Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పేరు ప్రతిష్ఠలకు తగ్గట్టే: ఐఎస్ఎల్‌లో కెప్టెన్ల ప్రదర్శన

న్యూఢిల్లీ: ఐఎస్ఎల్ 3 ఎడిషన్ ఆరో రౌండ్‌ను దాటుకుని ఏడో రౌండ్‌లో అడుగు పెడుతున్నది. అనతి కాలంలోనే అంతర్జాతీయంగానే పేరొందిన ఫుట్‌బాల్‌ లీగ్ టోర్నీల్లో నాలుగో స్థానం సంపాదించుకున్న ఇండియన్ సూపర్ లీగ్ టోర్నీలో ఆటగాళ్లు, ప్రత్యేకించి సారధుల పెర్పార్మెన్స్ పైనే అభిమానులు, ఫ్రాంచైసీ యజమానుల ద్రుష్టి కేంద్రీక్రుతమై ఉంటుంది.

మరిన్ని క్రీడావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండిప్రపంచ వ్యాప్తంగా గతంలో పేరొందిన జట్లకు ప్రాతినిధ్యం వహించడంతోపాటు అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శించిన ప్రముఖ ప్లేయర్లు, దేశీయ ఆటగాళ్ల మేలు కలయికతో కలిసి ముందుకు సాగుతున్న ఐఎస్ఎల్ మ్యాచ్‌లను నేరుగా వీక్షిస్తున్న వారి సంఖ్య తక్కువేం కాదు. గతంలో సంపాదించుకున్న పేరు ప్రతిష్ఠల కారణంగా వారు సారధ్యం వహిస్తున్న జట్ల పెర్పార్మెన్స్‌పై ఆకాంక్షలు ఆకాశాన్నంటే స్థాయిలోనే ఉన్నాయంటే అతిశేయోక్తి కాదు.

తొలి చాంపియన్స్ అట్లెటికో డీ కోల్‌కతా జట్టు ప్లేయర్ కం సారధి హెల్డర్ పొస్టిగ అంటే ఐఎస్ఎల్ ఆటలోగానీ, వీక్షకుల్లో గానీ తెలియని వారు లేరు. అణిముత్యం లాంటి ఆటగాడైన పొస్టిగ రంగ ప్రవేశం చేస్తే 'ప్రొఫెసర్ కం కోచ్‌గా ' భావించే నార్త్ఈస్ట్ హెడ్ కోచ్ నెలో వింగాడ వంటి వారు సైతం ఆందోళనకు గురవుతారు.

దీనికి నిదర్శనమే గౌహతిలో నార్త్ఈస్ట్ జట్టు సొంత గడ్డపై అట్లెటికో డీ కోల్‌కతా విజయంలో పొస్టిగ రంగ ప్రవేశమే స్ఫూర్తి మంత్రంగా పనిచేసింది. స్ట్రయికర్ పాత్ర పోషిస్తున్న పొస్టిగ గాయం కారణంగా రెండు మ్యాచ్ ల్లో మాత్రమే పాల్గొన్నాడు. కానీ ఆయన అన్ని మ్యాచ్ ల్లోనూ పాల్గొననందున ప్రస్తుత సీజన్‌లో పొస్టిగకు ర్యాంకింగ్ కష్టమే.

ISL 2016: How did Forlan, Lucio, Malouda et al perform?

ప్రస్తుతం డిఫెండింగ్ చాంపియన్స్‌గా బరిలోకి దిగిన చెన్నైయిన్ ఎఫ్‌సి కెప్టెన్ జాన్ ఆర్న్ రైస్ స్వతహాగ డిఫెండర్. నాలుగు మ్యాచ్ ల్లో పాల్గొన్న రైస్.. ఒక క్లీన్ చిట్ అందుకున్నాడు. కానీ ఈ దఫా జట్టు దూకుడుగా ముందుకు దూసుకెళ్లలేక సతమతమవుతున్నది. ఇక తొలి మ్యాచ్ లో ముంబైపై విజయం సాధించిన ఎఫ్ సి గోవా సారధి లుసియో డిఫెండర్.

ఐదుసార్లు మ్యాచ్ లు ఆడిన లుసియోకు ఒక క్లీన్ చిట్ లభించింది. అయితే రెండో మ్యాచ్ లో కేరళ బ్లాక్ బస్టర్స్ చేతిలో 2 - 1 స్కోర్ తేడాతో విజయం సాధించింది. ఫస్ట్ఆఫ్ తర్వాత జాఫ్రి మాథ్యూస్ స్థానంలో ఆరో ప్లేయర్‌గా బరిలోకి దిగితే.. ఆయనకు తోడుగా బ్రెజిలియన్ ప్లేయర్ ట్రిండాడే గోంక్లేవ్స్, ప్రతీశ్ శిరోద్కర్ పిచ్ పై కేరళ బ్లాక్ బస్టర్స్ కు గట్టిపోటీనిచ్చారు.

కానీ వారు బస్టర్స్ గోల్ సాధించకుండా నిలువరించడంలో విఫలమయ్యారు. సారధిగా లూసియో రేటింగ్ ఐదింట రెండొంతులు మాత్రమే విజయం సాధించాడు. డిఫెన్సివ్ మిడ్ ఫీల్డరైన మహ్మద్ సిస్సోకో ఐదు మ్యాచ్‌లు ఆడటంతోపాటు ఒక గోల్ కూడా సాధించాడు. ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ జెయింట్స్‌లో ఒకటైన లివర్ పూల్ మాజీ ప్లేయర్ అయిన సిస్సోకో మ్యాచ్ జరుగుతున్న సమయంలో ప్లేయర్ల ఆటతీరుపై ఏమాత్రం జోక్యం చేసుకోడు.

