ఫ్రాన్స్‌ విజేతగా నిలవడంలో కీలకపాత్ర: పీలే అడుగుజాడల్లో ఎంబాపే?

హైదరాబాద్: రష్యా వేదికగా 32 దేశాలు పాల్గొన్న ఫిపా వరల్డ్ కప్ ఫైనల్లో ఫ్రాన్స్‌ టైటిల్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. మాస్కోలోని లుజ్నికి స్టేడియంలో జులై 15 (ఆదివారం) నాడు క్రొయేషియాతో జరిగిన పైనల్లో ఫ్రాన్స్‌ 4-2 తేడాతో విజయం సాధించి వరల్డ్ కప్‌ను రెండోసారి ముద్దాడింది.

వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | వరల్డ్ కప్‌ 2018 పాయింట్ల పట్టిక | వరల్డ్ కప్ 2018 పూర్తి షెడ్యూల్

ఈ వరల్డ్ కప్‌లో ఫ్రాన్స్‌కు చెందిన కైలిన్ ఎంబాపే యంగ్ ప్లేయర్ ఆఫ్ ది వరల్డ్‌ కప్‌ అందుకోవడం సాకర్ అభిమానులను ఆశ్చర్యపరచలేదు. ఈ వరల్డ్ కప్‌లో ప్రాన్స్ తరుపున ఎంబాపే అంతటి అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ క్రమంలో ఎంబాపేను పుట్‌బాల్ దిగ్గజం పీలేతో అభిమానులు పోల్చుతున్నారు.

మెరుపువేగంతో బంతిని సహచర ఆటగాళ్లకు పాస్ చేయడం దగ్గర నుంచి పవర్ పుల్ స్ట్రైకర్లు అతడి సొంతం. క్రొయేషియాతో లుజ్నికి స్టేడియంలో జరిగిన వరల్డ్ కప్ పైనల్లో ఫ్రాన్స్‌‌కు నాలుగో గోల్ అందించి తిరుగులేని ఆధిక్యాన్ని అందించాడు. ఎంబాపే గోల్ ఫ్రాన్స్‌కు ప్రత్యేకం.

తన సాకర్ కెరీర్‌లో ఆడిన తొలి వరల్డ్‌కప్‌లోనే దేశానికి వరల్డ్‌కప్ అందించాడు. ఫిఫా వరల్డ్‌కప్ టోర్నీలో మొత్తం నాలుగు గోల్స్ చేసిన ఎంబాపే ఫైనల్స్‌లో క్రొయేషియాపై చేసిన గోల్ నాలుగోది కావడం విశేషం. ఈ గోల్‌తో ఎంబాపే ఫిఫా వరల్డ్ కప్‌ ఎలైట్ జాబితాలో చోటు దక్కించుకున్నాడు.

అర్జెంటీనా-ఫ్రాన్స్ జట్ల మధ్య జరిగిన తొలి నాకాట్ మ్యాచ్‌లో ఎంబాపే ప్రాన్స్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. 64, 69 నిమిషాల వద్ద ఎంబాపే రెండు వరుస గోల్స్ సాధించి ఫ్రాన్స్‌ను విజయ పథంలో నడిపాడు. ఎంబాపే రెండు గోల్స్‌తో ఒక్కసారిగా మ్యాచ్ 4-2తో ఫ్రాన్స్ చేతిలోకి వెళ్లిపోయింది.

చివరకు 4-3 తేడాతో విజయం సాధించిన ఫ్రాన్స్ క్వార్టర్ ఫైనల్లో అడుగు పెట్టింది. తద్వారా 1958లో ఫుట్‌బాల్ దిగ్గజం పీలే రెండు గోల్స్ సాధించగా.. ఆయన తర్వాత ఓ ప్రపంచ కప్ మ్యాచ్‌లో రెండు గోల్స్ సాధించిన పిన్న వయస్కుడిగా ఎంబాపే రికార్డు సృష్టించాడు. పుట్‌బాల్ దిగ్గజం పీలే (17 సంవత్సరాల 8 నెలల 6 రోజులకు) ఫిపా వరల్డ్ కప్‌లో ఓ మ్యాచ్‌లో రెండు గోల్స్‌ చేసిన అతి చిన్న వయస్కుడిగా తొలి స్థానంలో ఉన్నాడు.

