న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

ఆసియా కప్‌కు ఇంటర్ కాంటినెంటల్ కప్‌తో ఎంతో మేలు

 Intercontinental Cup is good preparation for Asian Cup: Sandesh Jhingan

హైదరాబాద్: వచ్చే ఏడాది జరిగే ఆసియా కప్ టోర్నీలో పాల్గొనేందుకు భారత జట్టుకు శనివారం నుంచి నాలుగు ఖండాంతర దేశాలజట్లతో జరిగే ఇంటర్ కాంటినెంటల్ క్లబ్ ఎంతో మేలు చేస్తుందని భారత ఫుట్‌బాల్ డిఫెండర్ సందేశ్ ఝిగ్నాన్ తెలిపాడు. భారతదేశం తొలిసారి విభిన్నమైన జట్లతో ఆడుతుందని చెప్పాడు. కెన్యా వంటి విభిన్నమైన జట్లతో భారత్ టీం తొలిసారి ఆడుతుందన్నారు. ఇది భారతీయ ఫుట్‌బాలర్లకు కొత్త అనుభవాన్ని తెచ్చి పెడుతుందని సందేశ్ ఝిగ్నాన్ అన్నాడు.

ఆసియాకప్ దానికి ముందు ఇంటర్ కాంటినెంటల్ కప్‌తో ఇలా మేలు

ఆసియాకప్ దానికి ముందు ఇంటర్ కాంటినెంటల్ కప్‌తో ఇలా మేలు

భౌతికంగా ఇది తమకు మంచి పరీక్ష వంటిదని సందేశ్ ఝిగ్నాన్ చెప్పాడు. జూన్ రెండో తేదీ నుంచి ఇంటర్ కాంటినెంటల్ కప్ ప్రారంభం కానున్నది. ఆసియాన్ కప్‌లో బహ్రెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) జట్ల నుంచి కెన్యా వరకు వివిధ దేశాల జట్లతో జరిగే టోర్నమెంట్లలో పాల్గొన్నప్పుడు ఆయా జట్లతో ఆటతో పోలిస్తే మన బలం, బలహీనతలు ఏమిటన్న విషయం తెలుసుకునే అవసరం ఏర్పడుతుందన్నారు.

 కెన్యా తదితర జట్లతో ఆడటం వల్ల బలహీనతలను అధిగమించే వీలు

కెన్యా తదితర జట్లతో ఆడటం వల్ల బలహీనతలను అధిగమించే వీలు

కెన్యా తదితర జట్లతో జరిగే మ్యాచ్‌ల్లో ఆడటం వల్ల బలహీనతలను అధిగమించే వీలు కలుగుతుందని సందేశ్ ఝిగ్నాన్ వివరించాడు. ఖండాంతర టోర్నమెంట్లలో పాల్గొనడం వల్ల ఆసియాన్ ఫుట్ బాల్ కాన్ఫిడరేషన్ కప్ టోర్నీకి భారత జట్టు సంసిద్ధం అయ్యేందుకు వీలు కలుగుతుందని అన్నాడు. ఫ్రెండ్లీ మ్యాచ్‌లు ఎంతో మేలు చేస్తాయన్నారు. మరీ ముఖ్యంగా పటిష్టమైన జట్లతో ఆడేందుకు వెసులుబాటు లభిస్తుందన్నారు సందేశ్ ఝిగ్నాన్.

 యూత్ కప్ వరల్డ్ ఫైనల్స్‌లో భారత్‌కు ఏడో స్థానం

యూత్ కప్ వరల్డ్ ఫైనల్స్‌లో భారత్‌కు ఏడో స్థానం

మ్యూనిచ్‌లో జరిగిన ఎఫ్‌సీ బేయర్న్ యూత్ కప్ వరల్డ్ ఫైనల్స్‌లో టీమిండియా ఏడో ర్యాంకులో స్థిరపడింది. అమెరికా, నైజీరియా వంటి దేశాల జట్లను కూడా ఓడించి నిలిచింది టీం ఇండియా. కొలంబియా సూపర్ స్టార్ జేమ్స్ రోడ్రిగిజ్ వంటి యువ కోచ్‌ల మార్గదర్శకత్వంలో ఎఫ్ సీ బేయర్న్ మ్యూనిచ్‌లో టీం ఇండియా శిక్షణ పొంది అలియాంజ్ ఎరీనాలో పలు మ్యాచ్‌ల్లో ఆడింది. 200 స్కూళ్లకు చెందిన విద్యార్థులు ఈ టోర్నమెంటులో పాల్గొంటే, ఢిల్లీ, బెంగళూరు, ముంబై, చెన్నై. కోల్ కతా, ఈశాన్య భారత్ ప్రాంతాల నుంచి 12 స్కూళ్ల విద్యార్థులు భాగస్వాములయ్యారు. ఈ జట్లన్నీ ఇండియా ఫైనల్స్‌కు ఎంపికయ్యారు. గత ఫిబ్రవరిలో జరిగిన ఫైనల్స్‌లో బెంగళూరులోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ జట్టు విజేతగా నిలిచింది.

 ఎఫ్‌సీ గోవా జట్టులోకి ఫతే హైదరాబాద్ ఎఫ్‌సీ ప్లేయర్ ఇమ్రాన్ ఖాన్

ఎఫ్‌సీ గోవా జట్టులోకి ఫతే హైదరాబాద్ ఎఫ్‌సీ ప్లేయర్ ఇమ్రాన్ ఖాన్

ఎఫ్ సీ గోవా జట్టుతో ఫతేహ్ హైదరాబాద్ ఎఫ్ సీ క్లబ్ జట్టులో ఆడుతున్న మణిపూర్ వింగర్ ఇమ్రాన్ ఖాన్ కాంట్రాక్టుపై సంతకం చేశాడు. 2015 - 16లో పక్కన బెట్టేయబడిన ఆటగాడు.2018 సీజన్‌ టోర్నీలో ఐ - లీగ్ రన్నరప్ అప్‌గా నిలిచిన నెరోకా ఎఫ్సీ జట్టు తరఫున ఆడి రికార్డు నెలకొల్పాడు. ఇమ్రాన్ ఖాన్ ఫేసీ మిడ్ ఫీల్డర్ కావడంతోపాటు ఎడమ వైపు నుంచి గానీ, మధ్య నుంచి గానీ అటాకింగ్ చేయడంలో నేర్పరి. ప్రతిభావంతుడైన ఇమ్రాన్ ఖాన్ ఇంతకుముందు మణిపూర్ లో ఏటా జరిగే సంతోష్ ట్రోఫీలో ఐదు సార్లు ప్రాతినిధ్యం వహించాడు. గోవా క్లబ్ పై హైదరాబాద్ జట్టు గెలుపులో కీలకంగా వ్యవహరించాడు.

Story first published: Wednesday, May 30, 2018, 10:51 [IST]
Other articles published on May 30, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X