Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఛెత్రి మంత్రం పనిచేయలేదు: ఎఎఫ్‌సి ఇరాక్‌దే

దోహ: ఆసియా ఫుట్‌బాల్ కాన్ఫిడరేషన్ (ఎఎఫ్‌సి) టైటిల్‌ను గెలుచుకుందామన్న భారత్ కలలు సాకారం కాలేదు. శనివారం రాత్రి దోహాలో జరిగిన ఫైనల్స్‌లో బెంగళూరు ఎఫ్ సి జట్టుతో తలపడిన ఇరాకీ ఎయిర్ ఫోర్స్ క్లబ్ జట్టు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. అంజద్ రాధీ వేసిన పునాది ఆధారంగా 71వ నిమిషంలో ఈ టోర్నమెంట్‌లోనే టాప్‌స్కోరర్ అయిన హమ్మదీ అహ్మద్ చేసిన గోల్‌తో ఇరాక్ 1 - 0 స్కోర్ ఆధిక్యం సాధించింది.

తద్వారా తొలి ఖండాంతర టోర్నీ టైటిల్ గెలుచుకునే చాన్స్ బెంగళూరు ఎఫ్ సికిచ్చేందుకు నిరాకరించింది. అద్యంతం ఇరాకీ ఎయిర్ ఫోర్స్ క్లబ్ లైవ్లీగా సుపీరియర్‌గా ప్రత్యేకించి సెకండాఫ్‌లో బంతిపై పట్టును కొనసాగిస్తూ చెలరేగిపోయింది. అనునిత్యం గోల్స్ సాధించేందుకు ఇరాకీ ప్లేయర్లు పోరాట పటిమ ప్రదర్శించారు. పదే పదే షాట్లతో అలరించారు.

ఒకవైపు బెంగళూరు డిఫెండర్ల అడ్డంకులను తోసిరాజంటూనే హమ్మదీ, అమీద్ సురక్షిత స్ట్రయికింగ్‌కు ప్రాధాన్యం ఇచ్చారు. ఇరాక్ జట్టులో గాయం నుంచి కోలుకున్న ఎక్స్‌ప్లోజివ్ లెఫ్ట్ వింగర్ హ్యుమన్ తారిఖ్ బరిలోకి దిగగా, సస్పెన్షన్ల కారణంగా డిఫెండర్ సమల్ సయీద్, మిడ్ ఫీల్డర్ రేసాన్ బూనియన్ స్థానే అహ్మద్ ఖాదీం, ఎమాద్ మాజీద్ మ్యాచ్‌లో పాల్గొన్నారు.

వందలాది మంది అభిమానుల మధ్య సునీల్ ఛెత్రి ఆధ్వర్యంలోని బెంగళూరు ఎఫ్ సి జట్టు గోల్స్ చివరి క్షణం వరకు మ్యాచ్‌ను డ్రాగా మార్చేందుకు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. బెంగళూరు కోచ్ అల్బర్ట్ రోసా తుది జట్టులో ఒక మార్పు తీసుకొచ్చాడు. అమరీందర్ సింగ్ స్థానే జొహొర్ దారుల్ తాజింపై జరిగిన మ్యాచ్‌లో ఆడిన లాల్తౌమావైయా రాల్టేను గోల్ కీపర్‌గా బరిలో దించాడు.

Iraq's Air Force Club dash Bengaluru hopes to win AFC Cup

ఫస్టాఫ్‌లో గోల్స్ చేసేందుకు బెంగళూరు జట్టు పలు చాన్స్‌లు నెలకొల్పినా.. ఎయిర్ ఫోర్స్ క్లబ్ కే రెండు మంచి అవకాశాలొచ్చాయి. అల్విన్ జార్జి ద్వారా క్రాసింగ్‌లో ఎగెనెస్సన్ లింగ్డో రూపంలో భారత్‌కు ఒకే ఒక్క చాన్స్ లభించింది. కానీ అది వైడ్‌గా మారిపోయింది.

సెకండాఫ్ లో ఐదు నిమిషాల తర్వాత రాధీ రూపంలో వచ్చిన చాన్స్ ను బెంగళూరు ఫార్వర్డ్ కుర్రాళ్లు తేల్చేశారు. మరోవైపు సునీల్ ఛెత్రి ఎడమవైపు స్పేస్ గమనించి ఎగెస్సన్‌కు పంపిన బంతిని బాక్స్ వద్ద ఇరాకీ ప్లేయర్లు అడ్డుకున్నారు. తర్వాత కార్నర్‌లో నెట్ వెనక నుంచి వచ్చిన చాన్స్‌ను సునీల్ ఛెత్రి సద్వినియోగంచేసుకోకుండా డిఫెండర్ తిరగొట్టాడు.

ఈ దశలో బెంగళూరు కోచ్ రోసా.. నిషుకుమార్, జార్జి స్థానే నిప్పీ ప్లేయర్లు సెమిన్ల్ డౌంగెల్, ఉదాంతా సింగ్‌లను బరిలోకి దించినా ఇరాకీ ఎయిర్ ఫోర్స్ దూకుడు ముందు తేలిపోయారు. అక్కడి నుంచి ఇరాకీ ప్లేయర్లు చెలరేగిపోయారు. అటాకింగ్ చేస్తూనే రాధీ పునాది వేసిన తర్వాత బాక్స్ కు సమీపాన ఉన్న హమ్మదీ 16వ గోల్ తో జట్టును ఫైనల్స్ లో గెలిపించాడు.

17 నిమిషంలో బ్రేక్ పొందిన ఇరాకీ జట్టు హమ్మదీ అహ్మద్‌ను రైట్ హ్యాండ్ చానెల్ వైపు రాధీ వెనుక నిలిపింది. హమ్మదీ స్థానంలో కొంత మెరుగైన డిపెండర్ కామరూన్ వాస్టన్‌ను నిలిపింది. ఒసామా అలీ స్థానంలో వచ్చిన హుమన్ తారిఖ్ 26వ నిమిషంలో గోల్ సాధించేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదు. హమ్మదీ రెండు సందర్భాల్లోనూ మెరుగైన ఆటతీరు ప్రదర్శించాడు. వైడ్ నుంచి ఇన్ సైడ్ బాక్స్ వరకు బంతిపై పట్టు కొనసాగించినా హమ్మదీ గోల్ చేయలేదు.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+