Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సొంతగడ్డపై గెలుపు: పాయింట్ల పట్టిక టాప్‌లో ఢిల్లీ

న్యూఢిల్లీ: నాలుగు మ్యాచ్‌ల విరామం తర్వాత సొంతగడ్డపై జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించడంతోపాటు టాప్ ఫోర్ జాబితాలో ఢిల్లీ డైనమోస్ చోటు దక్కించుకున్నది. శుక్రవారం రాత్రి ఢిల్లీలో జరిగిన మ్యాచ్‌లో కేరళ బ్లాక్ బస్టర్స్ జట్టుపై జరిగిన మ్యాచ్‌లో 2 - 0 స్కోర్ తేడాతో ప్రశాంతంగా గెలుపొంది టాప్ స్థానానికి దూసుకెళ్లింది.

గోల్స్ లేకుండానే ఫస్టాఫ్ ముగిసిన నేపథ్యంలో సెకండాఫ్‌లో 56వ నిమిషంలో రిచర్డ్ గాడ్జె సహకారంతో కీన్ ఫ్రాన్సిస్ లూయిస్ తొలి గోల్ బోణీ చేస్తే, మరో నాలుగు నిమిషాలకే సారధి ఫ్లోరెంట్ మాలౌదా అందించిన పాస్‌ను సద్వినియోగంచేసుకున్న బ్రెజిలియన్ స్ట్రయికర్ మార్సిలిన్హో రెండో గోల్ చేశాడు.

దీంతో ఐఎస్ఎల్ టోర్నీలో నార్త్ఈస్ట్ ఫార్వర్డ్ ప్లేయర్ ఎమిలియానో అల్ఫారోతో గోల్స్ రికార్డును మార్సిలిన్హో సమంచేశాడు. ఇక వరుసగా నాలుగు మ్యాచ్ ల ప్రతిష్ఠంభన తర్వాత ఢిల్లీ డైనమోస్ మ్యాచ్ లో గెలుపొందడం ఇదే మొదటిసారి. తద్వారా ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ డైనమోస్ జట్టు మూడు విజయాలు, నాలుగు మ్యాచ్‌ల డ్రాలు, ఒక ఓటమితో అట్లెటికో డీ కోల్‌కతా జట్టును పక్కకు తప్పించేసి టాప్ జాబితాలో కూర్చుండిపోయింది.

ఇక కేరళ బ్లాక్ బస్టర్స్ ఎనిమిది మ్యాచ్ లు ఆడినా రెండింటిలో మాత్రమే గెలుపొందింది. మరో మూడు మ్యాచ్ ల్లో డ్రాగా ముగించి.. మూడింట ఓటమితో పాయింట్ల పట్టికలో ఆరోస్థానంలో కొనసాగుతున్నది. సొంతగడ్డపై పరాజయ పరంపరకు తెర దించేందుకు నిరంతరం ప్రయత్నించిన ముగ్గురు ఫార్వర్డ్ ప్లేయర్లు మార్సిలిన్హో, గాడ్జె, కియాన్ లూయిస్‌లను రంగంలోకి దించుతూ ఢిల్లీ కోచ్ జియాంలుకా జంబ్రొట్టా అనుసరించిన వ్యూహం సక్సెసయింది.

దీనికి అదనంగా గాడ్జె, లూయిస్‌లతో మిడ్ ఫీల్డ్ మాస్ట్రో, జట్టు సారధి ఫ్లోరెంట్ మాలౌదా జత కలవడం రసకందాయంగా మారింది. అంతేకాదు మార్సిలిన్హో స్వేచ్ఛగా గోల్ సాధించేందుకు అవకాశం చిక్కింది. డైనమోస్ కుర్రాళ్లు అటాకింగ్‌తోపాటు గోల్స్ సాధించే విషయమై ఎటువంటి జాప్యానికి తావివ్వకుండా.. తమ సొంతగడ్డపై ఎదుర్కొంటున్న ప్రతిష్ఠంభనకు తెర దించడమే లక్ష్యంగా భారీ కూర్పుతో తయారైన ఫార్వర్డ్ టీం దూసుకెళ్లారు.

డిఫెండర్ సందేశ్ జిగ్నాస్ సైతం ఈ ఫార్వర్డ్ ట్రయం ముందు పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది. ఫస్టాఫ్‌లో గోల్స్ సాధించకపోవడంతో సెకండాఫ్‌లో ఢిల్లీ డైనమోస్ ఆధిపత్యం ప్రదర్శించడంలో అమితాసక్తి ప్రదర్శించారు. పదో నిమిషంలో డిఫెండర్ సౌవిక్ చక్రవర్తి అద్భుతమైన బంతిని బాక్స్ లోకి పంపినా, మార్సిలిన్హో వ్యాలీ అడ్డుకున్నది. ఈ దశలో బ్రేక్ సాధించేందుకు కేరళ సారధి సెడ్రిక్ హెంగ్ బార్ట్ చేసిన విశ్వ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి.

