Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ISL 2020 21: హైదరాబాద్‌కు‌ మరో డ్రా!!

ISL 2020-21: Halicharan Narzary, Cole Alexander Score as Hyderabad FC vs Odisha FC Ends 1-1

మార్గావ్‌: ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) ఫుట్‌బాల్‌ టోర్నీ ఏడో సీజన్‌లో హైదరాబాద్‌ ఎఫ్‌సీ వరుసగా రెండో మ్యాచ్‌నూ డ్రాగా ముగించింది. మంగళవారం రాత్రి ఒడిషా ఎఫ్‌సీతో జరిగిన మ్యాచ్‌ను హైదరాబాద్‌ జట్టు 1-1తో ముగించింది. హైదరాబాద్‌ తరపున హాలిచరణ్‌ (13వ నిమిషంలో) గోల్‌ కొట్టాడు. దీంతో తొలి అర్ధ భాగంను హైదరాబాద్‌ ఆధిక్యంతో ముగించింది. రెండో అర్ధ భాగంలో ఒడిషా ఆటగాడు అలెగ్జాండర్‌ (51వ నిమిషంలో) గోల్‌ చేసి స్కోరు సమం చేశాడు. మ్యాచ్ ఆఖరివరకు మరో గోల్ నమోదు కాకపోవడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.

ఏడో సీజన్‌లో హైదరాబాద్‌ ఎఫ్‌సీ ఇప్పటివరకు 12 మ్యాచులు ఆడి నాలుగు విజయాలు, మూడు ఓటములను ఎదుర్కొంది. మరో ఐదింటిని డ్రా చేసుకుని.. 17 పాయింట్లతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. 12 మ్యాచులు ఆడిన ఒడిశా ఎఫ్‌సీ కేవలం ఒక్క విజయాన్ని మాత్రమే సాధించింది. నాలుగు డ్రా చేసుకుని.. ఏకంగా ఏడింటిలో ఓడిపోయింది. 7 పాయింట్లతో పట్టికలో అట్టడుగున ఉంది. టోర్నీ ఆరంభం నుంచి ఒడిశా తేరుకోవడం లేదు.

ముంబై సిటీ, ఏటికే మోహన్ బగాన్, గోవా ఎఫ్‌సీ టాప్-3లో ఉన్నాయి. 11 మ్యాచులలో 8 విజయాలు అందుకుని 26 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. 11 మ్యాచులు ఆడిన ఏటికే 6 విజయాలతో 21 పాయింట్లు ఖాతాలో వేసుకుని రెండో స్థానంలో ఉంది. గోవా ఐదు విజయలతో 19 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ఇక బుధవారం జరిగే పోరులో కేరళ బ్లాస్టర్స్ ఎఫ్‌సీతో బెంగళూరు‌ ఎఫ్‌సీ తలపడుతుంది. ఈ మ్యాచులో బెంగళూరు‌ ఫేవరేట్ జట్టుగా బరిలోకి దిగనుంది.

Story first published: Wednesday, January 20, 2021, 7:44 [IST]
Other articles published on Jan 20, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+