1958లో జరిగిన వరల్డ్ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో స్వీడన్‌పై రెండు గోల్స్‌ చేసి పీలే ఈ ఘనత సాధించాడు. 60 సంత్సరాల అనంతరం ఫ్రాన్స్‌ ఆటగాడు కైలిన్‌ ఎంబాపె (19 సంవత్సరాల 6 నెలల 10 రోజులు) అర్జెంటీనాపై రెండు గోల్స్‌ చేశాడు. ఇక, వరల్డ్ ఫైనల్లో ఎంబాపే మరింత రెచ్చిపోయాడు ఆడాడు. ఈ క్రమంలో ఓ అరుదైన రికార్డుని సొంతం చేసుకున్నాడు.

ఆదివారం క్రోయేషియాతో జరిగిన ఫిఫా ప్రపంచకప్‌ ఫైనల్లో ఎంబాపే 65వ నిమిషంలో గోల్‌ సాధించి బ్రెజిల్‌ దిగ్గజం పీలే (1958లో) తర్వాత అతి పిన్న వయసులో వరల్డ్‌ కప్‌ ఫైనల్లో గోల్‌ కొట్టిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు. ఈ క్రమంలో పుట్‌బాల్ దిగ్గజం పీలే సైతం ఎంబాపేపై ప్రశంసల వర్షం కురిపించాడు.

ఫైనల్ మ్యాచ్ అనంతరం 'మైలవ్‌' అనే క్యాప్షన్‌తో ట్రోఫీని ముద్దాడుతూ.. ఫోజిచ్చిన ఫొటోను ఎంబాపె ట్వీట్‌ చేశాడు. అయితే ఈ ట్వీట్‌కు పీలేనే తొలుత స్పందించడం విశేషం. 'కైలిన్‌ నా రికార్డును సమం చేశాడు.. ఇక నా బూట్లకున్న దుమ్ముదులిపి బరిలోకి దిగాల్సిందే' అని ట్వీట్‌ చేశాడు. అంతకు ముందు 'వెలకమ్‌ టూ ది క్లబ్‌' అని పేర్కొన్నాడు.

ఈ క్రమంలో అంతర్జాతీయ పుట్‌బాల్‌లో పీలే స్థాయికి చేరుకునే సత్తా ఉందని ఎంబాపేకి ఉందని పుట్‌బాల్ విశ్లేషకులు అంటున్నారు. అయితే పీలే లాంటి పుట్‌బాల్ దిగ్గజంతో ఎంబాపేను ఇప్పుడే పోల్చడం సరికాదని వాదించే వారు కూడా ఉన్నారు.

19 ఏళ్ల వయసులోనే ఎంబాపే మంచిమనసున్న వ్యక్తిగా కూడా నిరూపించుకున్నాడు. తాజాగా ఫిఫా వరల్డ్ కప్ టోర్నీ ద్వారా తాను అందుకునే మొత్తాన్ని ఛారిటీకి ఇస్తున్నట్లు ప్రకటించి అభిమానుల్ని ఆశ్చర్యపరిచాడు. వరల్డ్ కప్‌లో ఆడినందుకు ఒక్కో మ్యాచ్‌కు గాను ఎంబాపే 22,500 డాలర్ల(ఈ టోర్నీలో అతడు ఎనిమిది మ్యాచ్‌లు ఆడాడు)తో పాటు ఫైనల్‌లో విజేతగా నిలిచినందుకు సుమారు 3.5లక్షల డాలర్లను అదనంగా అందుకున్నాడు.

దీంతో మొత్తం టోర్నీ ద్వారా ఎంబాపే సుమారు 5 లక్షల డాలర్లను అందుకోన్నాడు. అంటే భారత కరెన్సీలో సుమారు రూ.3.4కోట్లకు పైమాటే. ఈ మొత్తాన్ని అతడు ఛారిటీకి ఇవ్వనున్నట్లు తెలిపాడు. క్రీడాభివృద్ధికి, అనారోగ్యంతో బాధపడుతోన్న చిన్నారులకు ఈ మొత్తాన్ని వాడాలని తాను విరాళంగా ఇచ్చిన స్వచ్ఛంద సంస్థను ఎంబాపే కోరాడు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

మైఖేల్‌లో ఫాంటసీ పుట్‌బాల్ ఆడండి. బహుమతులు గెలవండి

Story first published: Tuesday, July 17, 2018, 18:40 [IST]
Other articles published on Jul 17, 2018
+ మరిన్ని
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X