భయపడని ఢిల్లీ డైనమోస్

భయపడని ఢిల్లీ డైనమోస్

ఏ దశలోనూ ఢిల్లీ డైనమోస్ భయపడిన దాఖలాలు కనిపించలేదు. అనాస్ ఎడాథోడికా బంతిని స్వాధీనం చేసుకున్నా ప్రత్యర్థులు ఆయన నుంచి సురక్షితంగా బంతిని బయటకు లాగేశారు. ఢిల్లీ జట్టుకు మార్సిలిన్హో లీడ్‌గా వ్యవహరించారు. ఆయన పంపిన పాస్‌ను భారత్ మిడ్ ఫీల్డర్ మిలాన్ సింగ్ సద్వినియోగంచేసుకోలేక మహ్మద్ రఫీకి పంపాడు. తర్వాత కెర్వెన్స్ బెల్ఫోర్ట్ శుభారంభాన్ని అందుకున్నా.. ఢిల్లీ డిఫెండర్ సునాయాసంగా తిప్పికొట్టాడు. తర్వాత మాలౌదా నుంచి అద్భుతమైన డయాగ్నల్ పాస్ వచ్చినా కియాన్ లూయిస్ దాన్ని గోల్‌పోస్ట్‌కు పంపడంలో విఫలం అయ్యాడు.

కేరళ బ్లాస్టర్స్ కు ఫ్యాన్స్ మద్దతు

కేరళ బ్లాస్టర్స్ కు ఫ్యాన్స్ మద్దతు

మ్యాచ్ జరిగిన జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంకు గణనీయ స్థాయిలోనే చేరుకున్న ఫ్యాన్స్ సమక్షంలో తొలి అర్థగంట ఆట ముగిసే సమయానికి మార్సిలిన్హో శక్తిమంతమైన వాలీతో ఓపెనింగ్ గోల్‌కు అత్యంత సమీపానికి వెళ్లాడు. కానీ గోల్ పోస్టు వరకు వెళ్లిన బంతి నెట్ పక్కనుంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత కూడా గాడ్జె, రాబున్ గొంజాలెజ్ రోచా చేసిన పలు ప్రయత్నాలు సఫలం కాలేదు. కేరళ బ్లాక్ బస్టర్స్ ప్లేయర్ డిడియర్ బోరిస్ కాడియో డైవింగ్ హెడ్డర్‌తో పంపిన బంతి లక్ష్యానికి చేరుకోలేకపోయింది. కానీ సెకండాఫ్ ప్రారంభంతోనే పరిస్థితులు మారిపోయాయి.

నాలుగు నిమిషాల లోపే ఢిల్లీ డైనమాస్ రెండు గోల్స్

నాలుగు నిమిషాల లోపే ఢిల్లీ డైనమాస్ రెండు గోల్స్

నాటకీయంగా ఢిల్లీ డైనమోస్‌కు అనుకూలంగా మారాయి. కేవలం నాలుగు నిమిషాల గడువులోపే ఢిల్లీ డైనమాస్ రెండు గోల్స్ చేయడంతో మ్యాచ్‌పై పట్టు సాధించారు. తొలుత కియాన్ లూయిస్ తన సహచర స్ల్రయికింగ్ ప్లేయర్ గాడ్జె సహకారంతో గోల్ పోస్ట్‌కు పంపిన బంతిని కేరళ బ్లాక్ బస్టర్స్ కు చెందిన ఇండియన్ గోల్ కీపర్ సందీప్ నాండే నిలువరించలేకపోయాడు. ఒక గోల్ సాధించడంతో ఆత్మ విశ్వాసం పెంపొందించుకున్న హోం టీమ్ చెలరేగిపోయింది. సంచలనం మార్సిలిన్హో బంతిని అద్భుతమైన రీతిలో హెడ్డర్ ద్వారా నేరుగా గోల్‌గా మలిచాడు.

గెలుపుపై ఢిల్లీ కోచ్ జంబ్రొట్టా హర్షం

గెలుపుపై ఢిల్లీ కోచ్ జంబ్రొట్టా హర్షం

తద్వారా మిగతా సమయం అంతా డిఫెన్స్, అటాకింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వడంతోనే కాలం గడిసిపోయింది. సొంతగడ్డపై జట్టు విజయం సాధించినందుకు ఢిల్లీ కోచ్ జంబ్రొట్టా హర్షం వ్యక్తంచేశాడు. తాము ఎంత కష్టపడినా సరైన దిశలో ప్రయాణించడానికి సమస్యను ఎదుర్కొంటున్నామన్నాడు. కఠినమైన మ్యాచ్‌లలో విజయం సాధించినందుకు సంతోషంగా ఉన్నదని తెలిపాడు. ఇక కేరళ బ్లాక్ బస్టర్స్ మేనేజర్ స్టీవ్ కొప్పెల్ అనుకోకుండా చేసిన తప్పదాలే తమ ఓటమికి కారణమని వ్యాఖ్యానించాడు. తమ గేమ్స్ స్టయిల్ స్వల్పంగా మార్చుకోవాల్సి ఉన్నదని కొప్పెల్ అంగీకరించాడు. అయినా ఈ మ్యాచ్ లోనూ జట్టు ఓటమి పాలవ్వడంపై ఆయన నిరాశకు గురయ్యాడు.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+