Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఢిల్లీ డైనమోస్‌కు ఇద్దరు కొత్తవాళ్లు, వాళ్లెవరు?

న్యూఢిల్లీ: ఐఎస్‌ఎల్‌ - 2016 సీజన్‌ ప్రారంభానికి ముందు ఒక డిఫెండర్‌, మరొక స్ట్రయికర్‌లను చేర్చుకోవడం ఢిల్లీ డైనమో జట్టుకు గర్వకారణమే. మూడోదశ ఐఎస్‌ఎల్‌ ప్రారంభానికి పక్షం రోజుల ముందు లాల్రూథారా, బదారా బడ్జిలను ఢిల్లీ తన జట్టులో చేర్చుకున్నది.

మిజోరం ముద్దుబిడ్డ లాల్రూథారా

ఐజ్వాల్‌ ఎఫ్‌సి జట్టు క్రీడాకారుడిగా ఇదే ఏడాది జరిగిన 'ఐ - లీగ్‌'లో స్ఫూర్తిదాయక ప్రదర్శన గావించిన లాల్రూథారాకే ఇరు వైపుల ఉంచి ఫుల్‌బ్యాక్‌చేయగల సామర్థ్యం మిజోరం ముద్దుబిడ్డ లాల్రూథారాకే సొంతం. 2012లో లువాంగ్‌మౌల్‌ ఎఫ్‌సి నుంచి అరంగ్రేటంచేసిన లాల్రూథారా.. 2014లో మిజోరం ప్రీమియర్‌ లీగ్‌ క్లబ్‌ చైర్మన్‌ ఎఫ్‌సితో బంధం కొనసాగించాడు.

రెండేళ్లుగా ఐజ్వాల్‌ క్లబ్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 'తొలిసారి ఐఎస్‌ఎల్‌ లీగ్‌లో ఢిల్లీ డైనమోస్‌ తరుపున ఆడుతున్నందుకు నాకు చాలా ఉత్సాహంగా ఉంది. ఆటలో నా విలువ, ఆటగాడిగా సామర్థ్యం నిరూపించుకొనేందుకు గొప్ప అవకాశం ఇది. కోచ్‌, సహచర ఆటగాళ్ల నుంచి నేర్చుకోవడానికి, కొత్త సీజన్‌లో ముందడుగు వేయడానికి ప్రయత్నిస్తా' అని అన్నారు.

ISL 2016: Delhi Dynamos sign Badara Badji, Lalruatthara for upcoming season

సెంటర్‌ ఫార్వర్డర్‌గా బాద్జి పాత్ర కీలకం

సెనెగల్‌కు చెందిన బదారా బాడ్జి (22) సెంటర్‌ పార్వర్డ్‌ క్రీడాకారుడిగా ఆటలో కీలకం కానున్నాడు. డెన్‌ నెట్‌వర్క్‌ సారధ్యంలో ఘనాలోని గోల్డెన్‌ లయన్స్‌ సూకర్‌ అకాడమీ తరుఫున ప్రాతినిధ్యం వహించిన బాడ్జి.. ఆటలో ఉగ్రరూపం, శక్తి సామర్థ్యాలు అందరికీ తెలిసినవే. సూకర్‌ అకాడమీ క్లబ్‌ తరుఫున ఆడిన 29 మ్యాచ్‌ల్లో ఆరు గోల్స్‌ చేయడమే ఆయన ప్రాధాన్యాన్ని తెలియజేస్తున్నది.

'హీరో ఐఎస్‌ఎల్‌లో ఆడే అవకాశం లభించడంతో నేను చాలా ఉగ్వేదానికి గురవుతున్నా. ఆటలో నా పయనం పూర్తిగా ముందుకే ఉంటుంది. రెండో సీజన్‌లో కొన్ని మ్యాచ్‌లు మాత్రం వీక్షించే అవకాశమొచ్చింది. ఆ మ్యాచ్‌ల తీరుతో ఐఎస్‌ఎల్‌ లీగ్‌లో ఫుట్‌బాల్‌ ప్రమాణాలేమిటో నాకు అర్థం కావడంతో స్ఫూర్తి దాయకంగా నిలిచాయన్నాడు.

ఇది మంచి లీగ్‌. ఈ టోర్నీ వేదికగా నా ఆటతీరును మెరుగు పరుచుకుంటానన్నాడు. ఢిల్లీ డైనమో కోచ్‌ గిలాంనుకువా జాంబ్రొట్టా కూడా లాల్రూథారా, బాదార బడ్జిల చేరికను ఆమోదించారు. బాద్జీ శక్తి సామర్థ్యగల స్ట్రైకర్‌గా గోల్స్‌ చేయగలడన్నారు. లాల్రూథారా చేరికతో జట్టులో యువ రక్తం నింది ఉందని, దీనికి తోడు తమ జట్టుకు మెరుగైన అవకాశాలున్నాయన్నారు. ప్రత్యర్థులను ఆత్మరక్షణలో పడవేయడంలోనూ, కీలక గోల్స్‌ చేయడంలోనూ బాద్జీ తమకు సహకరించే వాడని సహచర క్రీడాకారులు తెలిపారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:06 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+