బంబోలిమ్: ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్ఎల్) ఏడో సీజన్లో చెన్నైయిన్ ఫుట్‌బాల్ క్లబ్ కీలక విజయం సాధించింది. బుధవారం జీఎంసీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో చెన్నయిన్ ఎఫ్‌సీ 2-1 తేడాతో ఒడిశా ఫుట్‌బాల్ క్లబ్‌పై గెలిచింది. ఇస్మాయిల్ గాన్‌క్లేవ్స్(15వ నిమిషం, 21వ నిమిషం) చెన్నైయిన్‌కు రెండు గోల్స్ అందించగా.. డిగో మొరిక్(64వ నిమిషం) ఒడిశాకు ఏకైక గోల్ అందించాడు. ఫస్టాఫ్‌ను దూకుడుగా మొదలుపెట్టిన చెన్నయిన్‌కు ఇస్మాయిల్ 6 నిమిషాల తేడాలో డబుల్ బ్రేక్ ఇచ్చాడు.
15వ నిమిషంలో తొలి గోల్ సాధించిన ఇస్మాయిల్.. అక్కడికి 5 నిమిషాల తర్వాత దొరికిన పెనాల్టీ కార్నర్‌ను సద్వినియోగం చేసుకుని చెన్నయిన్ను లీడ్‌లో నిలబెట్టాడు. ఒడిశా గోల్ సాధించకపోవడంతో చెన్నయిన్ 2-0 లీడ్‌తో ఫస్టాఫ్ ముగించింది. సెకండాఫ్‌లో ఒడిశా కాస్త పుంజుకోగా ఓ గోల్ చేసిన డిగో.. చెన్నయిన్ ఆధిక్యాన్ని 2-1 తగ్గించాడు.
మైఖేల్‌లో ఫాంటసీ పుట్‌బాల్ ఆడండి. బహుమతులు గెలవండి