Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మెస్సీ ఏడుస్తున్న ఫోటోతో రష్యాకు వార్నింగ్ ఇచ్చిన ఐసీస్

హైదరాబాద్: 2018లో రష్యా వేదికగా జరిగే ఫిఫా వరల్డ్ కప్‌కు ఐసీస్ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లను లక్ష్యంగా చేసుకుని ఐసిస్‌ దాడులు చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఐసీస్‌కు చెందిన వఫా మీడియా ఫౌండేషన్ ట్విట్టర్‌లో అర్జెంటీనా సాకర్ స్టార్ లియోనెల్ మెస్సీ ఫోటోతో వార్నింగ్ ఇచ్చింది.

ఆ ఫోటోలో మెస్సీ రక్త కన్నీరు కారుస్తున్నట్లుగా ఉంది. ఈ ఫోటో కింద 'మీరు పోరాడుతున్న రాజ్యం ఓటమెరుగనిది' అని కామెంట్ కూడా పెట్టింది. రష్యాకు చెందిన ఇంటెలిజెన్స్ గ్రూప్ మంగళవారం ఈ ట్వీట్‌ను గుర్తించింది. అంతేకాదు నైకీ ఫేమస ట్యాగ్‌లైన్ అయిన జస్ట్ డూ ఇట్‌ను కాస్త జస్ట్ టెర్రరిజం అన్న క్యాప్షన్‌ను కూడా పెట్టింది.

ISIS Russia World Cup threat with Lionel Messi poster

అయితే ఆ తర్వాత దాన్ని తొలగించింది. ప్రసుత్తం ఈ ఫొటో వైరల్‌గా మారింది. రష్యా వేదికగా 2018 జూన్‌లో ఫిఫా ప్రపంచకప్‌ జరగనుంది. జూన్ 14 నుంచి జులై 15 వరకు జరిగే ఫిఫా వరల్డ్ కప్‌కు రష్యాలోని 11 ప్రధాన నగరాలు ఆతిథ్యమివ్వనున్నాయి. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌కి రాజధాని మాస్కోలోని లుజింకీ స్టేడియంలో జరగనుంది.

ఇంగ్లాండ్‌కు చెందిన పలువురు సాకర్ అభిమానులు ఇప్పటికే రష్యాకు చేరుకున్నారు. ఈ వరల్డ్‌కప్‌కు ఇప్పటికే ఇస్లామిక్ స్టేట్ నుంచి ఎన్నో బెదిరింపులు వచ్చాయి. మరోవైపు 2016 యురోపియన్ చాంపియన్‌షిప్‌కు కూడా ఇలాగే హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఆ టోర్నీ ఎలాంటి అవాంచనీయ ఘటనలు లేకుండా సాఫీగా పూర్తి కావడం విశేషం.

ఈ మధ్యే ఫ్రాన్స్, జర్మనీ మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్ సందర్భంలోనూ ఐసిస్ పారిస్‌లో పేలుళ్లకు పాల్పడిన విషయం తెలిసిందే. ఆ పేలుళ్లలో అనేకమంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+