Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

లియోనెల్ మెస్సీకి బిగ్ షాక్.. ప్రత్యర్థిని కొట్టిన వివాదంలో భారీ జరిమానా! (వీడియో)

మేజర్ లీగ్ సాకర్ టోర్నీలో ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీకి బిగ్ షాక్ తగిలింది. ఫిలడెల్ఫియా యూనియన్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా ప్రత్యర్థి ఆటగాడు క్విన్ సుల్లివన్‌తో మైదానంలో వాగ్వాదానికి దిగినందుకు మెస్సీకి భారీ జరిమానా విధించారు. అయితే జరిమానా మొత్తాన్ని మాత్రం అధికారికంగా వెల్లడించలేదు. ఫిలడెల్ఫియా ఆటగాడు క్విన్ సుల్లివన్ తో మెస్సీ తీవ్ర వాగ్వాదానికి దిగారు. ఈ గొడవలో ఆగ్రహానికి గురైన మెస్సీ.. సుల్లివన్ మెడ వెనుక, తలపై చేయి చేసుకున్నారు. అయితే ప్రత్యక్షంగా ఈ ఘటనను చూడని రిఫరీ ఆ సమయంలో లియోనెల్ మెస్సీకి ఎలాంటి కార్డు చూపించలేదు.

వీడియో ఫుటేజీ ఆధారంగా చర్యలు
అదనపు సమయంలో స్టేడియంలో మెస్సీ, సుల్లివన్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ సమయంలో మెస్సీ సుల్లివన్ మెడ వెనుక తన చేతిని పెట్టాడు. ఈ సంఘటనకు రిఫరీ ఎటువంటి కార్డు చూపనప్పటికీ.. వీడియో ఫుటేజీని సమీక్షించిన తర్వాత, ప్రత్యర్థి ముఖం, తల లేదా మెడను తాకకూడదనే కఠినమైన నియమాన్ని మెస్సీ ఉల్లంఘించాడని అధికారులు కనుగొన్నారు. ఈ నియమం ప్రకారం మెస్సీకి జరిమానా విధించడం ఇది రెండోసారి. ఫిబ్రవరి 2025లో న్యూయార్క్ సిటీ ఎఫ్‌సీతో జరిగిన మ్యాచ్ సందర్భంగా ఇదే నియమం కింద మెస్సీకి గతంలో జరిమానా విధించారు.

Inter Miami star Lionel Messi Fined for On-Field Altercation with Quinn Sullivan in MLS Match Details

చివరి నిమిషంలో గందరగోళం.. రెడ్ కార్డ్ వివాదం
అదే మ్యాచ్ చివరి క్షణాల్లో మైదానంలో వాతావరణం బాగా వేడెక్కింది. బంతితో పెనాల్టీ బాక్స్ వైపు పరుగెడుతున్న సుల్లివన్‌ను, మయామికి చెందిన ఇయాన్ ఫ్రే టాకిల్ చేసి మెడ పట్టుకున్నాడు, దీనికి ఫ్రేకు కూడా జరిమానా విధించారు. మైదానం బయట ఉరు జట్ల ఆటగాళ్ల మధ్య జరిగిన గొడవకు గాను మయామికి చెందిన యానిక్ బ్రైట్, ఫిలడెల్ఫియాకు చెందిన కావన్ సుల్లివన్‌లకు రిఫరీ రెడ్ కార్డ్ చూపించి మైదానం నుంచి పంపేశారు. అయితే ఫిలడెల్ఫియా అప్పీల్ తర్వాత విచారణ బృందం ఏకగ్రీవంగా కావన్ సుల్లివన్ రెడ్ కార్డ్, ఒక మ్యాచ్ నిషేధాన్ని రద్దు చేసి అతడిని తదుపరి మ్యాచ్ ఆడేందుకు అనుమతించింది.

సస్పెన్షన్ నుంచి ఉపశమనం
మయామి ఆటగాళ్లు లియోనెల్ మెస్సీ, ఇయాన్ ఫ్రే లీగ్ విచారణలో సస్పెన్షన్(నిషేధం) నుంచి తప్పించుకున్నారు. కేవలం జరిమానాతో బయటపడటంతో ఇద్దరూ తదుపరి మ్యాచ్ లు ఆడేందుకు అర్హత సాదించారు. అలాగే ఫిలడెల్ఫియా జట్టు చేసిన అప్పీల్‌ను స్వీకరించిన మేజర్ సాకర్ లీగ్ రివ్యూ టీమ్, కావన్ సుల్లివన్ కు ఇచ్చిన రెడ్ కార్డును రద్దు చేస్తూ తదుపరి మ్యాచ్ ఆడేందుకు అనుమతిచ్చింది. అట్లాంటా యునైటెడ్‌తో జరిగిన ఆటలో ఫౌల్ జరిగినట్లు నటించినందుకు మిన్నెసోటా యునైటెడ్ డిఫెండర్ ఆంటోని మార్కానిక్‌కు కూడా లీగ్ జరిమానా విధించింది.

Story first published: Saturday, August 22, 2026, 17:57 [IST]
Other articles published on Aug 22, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+