ఎంత మార్పు: సంస్కరణలు, మార్పుల బాటలో ‘ఫిఫా’
దుబాయ్: అంతర్జాతీయ ఫుట్‌బాల్ ఆటలోనూ, ఫిఫా కార్యవర్గంలోనూ సమూల మార్పులు తీసుకొచ్చేందుకు రంగం సిద్ధమవుతున్నది. దుబాయిలో రెండు రోజుల పాటు జరిగిన ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ కాన్ఫరెన్స్‌లో ఈ మేరకు బీజం పడిందని తెలుస్తున్నది. అంతర్జాతీయ ఫుట్‌బాల్ సంఘాల సమాఖ్య (ఫిఫా) అధ్యఓుడు జియాన్నీ ఇన్‌ఫాంటినో నివేదికను సమర్పించారని సమాచారం.
ఫుట్ బాల్ క్రీడలోనూ, ఫిఫా కార్యవర్గ నిబంధనల్లోనూ సమూల సంస్కరణలు, మార్పులు ప్రతిపాదించారని తెలిసింది. అత్యంత రహస్యంగా జరిగిన ఈ సదస్సులో ఫిఫా నూతన అధ్యక్షుడిగా ఇన్‌ఫాంటినో 'ఫుట్‌బాల్ వైపు ఫిఫాను తీసుకురావాలి, ఫిఫా వైపు ఫుట్‌బాల్ ను మళ్లించాలి' అన్నదే తన నినాదం అని పేర్కొన్నారని జిన్హువా వార్తాసంస్థ తెలిపింది.
గత ఫిబ్రవరి 26న మాజీ చీఫ్ సెప్ప్ బ్లాట్టర్ నుంచి ఫిఫా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న పుట్ బాల్ ఆటలో సుపరిపాలనను తేవాల్సిన ఆవశ్యకతను, ప్రాముఖ్యతను గుర్తించాడు. పారదర్శకత పెంపొందించడంలో భాగంగా రహస్యంగా ఉంచడానికి ఏమీ లేదని ఫిఫా కార్యవర్గంలో 50 శాతం ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులంతా బయటి వారే ఉంటారని చెప్పాడు.

ఆర్థిక లావాదేవీలపై అడిటింగ్
దీనికి తోడు ఆర్థిక లావాదేవీలపై అడిటింగ్ కొనసాగుతున్నదని ఇన్ ఫాంటినో తన నివేదికలో చెప్పినట్లు తెలుస్తున్నది. ఇంతకుముందు జరిగిన తప్పిదాలను పరిశీలించేందుకే ఈ ఆడిటింగ్ చేపట్టామన్నారు. ఆర్థిక లావాదేవీల కారణంగా ఫిఫా సంక్షోభంలో చిక్కుకుని చీకట్లో మగ్గిన నేపథ్యంలోనే ఫైనాన్సియల్ ఆడిటింగ్ నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఆర్థిక లావాదేవీలపై పూర్తిగా స్వతంత్ర్య, బయటి వ్యక్తులతో కూడి ఆడిటింగ్ గ్రూప్ వచ్చే ఏడాది ప్రారంభం నుంచి పరిశీలిస్తుందని ఇన్ ఫాంటినో సమావేశానికి వివరించారని తెలుస్తోంది.

కుంభకోణాలకు పాల్పడిన వారు దిగ్ర్భాంతి
దీనివల్ల ఫిఫాలో ఇప్పటివరకు కీలక బాధ్యతలు నిర్వహిస్తూ కుంభకోణాలకు పాల్పడిన వారు దిగ్ర్భాంతికి గురయ్యారని తెలుస్తోంది. 200లకు పైగా సభ్య సంఘాలు, ప్రాంతీయ కాన్ఫిడరేషన్ల ప్రతినిధులతో వార్షిక సమావేశం నిర్వహణకు ఫిఫా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ సమావేశంలో సంఘాల ప్రతినిధుల సలహాలు, సూచనలు తీసుకుని ఫుట్ బాల్ అభివ్రుద్ధి, ఫిఫా నిర్వహణకు మెరుగైన విధానాలను రూపొందించాలన్నది ఇన్ ఫాంటినో లక్ష్యంగా కనిపిస్తున్నది.

ఫిఫా నిబంధనలు, మార్గదర్శకాల్లో పలు మార్పులు
అదే సమయంలో మానవ హక్కుల పరిరక్షణ అనే నిబంధనను ఫిఫా నిబంధనలు, మార్గదర్శకాల్లో చేరుస్తారు. ఫుట్ బాల్ ఆడుతున్నప్పుడు మానవ హక్కుల పట్ల గౌరవం కల్పించడం వల్ల ఆట పట్ల అభిరుచి పెంపొందించవచ్చునని ఆయన ఆలోచన. సెనెగల్ సిటిజన్, ఐక్యరాజ్యసమితి ప్రతినిధి ఫాత్మా సామౌరాను ప్రధాన కార్యదర్శిగా నియమించడంతోపాటు ఆమెను కార్యవర్గంలో ‘నంబర్ 2'గా ప్రకటించారు. మరికొన్ని దేశాలకు అవకాశం కల్పించేందుకు వరల్డ్ కప్ విస్తరణ ప్రతిపాదనను ఇన్ ఫాంటినో ముందుకు తెచ్చారు.

ఫిఫా వరల్డ్ టోర్నీలో కార్యవర్గం ఆమోదిస్తే 48 జట్లు
ప్రస్తుతం 40 జట్లు ఆడుతున్న ఫిఫా వరల్డ్ కప్ టోర్నీలో కార్యవర్గం ఆమోదిస్తే 48 జట్లు పాల్గొంటాయి. ఈ ప్రతిపాదన ప్రధాన ఉద్దేశం టోర్నమెంట్ కు గల ప్రజాదరణ పెంపొందించడంతోపాటు మార్కెట్ పెంపు కూడా ఒక లక్ష్యం. 2014లో బ్రెజిల్‌లో నిర్వహించిన ఫిఫా వరల్డ్ కప్ ద్వారా ఫిఫా కార్యవర్గానికి రూ. 3.75 (5.5 బిలియన్ల అమెరికన్ డాలర్ల) లక్షల కోట్లకు పైగా ఆదాయం లభించింది. ఈ టోర్నీలో కేవలం 32 జట్లు మాత్రమే ప్రాతినిధ్యం వహించాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications