For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మోస్ట్‌ డిఫెన్సివ్‌ ముంబై: ఢిల్లీ మెరుపులు

ముంబై: ఐఎస్‌ఎల్‌ మూడో ఎడిషన్‌ టోర్నీలో మోస్ట్‌ డిఫెన్సివ్‌ ధోరణితో మ్యాచ్‌ ఆడుతున్న టీం ఒక్కటే. అదే ముంబై సిటీ ఎఫ్‌సి. తొలుత పుణె సిటీతో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించినా.. మ్యాచ్‌లో తాము చేసిన పొరపాట్లను సరిదిద్దుకునేందుకు ముంబైకర్లు సిద్ధంగా లేరు. అదే ధోరణి నార్త్‌ఈస్ట్‌ యునైటెడ్‌పై జరిగిన మ్యాచ్‌లోనూ కొనసాగింది.

డిఫెన్సివ్‌గా ఆడడానికే ప్రాధాన్యం ఇస్తున్నారే తప్ప గోల్‌ చేసే అవకాశాలను సృష్టించుకోవడం లేదు. అసలు వచ్చిన చాన్స్‌లను సద్వినియోగంచేసుకున్న దాఖలాలు లేవు. నార్త్‌ఈస్ట్‌తో జరిగిన మ్యాచ్‌లో సారధి డియాగో ఫోర్లాన్‌ పెనాల్టీని తనకు అనుకూలంగా మార్చుకుని గోల్‌పోస్ట్‌లోకి కిక్‌ కొట్టడంతో కథ సుఖాంతమైంది.

పుణెతో మ్యాచ్‌ ముగిసిన తర్వాత ముంబై కోచ్‌ అలెగ్జాండ్రే సైతం ప్రత్యర్థులపై డిఫెన్స్‌ అస్త్రాన్ని ప్రదర్శిస్తూ ముందుకు సాగాలని తన కుర్రాళ్లకు హితబోధ చేశాడు. తదనుగుణంగానే నార్త్‌ఈస్ట్‌తో జరిగిన మ్యాచ్‌లో ప్రారంభం నుంచే ముంబై డిఫెన్సివ్‌ ధోరణి ప్రదర్శించింది.

ISL 2016: Mumbai City FC win ‘ugly’ over NorthEast United but still room for improvement

ప్రారంభంలో నార్త్‌ఈస్ట్‌ ధాటిగా ఆడేందుకు చేసిన ప్రయత్నాలను ముంబైకి చెందిన 8 మంది కుర్రాళ్లు అడ్డుకున్నారు. ప్రారంభ దశలో తమ స్థానాల నుంచి కదిలేందుకు కూడా ముంబైకర్లు నిరాకరించారు.

ఆట సాగుతున్నా కొద్దీ ఇరు జట్లు తమదైన శైలిలో వ్యూహాలు అమలుచేస్తూ సాగాయి. ఇరు జట్లు సుదూరం నుంచే బంతిని గోల్‌ పోస్ట్‌ బాట పట్టించేందుకు ప్రయత్నించకపోవడం సానుకూల పరిణామమేనంటున్నారు. ఇరు జట్లలోని ప్రతీ క్రీడాకారుడు కూడా మరో సహచరుడికి బంతిని పాస్‌చేసేందుకే ప్రాధాన్యం ఇచ్చారు.

సెకండాఫ్‌లో ముంబైకర్లు తమ స్వతహసిద్ధమైన బలహీనతలను బయటపెట్టుకున్నారు. దీన్ని సావకాశంగా తీసుకుని నార్త్‌ఈస్ట్‌కు చెందిన నికోలస్‌ వెలెజ్‌, జపానీస్‌ వింగర్‌ కస్తుమి యుసా ద్వారా బంతిని గోల్‌పోస్ట్‌కు పంపడానికి విఫలయత్నంచేశారు. చివరి క్షణం వరకు నార్త్‌ఈస్ట్‌ సరైన అవకాశం కోసం తహతహాలాడితే.. చివరికి ఫోర్లాన్‌ పెనాల్టీ గోల్‌తో విజయం ముంబై వశమైంది.

ఢిల్లీ 'మార్సిలిన్హో' మెరుపులు

న్యూఢిల్లీ: ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) మూడో ఎడిషన్‌లో ఢిల్లీ డైనమోస్‌ కుర్రాడు మార్సిలిన్హో తొలి షాట్‌తోనే మెరుపులు మెరిపించాడు. అది డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నైయిన్‌ టీమ్‌ను పూర్తిగా డిఫెన్స్‌లోకి నెట్టేసి.. పెనాల్టీని అద్భుతమైన షాట్‌ ద్వారా గోల్‌పోస్ట్‌కు పంపాడు.

ఈ మ్యాచ్‌లో అనూహ్యరీతిలో ఢిల్లీ డైనమోస్‌ 3 - 1 స్కోర్‌ తేడాతో చెన్నైయిన్‌పై విజయం సాధించింది. మిడ్‌ఫీల్డర్‌ మిలాన్‌సింగ్‌, తన సహచరుడు మార్సెలిన్హోతో కలిసి.. చెన్నై గోల్‌కీపర్‌ డాయ్నే కేర్‌ అటాక్‌ను అధిగమించి బంతిని గోల్‌పోస్ట్‌ బాట పట్టించాడు. చెన్నైపై విజయంలో మరో సంచలనం కియాన్‌ లూయిస్‌. గోల్‌ కీపర్‌ కేర్‌ స్పందించేలోగా గోల్‌చేసి జట్టు స్కోర్‌ పెరుగుదలలో కీలకం అయ్యాడు.

మాథియాస్‌ డెఫెడిరికో ముంబై మిడ్‌ ఫీల్డర్‌. ముంబై పక్కనే గల పుణె సిటీతో జరిగిన మ్యాచ్‌లో ఈ అర్జెంటీనా కుర్రాడు లెఫ్ట్‌ వైపు నుంచి వచ్చిన బంతిని సారధి డియాగో ఫోర్లాన్‌తో కలిసి గోల్‌పోస్ట్‌కు దారి మళ్లించాడు. ముంబై సిటీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఢిల్లీ డైనమోస్‌ మాజీ డిఫెండర్‌ అన్వర్‌ అలీ. పుణె సిటీ ప్లేయర్‌ టాటూకు అత్యంత సమీపం నుంచి వెళుతూ బంతిని తన నియంత్రణలోకి తెచ్చుకుని ప్రత్యర్థి అవకాశాలు నీరు గార్చాడు.

ఇక ముంబై, పుణె మధ్య జరిగిన మ్యాచ్‌లో గోల్‌కీపర్‌ రాబర్టో వోల్పాటో కీలక పాత్ర పోషించాడు. పుణె కుర్రాళ్లు గుస్తావో ఒబెర్మన్‌, జీసస్‌ టాటూలను అడ్డుకుని తన జట్టుకు మేలుచేశాడు రాబర్టో. కేరళ బ్లాక్‌బస్టర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నార్త్‌ఈస్ట్‌ మిడ్‌ఫీల్డర్‌ రౌల్లిన్‌ బోర్గెస్‌ డిఫెన్సివ్‌ రోల్‌ పోషిస్తూనే అసాధారణమైన రీతిలో కస్తుమి యుసా వద్దకు పంపాడు. అక్కడ నుంచి యుసా నేరుగా దాన్ని గోల్‌పోస్ట్‌ వడికి చేర్చడంతో కథ ముగిసింది.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
-
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+