
రెండు మ్యాచ్‌ల్లో ఓటమి
ఫుట్‌బాల్ చరిత్రలో హైదరాబాద్‌కు ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. కానీ అది గతం. ఈ సీజన్లో తన తొలి మ్యాచ్‌లో 0-5తో అట్లెటికో ది కోల్‌కతా చేతిలో, రెండో మ్యాచ్‌లో 1-3తో జంషెడ్పూర్ ఎఫ్‌సీ చేతిలో పరాజయం పాలైంది. ఇలాంటి సమయంలో సొంత మైదానంలో వచ్చే తొలి విజయం మాంచి కిక్ ఇస్తుందనడంలో సందేహం లేదు.

గెలుపు అంత సులభం కాదు
అయితే, కేరళ బ్లాస్టర్స్‌పై గెలుపు అంత సులభంగా దక్కకపోవచ్చు. ఎందుకంటే హైదరాబాద్ డిఫెన్స్ బలహీనంగా ఉంది. గాయాల కారణంగా రోజెరియో సిల్వా (బోబో), గిల్స్ బార్న్స్, రఫెల్ గోమెజ్ లాంటి కీలక ఆటగాళ్లు మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశం ఉంది. దాంతో శనివారం నాటి మ్యాచ్‌లో భారం మొత్తం మార్సెలినోపైనే పడనుంది.

మార్సెలినో కీలకం
2016 సీజన్ గోల్డెన్ బూట్ అవార్డు గెలుచుకున్న మార్సెలినో గత మ్యాచ్‌లో గోల్ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు సీజన్లో ఇప్పటివరకు రెండు మ్యాచ్‌ల్లో ఓ గెలుపు, ఓటమి నమోదు చేసిన కేరళ బ్లాస్టర్స్ ప్రత్యర్థికి గట్టిపోటీ ఇవ్వనుంది. గత మ్యాచ్‌లో ముంబై ఎఫ్‌సీ చేతిలో ఓడిన ఆ జట్టు హైదరాబాద్‌పై గెలుపే లక్ష్యంగా బరిలో దిగనుంది.

eventsnow.comలో టికెట్లు
కేరళ బ్లాస్టర్స్ జట్టు కెప్టెన్ బర్తోలోమెవ్ ఒబెబ్ జట్టుకు కీలకం కానున్నాడు. బ్లాస్టర్స్నూ గాయాల సమస్య వేధిస్తున్నప్పటికీ హైదరాబాద్ కంటే ఆ జట్టే మెరుగ్గా కనిపిస్తుంది. ఈ మ్యాచ్‌కి సంబంధించిన టికెట్లు eventsnow.comలో లభిస్తున్నాయి. టికెట్ల ధరలను వరుసగా రూ. 100, రూ. 300, రూ. 500, రూ. 1000, రూ. 1500లుగా నిర్ణయించారు.

పెద్ద సంఖ్యలోనే అభిమానులు హాజరయ్యే అవకాశం
రూ.300 విలువ గల టికెట్లన్నీ అమ్ముడయ్యాయి. దీంతో ఈ మ్యాచ్‌కు పెద్ద సంఖ్యలోనే అభిమానులు హాజరయ్యే అవకాశం ఉంది. శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హైదరాబాద్ కోచ్ ఫిల్ బ్రౌన్ మాట్లాడుతూ "గాడిలో పడేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాం. లీగ్ మొదలైనప్పటి నుంచి మేము తీరిక లేకుండా ప్రయాణం చేస్తూనే ఉన్నాం. చివరికి హైదరాబాద్ చేరుకున్నాం. రానున్న రెండు మ్యాచ్‌ల్లో గెలువాలన్నదే చూస్తున్నాం. బొబో, గైల్స్ బార్నెస్, సాహిల్ పన్వర్, రాఫెల్ గోమెజ్ ఫిట్‌నెస్‌పై జట్టు కూర్పు ఆధారపడి ఉంది. మర్సెలో పుంజుకుంటే తిరుగుండకపోవచ్చు" అని అన్నాడు.

జట్ల వివరాలు:
కేరళ బ్లాస్టర్స్ ఎఫ్‌సీ: బిలాల్ హుస్సేన్ ఖాన్ (గోల్‌కీపర్), మొహమ్మద్ రాకిప్, జైరో రోడ్రిగ్స్, జియాని జువెర్లోన్, జింగ్, జెస్సెల్ కారి్నరో, నర్జారీ, సెర్గియో సిడోంచా, జెకెన్ సింగ్, సహల్ సమద్, బర్తోలోమెవ్.
హైదరాబాద్ ఎఫ్‌సీ: కమల్జిత్ సింగ్ (గోల్ కీపర్), ఆశిష్ రాయ్, మాథ్యూ కిల్గాలాన్, గుర్జీత్ సింగ్, యాసిర్, నిఖిల్ పుజారి, మార్కో స్టాంకోవిక్, ఆదిల్ ఖాన్, రోహిత్ కుమార్, మార్సెలో పెరీరా, రాబిన్ సింగ్.
రాత్రి గం. 7.30 నుంచి స్టార్ స్పోర్ట్స్-2లో ప్రత్యక్ష ప్రసారం