Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మొరాకోకు వరల్డ్ కప్‌కు ఆతిథ్యం ఇచ్చే సత్తా ఉంది: జియాన్నీ

Infantino says FIFA can afford Morocco to host 2026 WCup

జ్యురిచ్: మొరాకోలో '2026 వరల్డ్ కప్' ఆతిథ్యం ఇవ్వడానికి తమకు స్థోమత ఉన్నదని ఫిఫా అధ్యక్షుడు జియాన్ని ఇన్‌ఫాంటినో నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. అమెరికా- మెక్సికో-కెనడా కూటమి నుంచి కోట్ల డాలర్ల ఆదాయం హామీ ఇచ్చినా.. మొరాకోకే ఫిఫా ఆతిథ్య హక్కులు కల్పించనున్నదా? అన్న అభిప్రాయం ఏర్పడుతున్నది.

వచ్చే వారం జూన్ 13వ తేదీన మాస్కోలో జరుగనున్న ఫిఫా పాలక మండలి సమావేశంలో 2026 వరల్డ్ కప్ ఆతిథ్య హక్కును కల్పించే అంశాన్ని చర్చించనున్నది.

ఫిఫా కాంగ్రెస్ నిర్ణయానికి కట్టుబడి సాయం చేస్తాం

ఫిఫా కాంగ్రెస్ నిర్ణయానికి కట్టుబడి సాయం చేస్తాం

ఫిఫా కాంగ్రెస్‌లో తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి సహాయం చేస్తామని జియాన్నీ ఇన్ ఫాంటినో తెలిపారు. తాము సజీవమైన ఉత్తమ నిర్ణయం తీసుకుంటామన్నారు. మరోవైపు ఫిఫా కార్యవర్గం.. 2026 ఫిఫా వరల్డ్ కప్ ఆతిథ్య హక్కులను అమెరికా - కెనడా - మెక్సికో కూటమికి అప్పగిస్తుందని మొరాకో నాయకులు, ప్రభుత్వం బహిరంగంగానే ప్రతిస్పందిస్తున్నారు.

మొరాకో, అమెరికా మధ్య చాలా తేడా

మొరాకో, అమెరికా మధ్య చాలా తేడా

ఫిఫా అంచనా ప్రకారం ఉత్తర అమెరికా కూటమి నుంచి కార్పొరేట్ ఆతిథ్య సామర్థ్యంతోపాటు టిక్కెట్ల విక్రయంతో భారీగా ఆదాయం సమకూర్చగలదని తెలుస్తున్నది. అమెరికా కూటమి, మొరాకో బిడ్ల మధ్య టిక్కెట్ల విక్రయంతో ఆదాయంలో గణనీయమైన తేడా ఉన్నది. ఉత్తర అమెరికా కూటమిలో 1430 కోట్ల డాలర్ల ఆదాయం లభిస్తుండగా, మొరాకోలో కేవలం 720 కోట్ల డాలర్ల ఆదాయం మాత్రమే లభిస్తున్నది. తాజాగా ఈ నెలలో జరుగనున్న ఫిఫా వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో ఫిఫాకు 600 కోట్ల డాలర్ల ఆదాయం లభిస్తుందని అంచనా వేస్తున్నారు. ఫిఫా నిర్ధారణ కమిటీ కూడా మొరాకో ప్లాన్ ప్రకారం ఆతిథ్యం ఇచ్చేందుకు స్టేడియంలు, హోటళ్లను పూర్తిస్థాయిలో పునరుద్ధరించాల్సి ఉంటుంది.

2022 బిడ్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇలా బెదిరింపులు

2022 బిడ్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇలా బెదిరింపులు

ఇందుకోసం మొరాకోకు నాలుగేళ్ల పాటు 150 కోట్ల చొప్పున ఏటా సాయం అందజేస్తుంది. ఇందుకు ఫిఫా పాలక మండలిలోని 207 సమాఖ్యలు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. మరోవైపు 2026 ఫిఫా ప్రపంచ కప్ ఆతిథ్య హక్కులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. తమ బిడ్ కు అనుకూలంగా ఓటేయకపోతే తస్మాత్ జాగ్రత్త అని ట్రంప్ ఫిఫా పాలక వర్గాన్ని హెచ్చరించారు.

2022 ఖతార్ టోర్నీలో మరో 16 జట్లకు చోటివ్వండి

2022 ఖతార్ టోర్నీలో మరో 16 జట్లకు చోటివ్వండి

ఫిఫా పాలక మండలిలో ఓటింగ్ విధానానికి ఒక ప్రాధాన్యం ఉంటుందని ఫిఫా అధ్యక్షుడు ఇన్ ఫాంటినో తెలిపారు. ఫిఫా తదుపరి జరిగే ఫిఫా వరల్డ్ కప్ టోర్నీల నిర్వహణపైనే పూర్తిగా ద్రుష్టి సారిస్తుంది. 2022లో ఖతార్‌లో జరిగే ప్రపంచ కప్ టోర్నమెంట్ నుంచి మరో 16 జట్లను చేర్చుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఇన్ ఫాంటినో కోరారు. ఖతార్‌లో జరిగే టోర్నమెంట్‌లో మిగతా మద్యప్రాచ్యం దేశాల జట్లు పాల్గొంటారు. 2022 ప్రపంచకప్ గురించి ఏ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినా జూన్ 13వ తేదీన జరిగే ఫిఫా పాలక వర్గం సమావేశంలోనే తీసుకోవాల్సి ఉంటుంది.

Story first published: Wednesday, June 6, 2018, 12:22 [IST]
Other articles published on Jun 6, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+