Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సీజన్ 3: నాడు ధగధగ.. నేడు వెలవెల

ముంబై: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) గత రెండు ఎడిషన్లలో ఎఫ్‌సి గోవా, చెన్నైయిన్ ఎఫ్‌సి మెరుగైన ప్రతిభ కనబర్చడానికి వాటి కోచ్‌ల పాత్ర చాలా కీలకం. అపార అనుభవం గల కోచ్‌లున్నా గానీ డిఫెండింగ్ చాంపియన్‌గా ఉన్న చెన్నైయిన్‌తోపాటు క్రితంసారి ఫైనల్స్ వరకు దూసుకొచ్చిన ఎఫ్‌సి గోవా ఈ దఫా గ్రూప్ దశ టోర్నీలు పూర్తయి ప్లేఆఫ్ దశకు చేరుకునే సరికి పాయింట్ల పట్టికలో దిగువ స్థానాలకు పడిపోయాయి.

టాప్ 4 జాబితాలో చేరిన నాలుగు జట్లకు కొత్త కోచ్‌లు సారధ్యం వహిస్తుండటం గమనార్హం. ఐఎస్ఎల్ 3లో రెండోదశలుగా జరిగే సెమీ ఫైనల్స్‌లో తొలిసారి అర్హత సాధించిన ముంబై సిటీ ఎఫ్‌సి, మాజీ చాంపియన్ అట్లెటికో డి కోల్‌కతాతోనూ, కేరళ బ్లాక్ బస్టర్స్ ఎఫ్‌సి జట్టుతో ఢిల్లీ డైనమోస్ తలపడనున్నాయి.

సెమీ ఫైనల్స్ ఈ నెల 10న కోల్‌కతాలో, 11న కోచిలో, 13న ముంబై, 14న ఢిల్లీలో జరుగుతాయి. చివరిగా ఈ నెల 18వ తేదీన కోచిలో ఫైనల్స్ మ్యాచ్ జరుగనున్నది.

చివరి క్షణం వరకు

చివరి క్షణం వరకు

ఢిల్లీ హెడ్ కోచ్ జియాంలుకా జంబ్రొట్టా, అట్లెటికో డి కోల్‌కతా మేనేజర్ జోస్ మొలీనా, ముంబై సిటీ ఎఫ్ సి ప్రధాన శిక్షకుడు అలెగ్జాండ్రీ గుమారెస్, కేరళ బ్లాక్ బస్టర్స్ ఎఫ్ సి మేనేజర్ స్టీవ్ కొప్పెల్ తమ జట్లను చివరి క్షణం వరకు సెమీ ఫైనల్స్‌కు అర్హత సాధించేందుకు అవసరమైన వ్యూహాన్ని అమలు చేయడంతో సక్సెస్ అయ్యారు. కానీ ఎఫ్ సి గోవా హెడ్ కోచ్ జికో, డిఫెండింగ్ చాంపియన్ గా నిలిచిన చెన్నైయిన్ మేనేజర్ మార్కో మాట్టరాజీ, ఎఫ్ సి సిటీ పుణె కోచ్ అంటోనియో హబాస్ లు తమ జట్లకు సైమీ ఫైనల్స్ అర్హత సాధించేందుకు అవసరమైన వ్యూహరచన, అమలులో పూర్తిగా విఫలం అయ్యారని విమర్శలు ఉన్నాయి.

ఫుట్‌బాల్ నిపుణులు ఏమన్నారు

ఫుట్‌బాల్ నిపుణులు ఏమన్నారు

మున్ముందు వారి శక్తి సామర్థ్యాలను మరింతగా ప్రదర్శించాలని భావిస్తే విధి విధానాలు, పద్ధతులను మార్చుకోవాల్సి ఉంటుందని కొందరు ఫుట్‌బాల్ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. వివిధ అంశాల వల్ల టాప్ కోచ్‌లు వైఫల్యం చెందారని బర్మింగ్ హమ్ సిటీ ఎఫ్ సి మాజీ ప్లేయర్ పాల్ మాస్ ఫీల్డ్ వ్యాఖ్యానించాడు. ప్రత్యేకించి దిగువన స్థిరపడిన నాలుగు జట్లతో పోలిస్తే టాప్ 4 జట్లు మరింత శక్తిమంతంగా రూపుదిద్దుకోవడంతోపాటు కీలకమైన ప్రతిభా పాటవాలు గల ఆటగాళ్లను పొందడంలోనూ ఆయా జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న క్లబ్‌ల యాజమాన్యాలు విఫలం అయ్యాయి.

ఆదర్శంగా నిలువడంలో విఫలం

ఆదర్శంగా నిలువడంలో విఫలం

ఇక చెన్నయిన్ ఎఫ్ సి, ఎఫ్ సి గోవా సారధులు తమ శక్తి సామర్థ్యాలు, అనుభవానికి అనుగుణంగా మిగతా జట్ల కెప్టెన్ల కంటే మెరుగైన ప్రదర్శననివ్వడంలోనూ, తమ జట్లలోని ప్లేయర్లకు ఆదర్శంగా నిలువడంలోనూ విఫలమయ్యారు. ‘ఈ ఏడాది లీగ్ టోర్నీలో మ్యాచ్‌లను పరిశీలిస్తే ఐఎస్ఎల్ ప్రారంభంతో పోలిస్తే లీగ్ మరింత శక్తిమంతమైంది. ప్రస్తుతం జట్ల మధ్య మరింత పోటీ పెరిగింది' అని బర్మింగ్ హమ్ సిటీ ఎఫ్ సి మాజీ ప్లేయర్ మాస్ ఫీల్డ్ వ్యాఖ్యానించాడు. ‘తాజా ఐడియాలు, సంప్రదాయాలు, విధి విధానాలను పరిశీలిస్తే పలు రంగాల్లో గేమ్ ఖచ్చితంగా మెరుగుపడిందని అర్థమవుతుంది. వారు (కోచ్‌లు) తమ జట్లకు మంచి శిక్షణనిచ్చినా వ్యవస్థలో పరిస్థితులకు లోబడిపోయారు' అని ఆయన అన్నాడు.

ఐఎస్ఎల్‌లో వ్యూహాత్మక విధానం

ఐఎస్ఎల్‌లో వ్యూహాత్మక విధానం

నార్త్ఈస్ట్ యునైటెడ్ ఎఫ్ సి జట్టు మాజీ హెడ్ కోచ్, న్యూజిలాండ్ మాజీ హెడ్ కోచ్ రికీ హెర్బర్ట్ మాటల్లో చెప్పాలంటే ఇండియన్ సూపర్ లీగ్ వ్యూహాత్మక విధానం రూపొందిస్తూ అదే రీతిలో వ్యూహ అమలుతో ముందుకు సాగుతున్నదన్నాడు. ‘ఐఎస్ఎల్ పలు అంశాల్లో మెరుగుదల కనిపిస్తున్నది. అదే ధోరణి కొనసాగుతున్నది. ప్రత్యేకించి టీంలు, ప్లేయర్ల ఆటలో మెరుగైన నాణ్యత క్రమంగా పుంజుకుంటున్నది. వ్యూహ రచనతోపాటు ఆచరణాత్మక వ్యూహం అమలులో అనుసరించాల్సిన పద్ధతులను రూపుదిద్దుకోవాల్సింది కోచ్‌లే. అప్పుడే మెరుగైన ఫలితాలు లభిస్తాయి' అని రికీ హెర్బర్ట్ వ్యాఖ్యానించాడు.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+