పనాజీ: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్ ఏడో సీజన్‌ను చెన్నయిన్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) విజయంతో ఆరంభించింది. జీఎమ్సీ స్టేడియం వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నయిన్ 2-1తో జంషెడ్పూర్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ)పై విజయం సాధించింది. మ్యాచ్ ఆరంభమైన తొలి నిమిషంలోనే చెన్నయిన్ ప్లేయర్ అనిరుద్ థాపా గోల్ సాధించి జట్టుకు లీడ్ అందించాడు. తద్వారా ఈ సీజన్లో ఫస్ట్ గోల్ చేసిన తొలి ఇండియన్ ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. అదే జోరులో మ్యాచ్ 26వ నిమిషంలో ఎస్మాయిల్ గోన్కల్వ్స్ మరో గోల్ చేసి జట్టు లీడ్‌ను 2-0గా మార్చాడు. దాంతో ఫస్టాఫ్ ముగిసే సరికి రెండు గోల్స్ చేసిన తొలి జట్టుగా చెన్నయిన్ ఎఫ్‌సీ నిలిచింది. 37వ నిమిషంలో నెరిజస్ వాల్స్కిస్ జంషెడ్ పూర్ తరఫున ఖాతా తెరిచినప్పటికీ ఆ తర్వాత ప్రత్యర్థి దూకుడును అడ్డుకోలేకపోయింది.
బంతిని అధికభాగం తన అధీనంలో ఉంచుకున్న చెన్నయిన్ ఎఫ్‌సీ.. ప్రత్యర్థి అవకాశం ఇవ్వకుండా చెలరేగింది. ముఖ్యంగా చెన్నయిన్ ప్లేయర్లు చక్కటి సమన్వయంతో మైదానంలో పరుగెడుతూ.. జంషెడ్‌పూర్‌పై ఒత్తిడి పెంచారు. ప్రత్యర్థి ఆటగాళ్లు గోల్ పోస్ట్ దగ్గరికి బంతిని తీసుకొచ్చినా చాకచక్యంగా అడ్డుకున్నారు. చెన్నయిన్ రక్షణశ్రేణి ప్రత్యర్థి దాడులను సమర్థంగా తిప్పికొట్టింది. ఫస్టాఫ్‌లోనే డబుల్ లీడ్ సాధించడంతో ఎలాంటి ఒత్తిడి లేకుండా కూల్‌గా ఆడిన చెన్నయిన్ అద్భుత విజయాన్నందుకుంది.
ఈ గెలుపుతో టేబుల్ టాపర్‌గా నిలిచిన చెన్నయిన్.. జంషేడ్ పూర్‌తో ముఖా ముఖిని 3-0గా మార్చుకుంది. ఐఎస్ఎల్ టోర్నీలో రెండు జట్లు తాజా మ్యాచ్‌తో కలుపుకొని ఏడు సార్లు తలపడగా.. నాలుగు మ్యాచులు డ్రా అయ్యాయి.
మైఖేల్‌లో ఫాంటసీ పుట్‌బాల్ ఆడండి. బహుమతులు గెలవండి