మంది ఫాలోవర్లు ఉన్నారంటే!!

ISL 2020-21: ISL teams have most number of fans on social media

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మాదిరిగానే అభిమానులను అలరించేందుకు ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) సిద్ధంగా ఉంది. 2020-21 ఐఎస్ఎల్ సీజన్ నవంబర్ 20 నుంచి ప్రారంభం కానుంది. ఐఎస్ఎల్ 7వ ఎడిషన్‌కు గోవా అతిథ్యం ఇవ్వనుంది. గోవాలోని మూడు వేదికల్లో ఫుట్‌బాల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. మార్గోలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం, జీఎంసీ స్టేడియం, వాస్కో డా గామాలోని బాంబోలిమ్, తిలక్ మైదాన్లలో మ్యాచులు జరగనున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా ఈ సారి ప్రేక్షకులు లేకుండానే ఐఎస్ఎల్ టోర్నమెంట్ జరగనుంది.

ఈ సీజన్లో మొత్తం 11 జట్లు పాల్గొంటుండగా.. 115 మ్యాచ్‌లు జరగనున్నాయి. గత సీజన్‌లో జరిగిన 95 మ్యాచ్లతో పోలిస్తే.. ఇది చాలా ఎక్కువ. అన్ని జట్లు డబుల్ రౌండ్ రాబిన్ ఫార్మాట్లో పోటీపడతాయి. పాయింట్ల పట్టికలో మొదటి నాలుగు జట్లు ప్లేఆఫ్‌కు అర్హత సాధిస్తాయి. ప్రస్తుతం ఐఎస్ఎల్ ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన ఫుట్‌బాల్ లీగ్‌లలో ఒకటిగా మారింది. సోషల్ మీడియా విస్తృతం కావడంతో జనాల్లో దీనికి ఆదరణ భారీగా పెరిగింది. సోషల్ మీడియాలో ఏ జట్టుకు ఎంత మంది ఫాలోవర్లు ఉన్నారో చూద్దాం.

ఒడిశా ఎఫ్‌సి ఈ ఏడాది తమ రెండవ సీజన్‌ను ఆడనుంది. ఈ ఫ్రాంచైజీని ఇంతకు ముందు ఢిల్లీ డైనమోస్ ఎఫ్‌సి అని పిలిచేవారు. గత ఏడాది నుంచి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఒడిశా ఎఫ్సికి ఫాలోవర్స్ సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం ఆ జట్టుకు ఇన్‌స్టాగ్రామ్‌లో 46,000 మంది, ట్విట్టర్‌లో 18,000 మంది, ఫేస్‌బుక్‌లో 11,000 మంది ఫాలోవర్లు ఉన్నారు.

గత ఏడాది హైదరాబాద్ ఎఫ్‌సి ఐఎస్‌ఎల్‌లో కొత్తగా ప్రవేశించింది. చార్మినార్తో క్రియేటివిటీ లోగోను కలిగి ఉన్నారు. గత సీజన్లో వారి పేలవమైన ప్రదర్శన కారణంగా హైదరాబాద్ ఎఫ్‌సి పాయింట్ల పట్టికలో వెనుకబడింది. ఈ క్లబ్ ఇన్‌స్టాగ్రామ్‌లో 49,000 మంది, ఫేస్‌బుక్‌లో 20,000, ట్విట్టర్‌లో 10,000 మంది ఫాలోవర్లు ఉన్నారు.

జంషెడ్‌పూర్ ఎఫ్‌సి- ఇన్‌స్టాగ్రామ్‌లో 1.17 లక్షల మంది, ఫేస్‌బుక్లో 1.10 లక్షల మంది, ట్విట్టర్‌లో 25,000 మంది ఫాలోవర్లు.

బెంగళూరు ఎఫ్‌సి- ఫేస్‌బుక్‌లో 3.44 లక్షలు, ట్విట్టర్‌లో 2.78 లక్షలు, ఇన్‌స్టాగ్రామ్‌లో 2.17 లక్షల మంది ఫాలోవర్లు.

ముంబై సిటీ ఎఫ్‌సి- ఫేస్‌బుక్‌లో 5.67 లక్షల మంది, ట్విట్టర్‌లో 1.72 లక్షలు, ఇన్‌స్టాగ్రామ్‌లో 1.52 లక్షల మంది ఫాలోవర్లు.

నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఎఫ్‌సి- ట్విట్టర్‌లో 4.28 లక్షలు, ఫేస్‌బుక్‌లో 3.31 లక్షలు, ఇన్‌స్టాగ్రామ్‌లో 1.64 లక్షల మంది ఫాలోవర్లు.

గోవా ఎఫ్‌సి- ఫేస్‌బుక్‌లో 4.48 లక్షల మంది, ట్విట్టర్‌లో 3.38 లక్షలు, ఇన్‌స్టాగ్రామ్‌లో 2.91 లక్షల మంది ఫాలోవర్లు.

చెన్నై ఎఫ్‌సి- ట్విట్టర్‌లో 8.72 లక్షలు, ఫేస్‌బుక్‌లో 4.61 లక్షలు, ఇన్‌స్టాగ్రామ్‌లో 2.78 లక్షల మంది ఫాలోవర్లు.

ఈస్ట్ బెంగాల్ ఎఫ్‌సి- ఫేస్‌బుక్‌లో 1.31 మిలియన్లు, ట్విట్టర్‌లో 2.49 లక్షలు, ఇన్‌స్టాగ్రామ్‌లో 65 వేల మంది ఫాలోవర్లు.

ఏటీకే మోహన్ బాగన్ ఎఫ్‌సి- ఫేస్‌బుక్‌లో 1.08 మిలియన్లు, ట్విట్టర్‌లో 4.77 లక్షలు, ఇన్‌స్టాగ్రామ్‌లో 2.22 లక్షల మంది ఫాలోవర్లు.

కేరళ బ్లాస్టర్స్ ఎఫ్‌సి- ఫేస్‌బుక్‌లో 4.48 లక్షలు, ట్విట్టర్‌లో 3.38 లక్షలు, ఇన్‌స్టాగ్రామ్‌లో 2.91 లక్షల మంది ఫాలోవర్లు.

'ఐపీఎల్ 2021 వేలం జరగకుండా ముంబై ఇండియన్స్ అడ్డుకోవాలి.. లేదంటే'
https://telugu.mykhel.com/cricket/mumbai-indians-should-not-allow-big-ipl-2021-auction-suggests-aakash-chopra/articlecontent-pf53452-031664.html

Story first published: Thursday, November 19, 2020, 20:42 [IST]
Other articles published on Nov 19, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+