తనకు తాను కీలకమైన దశలో జోక్యం చేసుకుంటాడు. ఆయన నిర్వహణ తీరును బట్టే ఐదింట 1.5 పాయింట్లు మాత్రమే సిస్సోకోకు లభించాయి. ప్రస్తుత సీజన్‌ ప్రారంభం నుంచి మెరుపులు మెరిపిస్తున్న ఢిల్లీ డైనమోస్ సారధి ఫ్లోరెంట్ మాలౌడా మిడ్ ఫీల్డర్. మాజీ చెల్సియా వింగర్ ప్రతి గేమ్‌లోనూ మెరుగైన ఆటతీరు ప్రదర్శించడంలో ఆయనకు ఆయనే సాటి.

మిడ్‌ఫీల్డ్‌కు ప్రాతినిధ్యం వహిస్తూనే మొత్తం జట్టుకు ఫస్టాఫ్‌లో ఆటతీరుపౌ సహచర ప్లేయర్లకు దిశానిర్దేశంచేస్తాడు. కొన్ని సిల్కీ స్కిల్స్ కలిగి ఉన్న మాలౌడా.. పుణెపై జరిగిన మ్యాచ్‌లో డిఫెన్స్‌కు ప్రాధాన్యం ఇచ్చాడు. అందుకోసం మార్సిలిన్హో, రిచర్డ్ గాడ్జేలను అస్త్రాలుగా ఉపయోగించాడు. జట్టు నిర్వహణలో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులతో ముందుకు వెళుతున్న మాలౌదాకు ఐదింట 3.5 పాయింట్లు ఇవ్వొచ్చు.

ఇక ఐఎస్ఎల్ 3 ఎడిషన్‌లో చెలరేగిపోతున్న జట్లలో ఒకటి ముంబై సిటీ. ముంబై సారధి డియాగో ఫోర్లాన్ పూర్తిగా ఫిట్‌గా లేకున్నా హెడ్ కోచ్ అలెగ్జాండ్రీ గుమారెస్ తెర వెనుక సహకారంతో జట్టును ముందుకు నడిపిస్తున్నాడు. గణాంకాలే ప్రధానంగా ప్రత్యర్థి జట్లపై మోస్ట్ అటాకింగ్ వ్యూహానికి ప్రాధాన్యం ఇచ్చే వాడు. అందులో భాగంగానే మాటియాస్ డెఫెడెరికో, క్రిస్జిస్థాన్ వడోక్ సహకారం తీసుకుంటూ ముందడుగు వేస్తున్నాడు. ఫోర్లాన్ బాక్స్ ఔట్ సైడ్ నుంచి షాట్స్ కొడుతూ అందరినీ అలరింపజేస్తాడు. అయితే జట్టు సారధ్య బాధ్యతల నిర్వహణలో ఫోర్లాన్‌కు ఐదింట రెండు పాయింట్లు లభిస్తుండటం ఆసక్తికర పరిణామమే.

తొలి సెషన్‌లో సెమీస్ వరకు దూసుకెళ్లిన కేరళ బ్లాక్ బస్టర్స్ ఇప్పుడు టాప్ ఫోర్‌లో చోటు దక్కించుకుంటుందా? అన్నది అనుమానమే. ఈ జట్టుకు సారధ్యం వహిస్తున్న నార్త్రన్ ఐర్లాండ్ ఇంటర్నేషనల్ అరోన్ హుగెస్ ఒక డిఫెండర్. నాలుగు మ్యాచ్ ల్లో పాల్గొన్న హుగెస్ ఒక క్లీన్ చిట్ పొంది ఉన్నాడు. రాబిన్ సింగ్ వంటి ఆటగాళ్లను కదిలించడానికి ప్రయత్నించడు.

ఫస్టాఫ్‌లో జులియో సీజర్ వంటి కుర్రాళ్లను పక్కకు నెట్టేసి మూడు పాయింట్లు పొందాలని భావిస్తాడు. అందరినీ కలుపుకు పోయే మనస్తత్వం, మేనేజ్మెంట్‌లో ముందుండే హుగెస్ కు మాత్రం ఐదింట మూడు పాయింట్లు లభిస్తున్నాయి. ఇక చివరిగా ఈ ఏడాది ప్రారంభం నుంచి ప్రొఫెసర్ వింగాడ నాయకత్వంలో తొలి నుంచి చెలరేగిపోతున్న నార్త్ఈస్ట్ యునైటెడ్ జట్టు.. ఈ దఫా టైటిల్ రేసులో ఉన్నదా? అన్న సందేహం కలుగుతున్నది.

డిఫెన్సివ్ మిడ్ ఫీల్డరైన నార్త్ఈస్ట్ సారధి డిడియర్ జొకోరా ఆరు మ్యాచ్‌ల్లో పాల్గొన్నాడు. మూడు క్లీన్ చిట్లు పొందారు. డేవిడ్ సుక్కీని అడ్డుకుని గోల్స్ సాధించడంలో మాత్రం విఫలమయ్యాడు. మాజీ సివిల్లా ప్లేయర్ అయిన జొకొరా తొలి మ్యాచ్ లో సూపర్ మాచన్స్ నుంచి వచ్చే ముప్పును అడ్డుకునేందుకు చురుకైన పాత్ర పోషించాడు. కానీ జట్టు సారధిగా మాత్రం ఆయనకు 50% మార్కులు మాత్రమే పడ్డాయి.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+