ISL 2020-21: గోవా ఎఫ్‌సీ vs నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఎఫ్‌సీ.. తుది జట్లు ఇవే!!

హైద్రాబాద్: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) 2020లో భాగంగా మరికొద్ది సేపట్లో గోవా ఎఫ్‌సీ, నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఎఫ్‌సీ జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచులో గోవా హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతుంది. బెంగళూరుతో ఈ సీజన్ ఆరంభపు మ్యాచ్‌లో గోవా డ్రా చేసుకుంది. కానీ ముంబైతో తర్వాత జరిగిన మ్యాచులో ఓటమిపాలైంది. మరోవైపు నార్త్ ఈస్ట్.. ముంబైపై గెలిచి విజయాన్నందుకుంది. ఆ తర్వాత కేరళ బ్లాస్టర్స్‌తో డ్రా చేసుకుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ హోరాహోరీగా సాగనుంది.
ఏడేళ్ల ఐఎస్‌ఎల్ చరిత్రలో రెండు సార్లు రన్నరప్ అయిన గోవా 110 మ్యాచ్‌ల్లో 51 గెలుపొందగా.. గత సీజన్ సెమీఫైనలిస్ట్ నార్త్ ఈస్ట్ 100 మ్యాచ్‌ల్లో 28సార్లు విజయాలను అందుకుంది. రెండు జట్లు ఓవరాల్‌గా 12 సార్లు తలపడగా.. గోవా ఐదు విజయాలతో లీడ్‌లో ఉంది. మరో ఐదు సార్లు డ్రా కాగా.. 2 సార్లు నార్త్ ఈస్ట్ యునైటెడ్ గెలుపొందింది. చివరి 5 ఐదు మ్యాచ్‌ల్లో రెండు సార్లు గోవా విజయం సాధించగా మూడు సార్లు డ్రా అయింది.
గోవా ఎఫ్‌సీ జట్టు:
మహ్మద్ నవాజ్, సెరిటన్ ఫెర్నాండెజ్, ఐబాన్ డోహ్లింగ్, ఇవాన్ గొంజాలెజ్, రక్షకుని గామా, ఎడు బేడియా, లెన్ని రోడ్రిగ్స్, అల్బెర్టో నోగువేరా, బ్రాండన్ ఫెర్నాండెజ్, జార్జ్ మెన్డోజా ఓర్టిజ్, ఇగోర్ అంగులో.
నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఎఫ్‌సీ:
సుభాషిష్ రాయ్ చౌదరి, ప్రోవత్ లక్రా, బెంజమిన్ లాంబోట్, డైలాన్ ఫాక్స్, గుర్జిందర్ కుమార్, లాలెంగ్మావియా, ఖాస్సా కమారా, లాల్రెంపుయా ఫనాయ్, లూయిస్ మచాడో, క్వేసి అప్పయ్య, బ్రిట్టో పిఎం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications