ముంబై: అట్లెటికో డీ కోల్‌కతా (ఎటికె)తో సొంతగడ్డపై జరిగిన మ్యాచ్‌లో ముంబై సిటీ ఎఫ్‌సి క్లబ్ ఆటగాళ్లు చేజేతులా గోల్స్ అవకాశాలను మిస్‌చేసుకోవడంతోనే ఫలితం డ్రా ముగిసింది. ఇరు జట్లు చెరో గోల్ చేయడంతో మ్యాచ్ డ్రా కావడంతోపాటు చెరో పాయింట్ లభించాయి.
27వ నిమిషంలో ఆతిథ్య జట్టు ముంబై ఆటగాడు మాటియాస్ డెఫెడిరోకో తెలివిగా వ్యవహరించిన కిక్ కొట్టిన బంతి గోల్ పోస్ట్‌కు చేరుకున్నది. సెకండాఫ్‌లో జావీ లారా 72 నిమిషంలో చేసిన గోల్‌తో స్కోర్ సమానమైంది.
మ్యాచ్ ప్రారంభం నుంచే ఇరు జట్లూ హోరాహోరీగా తలపడ్డాయి. రెండో నిమిషానికి లియో కోస్టా దూరం నుంచి క్రాస్‌బోర్డర్ మీదుగా కిక్ కొట్టడంతో ఇరు జట్లు వేడెక్కాయి. ఎటికెకు తొలుత మూడో నిమిషం తర్వాత ఇయాన్ హుమ్ కోసం జువాన్ బెలెంకోసో అద్భుతమైన షాట్ కొట్టినా నిష్ప్రయోజనమైంది.

అది ముంబై బ్యాక్‌లైన్ వెనుక పడిన వెంటనే సమీగ్ దౌటీ బాక్స్‌లోకి వెళ్లినా ఇయాన్‌హుమ్ హెడ్డర్‌తో పంపిన బంతిని గోల్‌కీపర్ రాబర్టో వొల్పాటో తిరగొట్టాడు. ముంబై కుర్రాళ్లు కసిగా మొదటి నుంచే గోల్స్ సాధనపై దృష్టిని కేంద్రీకరించారు.
12వ నిమిషంలో బాయిథాంగ్ హావోకిప్ లెఫ్ట్‌ఫుట్ షాట్ కొట్టినా గోల్ పోస్ట్‌కు వెళ్లలేదా బంతి. 27వ నిమిషంలో ముంబై ఇంద్రజాలికుడు డెఫెడిరికో జట్టు సభ్యుల మధ్య బంతిపై నియంత్రణ సాధించిన తర్వాత నేరుగా కిక్‌కొట్టడంతో అది గోల్‌పోస్ట్‌లో చేరిపోయింది.
అప్పటి నుంచి సెకండాఫ్ వరకు పలుసార్లు అవకాశాలు వచ్చినా ఎటికె గోల్ చేయలేకపోయిది. జావీ లారా, సమీగ్ దౌటీ చేసిన విస్తృత ప్రయత్నాలేవీ ఫలించలేదు. డిఫెన్స్‌కు ప్రాధాన్యం ఇస్తూ ముంబై జట్టు టీమ్‌ను రీ షపిల్‌చేయడాన్ని సానుకూలంగా తీసుకున్న ఎటికె ప్లేయర్ జావీలారా బంతిని గోల్ పోస్ట్‌కు పంపాడు.
లారా, దౌటీ తదితరులు మూడుసార్లలో రెండు గోల్స్‌చేసే అవకాశం వచ్చినా సద్వినియోగంచేసుకోలేకపోయారు. ఏది ఏమైనా ముంబై జట్టు సైతం ప్రారంభంలో స్కోర్ పెంచుకునే అవకాశాలు వచ్చినా.. చేజేతులా చెడగొట్టుకున్నది.
దీంతో వరుస రెండు విజయాలు సాధించామన్న ఘనతతో ముందుకు వచ్చిన ముంబై సిటీ ఎఫ్‌సి ఈ మ్యాచ్‌లో లేని అవరోధాలు కొని తెచ్చుకున్నది. ముంబై ఆటగాళ్లంతా డెఫెడెరికోపైనే ఆశలు పెట్టుకున్నారు.
ఈ మ్యాచ్‌లో ఆసక్తికర పరిణామం ఏమిటంటే రెండు జట్ల కెప్టెన్లు డియాగో ఫోర్లాన్, హెల్డర్ పొస్టిగ లేకుండా మ్యాచ్ జరిగిపోయింది. ఎటికెపై రెండువైపులా దాడిచేస్తూ గోల్స్‌కోసం ప్రయత్నిస్తుంటే కోల్‌కతా జట్టు సైతం తన ప్రత్యర్థిపై అటాకింగ్ ధోరణి ఫలితమివ్వ లేదు.