పనాజీ: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్ ఏడో సీజన్లో హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) శుభారంభం చేసింది. జీఎమ్సీ స్టేడియం వేదికగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 1-0తో ఒడిశా ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ)పై విజయం సాధించింది. మ్యాచ్ 35వ నిమిషంలో హైదరాబాద్ ఫార్వార్డ్ ప్లేయర్ సాంటానా చాకచక్యంగా గోల్ సాధించి జట్టుకు లీడ్ అందించాడు. సాంటానా కొట్టిన గోల్‌కు ప్రత్యర్థి కీపర్ బిత్తరపోయాడు. ఆ తర్వాత మరింత దూకుడుగా ఆడిన హైదరాబాద్ ఎఫ్‌సీ ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా అద్భుత విజయాన్నందుకుంది. ఈ సీజన్‌ను గెలుపుతో ప్రారంభించి హైదరాబాద్ అభిమానుల్లో ఆశలు రేకెత్తించింది.
మ్యాచ్ ఆరంభం నుంచే హైదరాబాద్ ఎఫ్‌సీ దూకుడు ప్రదర్శించింది. బంతిని అధికభాగం తన అధీనంలో ఉంచుకుంది. ముఖ్యంగా హైదరాబాద్ ప్లేయర్లు చక్కటి సమన్వయంతో మైదానంలో పరుగెడుతూ.. ఒడిశాపై ఒత్తిడి పెంచారు. ప్రత్యర్థి ఆటగాళ్లు గోల్ పోస్ట్ దగ్గరికి బంతిని తీసుకొచ్చినా చాకచక్యంగా అడ్డుకున్నారు. హైదరాబాద్ రక్షణశ్రేణి ప్రత్యర్థి దాడులను సమర్థంగా తిప్పికొట్టింది. ఫస్టాఫ్‌లోనే లీడ్ సాధించడంతో ఎలాంటి ఒత్తిడి లేకుండా కూల్‌గా ఆడిన హైదరాబాద్ అద్భుత విజయాన్నందుకుంది.
కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ కన్నా రోహిత్ శర్మనే బెటర్: పార్థీవ్ పటేల్
మైఖేల్‌లో ఫాంటసీ పుట్‌బాల్ ఆడండి. బహుమతులు గెలవండి