కోల్‌కతా: ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్ఎల్) 2020-21 సీజన్లో శుక్రవారం రసవత్తరపోరు జరగనుంది. కోల్‌కతాకే చెందిన ఎస్సీ ఈస్ట్ బెంగాల్, ఏటీకే మోహన్ బగాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ రెండు జట్ల మధ్య పోటీని ఆసియాలోనే ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. అయితే ఈ మ్యాచ్‌లో అద్బుత ప్రదర్శన కనబర్చి ఎస్సీ ఈస్ట్ బెంగాల్ కోచ్ రాబీ ఫౌలెర్ దృష్టిని ఆకర్షిస్తానని ఇండియా డిఫెండర్, ఏటీకే మోహన్ బగాన్ ప్లేయర్ సందేశ్ జింగాన్ ధీమా వ్యక్తం చేశాడు. ఈ రసత్తవరపోరు నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన జింగాన్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
'రాబీ ఫౌలెర్ ఓ ఫుట్‌బాల్ దిగ్గజం. అతనిలాంటి కోచ్‌లు భారత ఫుట్‌బాల్ లీగ్‌లో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉంది. ఏదో ఒక రోజు ఫౌలెర్తో ఫుట్‌బాల్ గురించి చిట్‌చాట్ చేస్తా. కానీ మైదానంలో మాత్రం అతని వ్యూహాలకు ప్రతీ దాడి చేస్తూ ఫౌలెర్ దృష్టిని ఆకర్షిస్తా. మైదానంలోకి వచ్చాక వారు మా ప్రత్యర్థులే. ఫస్ట్ మ్యాచ్ విజయం మా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఇదే జోరును తదుపరి మ్యాచ్‌ల్లో కొనసాగిస్తాం. టీమ్ వాతావరణం బాగుంది. మేం చాంపియన్స్ అనే మెంటాలిటీతోనే బరిలోకి దిగుతున్నాం. ఫుట్‌బాల్ అనేది ఓ కళ అయితే.. కళకారుడు అనేవాడు ఇతర విషయాలను పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతూనే ఉండాలి. అభిమానుల మధ్య ఆడలేకపోతేన్నా వారి మద్దతు ఉంది. నేను ఒకసారి మైదానంలోకి అడుగుపెడితే నా జట్టు విజయం కోసం కృషి చేస్తా. 'అని జింగాన్ చెప్పుకొచ్చాడు.
ఏడో సీజన్ తొలి మ్యాచ్‌లో ఏటీకే మోహన్ బగాన్ 1-0 తేడాతో కేరళ బ్లాస్టర్స్ ఎఫ్‌సీని ఓడించి శుభారంభం చేసింది. కెప్టెన్ రాయ్ కృష్ణ (67వ నిమిషంలో) గోల్ కొట్టాడు. తొలి మ్యాచ్ కావడంతో రెండు జట్లు కాస్త రక్షణాత్మక ధోరణిలో ఆడాయి. మ్యాచ్ ఆరంభం నుంచి మంచి దూకుడు మీద కనిపించిన ఫార్వర్డ్ కృష్ణ గోల్‌తో ఆకట్టుకున్నాడు.
మైఖేల్‌లో ఫాంటసీ పుట్‌బాల్ ఆడండి. బహుమతులు గెలవండి