Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐఎస్ఎల్‌లో పెట్టుబడులు: రానా దగ్గుబాటి కొత్త బిజినెస్‌లో సక్సెస్ అవుతాడా?

ISL 2019-20: Film star Rana Daggubati new stakeholder of Hyderabad FC

హైదరాబాద్: రానా దగ్గుబాటి భారత సినీ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. క్రీడలంటే రానాకు అమితాసక్తి. ఇప్పటికే ప్రో కబడ్డీ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహారిస్తున్నారు. అయితే, తాజాగా ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్ఎల్)లో కూడా రానా పెట్టుబడులు పెట్టారు.

ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఈ ఏడాది కొత్తగా హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ జట్టు అరంగేట్రం చేయనుంది.హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ పేరిట ప్రారంభించిన హైదరాబాద్ ఎఫ్‌సి ప్రాంఛైజీకి విజయ్ మద్దూరి, వరుణ్ త్రిపురనేనిలు సహ యజమానులుగా ఉన్న సంగతి తెలిసిందే.

జాబితాలో చేరిన రానా దగ్గుబాటి

తాజాగా ఈ సహ యజమానుల జాబితాలో రానా దగ్గుబాటి కూడా చేరాడు. ఈ సందర్భంగా రానా మాట్లాడుతూ "హైదరాబాద్‌కు గొప్ప క్రీడా వారసత్వం కలిగి ఉంది. ఈ జట్టు, ఆ వారసత్వాన్ని తిరిగి పుంజుకోవడం అదృష్టంగా ఉంది. కమల్‌జిత్ అతని జట్టు అద్భుత విజయాలను సాధిస్తుందని నేను నమ్మకంగా ఉన్నా" అని అన్నాడు.

తన సామర్థ్యాన్ని నిరూపించిన హైదరాబాద్

"చెన్నై మరియు గోవాలోని ప్రాథమిక శిబిరాల్లో ఈ జట్టు తన సామర్థ్యాన్ని నిరూపించింది. హైదరాబాద్ ఎఫ్‌సి ఆడిన ఏడు స్నేహపూర్వక మ్యాచ్‌లలో అద్భుత ప్రదర్శన చేసింది" అని రానా దగ్గుబాటి అన్నాడు. టోర్నీలో భాగంగా శుక్రవారం జరిగే మ్యాచ్‌లో మాజీ చాంపియన్ అట్లెటికో డీ కోల్‌కతా(ఏటీకే)ను హైదరాబాద్ ఎఫ్‌సి తన తొలి మ్యాచ్‌లో తలపడనుంది.

కోచ్‌గా ఫిల్ బ్రౌన్

మాజీ ఇంగ్లీష్ ప్లేయర్, సీనియర్ కోచ్ ఫిల్ బ్రౌన్ హైదరాబాద్ ఎఫ్‌సి జట్టు కోచ్‌గా వ్యవహరిస్తుండగా.. డేవిసన్ రొగేరియో డిసిల్వా, గైల్స్ బర్నెస్ లాంటి విదేశీ స్టార్ ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. అయితే స్పానిష్ స్టార్ ఆటగాడు నెస్టల్ గాడిలో తొలి ఎనిమిది మ్యాచ్‌లకు దూరం కావడం హైదరాబాద్ జట్టుకు సమస్యగా మారింది.

పటిష్టంగా హైదరాబాద్ ఎఫ్‌సి డిఫెన్స్

గనీ నిగమ్, సహిల్ తవోరా, లాల్‌ధన్‌మావియా, దీపేందర్ నేగీ, అశీష్ రాయ్, తారిఫ్ అఖంద్ లాంటి ప్రతిభావంతులైన దేశీయ ఆటగాళ్లు హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇంగ్లీష్ ప్లేయర్ మాథ్యూ కిల్‌గలాన్, రఫా లోపేజ్ గేమేజ్ లాంటి ఆటగాళ్లతో హైదరాబాద్ ఎఫ్‌సి డిఫెన్స్ పటిష్టంగా ఉండటం విశేషం.

Story first published: Friday, October 25, 2019, 12:37 [IST]
Other articles published on Oct 25, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+