For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అభిమానులకు ముంబై తీపి కబురు: ఐజ్వాల్‌కు జెజె వెల్‌కం

By Pratap

ముంబై: ఫుట్‌బాల్‌ అభిమానులకు శుభవార్త. వచ్చేనెలలో జరుగనున్న ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌)లో ఎలాగైనా ఫ్లే ఆఫ్‌ దశకు వెళ్లాలని పట్టుదలతో ఉన్న ముంబై సిటీ ఎఫ్‌సి జట్టు యాజమాన్యం.. అందుకు అభిమానులను అలరింపజేయనున్నది. సొంత గడ్డ ముంబై నగరంలో జరిగే జట్టు మ్యాచ్‌ల కోసం అభిమానులకు టిక్కెట్లు అందుబాటులో ఉంటాయని ఫ్రాంచైసీ సహ యజమాని రణబీర్‌ కపూర్‌ తెలిపారు.

జట్టు క్రీడాకారులకు అభిమానుల మద్దతు అవసరమని నిర్ధారించుకున్నారు. జట్టు సారధి డియాగో ఫోర్లాన్‌, సీనియర్‌ ఆటగాడు సునీల్‌ ఛెత్రి తదితర ఆటగాళ్లు ఇంతకుముందు ప్రాతినిధ్యం వహించిన ఫుట్‌బాల్‌ క్లబ్‌ల అభిమానులనూ ఐఎస్‌ఎల్‌ మ్యాచ్‌ల్లో పాల్గొని జట్టును, ఆటగాళ్లను ప్రోత్సహించాలని ఫ్యాన్స్‌కు రణబీర్‌ కపూర్‌ విజ్ఞప్తిచేశారు.

అభిమానుల మద్దతు కూడగడతామని జట్టు సారధి (మార్క్యూ ప్లేయర్‌) డియాగో ఫోర్లాన్‌కు రణబీర్‌ హామీనిచ్చారు. అందుకు అనుగుణంగా అభిమానులకు టిక్కెట్లు బుక్‌మై షో డాట్‌కాంలో 9000 సీట్ల సామర్థ్యం గల స్టేడియంలో రూ.250 (జనరల్‌ స్టాండ్‌), రూ.650 (జనరల్‌ స్టాండ్‌ విత్‌ సైడ్‌లైన్‌ వ్యూ), రూ.3000 (విఐపి స్టాండ్‌) ధర గల టిక్కెట్లు అందుబాటులో ఉంటాయి.

SL 2016: Ranbir Kapoor Assured of Diego Forlan's and co's ability to entertain fans

ఈ దఫా మ్యాచ్‌లకు అధిక సంఖ్యలో అభిమానులు, వీక్షకులు వస్తారని రణబీర్‌ కపూర్‌ అంచనావేశారు. వచ్చేనెల ఏడో తేదీన నార్త్‌ ఈస్ట్‌ యునైటెడ్‌ ఎఫ్‌సి జట్టుతో ముంబై సిటీ ఎఫ్‌సి తలపడుతుంది.

నార్త్‌ఈస్ట్‌ యునైటెడ్‌లోకి ఐజ్వాల్‌ క్లబ్‌

నార్త్‌ఈస్ట్‌ యునైటెడ్‌ ఎఫ్‌సి (ఎన్‌ఇయూ) జట్టులో ఐజ్వాల్‌ ఎఫ్‌సి జట్టును తిరిగి చేర్చాలని అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఎఐఎఫ్‌ఎఫ్‌) ఎగ్జిక్యూటివ్‌ కార్యవర్గం తీసుకున్న నిర్ణయాన్ని చెన్నైయిన్‌ సిటీ ఎఫ్‌సి జట్టు క్రీడాకారుడు జెజె లాల్పెఖులౌ స్వాగతించారు. మిజోరం రాష్ట్రానికి చెందిన ఈ కుర్రాడు.. ఎఐఎఫ్‌ఎఫ్‌ నిర్ణయంతో ఐజ్వాల్‌ క్లబ్‌ మరింత ముందడుగు వేస్తుందన్నాడు. ఐజ్వాల్‌ ఎఫ్‌సి క్లబ్‌ను 'ఎన్‌ఇయూ' క్లబ్‌లో చేరుస్తూ ఎఐఎఫ్‌ఎఫ్‌ ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నదని సమాఖ్య అధ్యక్షుడు ప్రఫుల్‌ పటేల్‌ తెలిపారు. వివిధ ప్రాంతాల్లోని క్లబ్‌లను ఐ - లీగ్‌లో భాగస్వామ్యం చేయాలని సమాఖ్య భావిస్తున్నదన్నారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:06 [IST]
Other articles published on Nov 14, 2017
-
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+