Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫోర్లాన్‌ పాస్‌: ముంబై కోచ్‌ వ్యూహమూ ఫలించెనులే!

పుణె: గత రెండు ఎడిషన్ల తొలి మ్యాచ్‌ల్లో ఓటమితోనే సరిపెట్టుకున్న ముంబై సిటీ ఎఫ్‌సి జట్టుకు మూడో ఎడిషన్‌ ప్రారంభ లీగ్‌ మ్యాచ్‌లో తొలి విజయం సాధించింది. అరుదైన ఈ విజయానికి కారణం జట్టు కెప్టెన్‌గా సారధ్య బాధ్యతలు స్వీకరించిన కాకలు తీరిన ఉరుగ్వే ప్లేయర్‌ డియాగో ఫోర్లాన్‌ అమలుచేసిన వ్యూహం, పథక రచనే.

పుణెలోని బలేవాడీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఎఫ్‌సి పుణె, ముంబై సిటీ ఎఫ్‌సి జట్లు పరస్పరం తమ ప్రత్యర్థులపై అటాకింగ్‌కే ప్రాధాన్యం ఇచ్చారు. తొలి 45 హాఫ్‌లో పుణె కంట్రోల్‌ సాధిస్తున్నట్లు కనిపించినా గోల్స్‌ కొట్టలేకపోయింది.

రెండో హాఫ్‌లో ఇరు పక్షాల మధ్య బలహీనతలను గమనించాకే కెప్టెన్‌ ఫోర్లాన్‌ ఫ్లిక్‌చేసిన బంతిని మాటియాస్‌ డిఫెడెరికో గోల్‌పోస్ట్‌కు పంపడంతో ఒక పాయింట్‌ సాధించి ముంబై పై చేయి సాధించింది.

ISL 2016: Mumbai City FC's Alexandre Guimaraes Diego Forlan did what he wanted

తద్వారా మూడో ఎడిషన్‌లోనైనా ముంబై సిటీ తొలి విజయాన్ని నమోదుచేస్తుందా? లేదా? అన్న సందేహాలను జట్టు సారధిగా తొలి మ్యాచ్‌ ఆడిన ఫోర్లాన్‌ పటాపంచలుచేశారు. ఆయన తనలోని మెరుపుల్లాంటి ఆలోచనలకు మెరుగులు దిద్దడమే దీనికి కారణం.

తొలి హాఫ్‌ ముగిసే ముందు 45వ నిమిషంలోనే గోల్‌పోస్ట్‌ ముందు ఉన్న లియో కోస్టాను గమనించి కార్నర్‌ కిక్‌తో ఫోర్లాన్‌ పంపిన బంతిని పుణె డిఫెండర్‌ గౌరామంగిసింగ్‌ తెలివిగా అడ్డుకోవడంతో ముంబై నిరాశకు గురైంది. తర్వాత ఇదే డెడ్‌లాక్‌ 69వ నిమిషం వరకూ డిఫెండ్రియోకు ఫోర్లాన్‌ బంతిని ఫ్లిక్‌చేసే వరకూ కొనసాగింది.

ఆ తర్వాత నాలుగు నిమిషాలకే మ్యాచ్‌ను డ్రాచేసే అవకాశం పుణె ఫార్వర్డ్‌ జీసస్‌ టాటూకు వచ్చినా ముంబై ప్లేయర్‌ జొన్నాథన్‌ లుక్కా అడ్డుకోవడంతో సద్వినియోగంచేసుకోలేకపోయింది. మ్యాచ్‌ ప్రారంభమైన పదో నిమిషంలో జొన్నాథన్‌ లుక్కా తెలివిగా పాస్‌చేసిన బంతిని అననుకూల పరిస్థితుల్లో గోల్‌గా మార్చేందుకు పుణె చేసిన యత్నాలను ముంబై గోల్‌ కీపర్‌ రోబర్టో నెటో అడ్డుకున్నాడు.

23వ నిమిషంలో డిఫెన్సివ్‌ పుణె మిడ్‌ ఫీల్డర్‌ ప్రొనయ్‌ హల్డర్‌.. బాక్స్‌ బయట నుంచే హాఫ్‌ వాలీతో కొట్టిన కిక్‌ను గోల్‌ కీపర్‌ ఎడెల్‌ బెటె దివ్విజయంగా అడ్డుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో దిగ్గజాలు ఉన్న ముంబై సిటీ విజయం అత్యంత మెరుగైన విజయమని చెప్పడం సరికాకపోయినా ఐఎస్‌ఎల్‌లో తొలి విజయం నమోదుచేయడం రికార్డే మరి. ప్రత్యేకించి జట్టు కోచ్‌ అలెగ్జాండ్రె గౌమారెస్‌ వ్యూహానికి పాస్‌ మార్కులు పడ్డాయని చెప్పొచ్చు.

అనునిత్యం ముందుచూపుతో మెరుగైన ఆటతీరు ప్రదర్శించి జట్టు విజయం సాధించినందుకు అలెగ్జాండ్రె సంతృప్తి చెందినట్లే కనిపించారు. దీనికి తోడు చెన్నైయిన్‌ కోచ్‌ మాట్టరాజీ తరహాలో 4 - 3 - 3గా జట్టు కూర్పును రూపొందించడం కూడా ముంబై విజయానికి
కారణం.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+