For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రతిభతోనే ముందడుగన్న భాయిచుంగ్: కోచ్ భవితవ్యంపై ఎఐఎఫ్ఎఫ్ నజర్

న్యూఢిల్లీ: ఇండియన్ ఫుట్ బాల్ మాజీ సారథి భాయిచుంగ్ భూటియా 'యు - 17' భారత జట్టు పరిస్థితి మెరుగ్గానే ఉన్నదని అభిప్రాయపడ్డాడు. ఫుట్ బాల్ ఎక్కువగా ఆడే బ్రెజిల్ జట్టుతో పోటీ పడగల సామర్థ్యం భారత్ యు-17 జట్టుకు ఉందని భావిస్తున్నట్లు తెలిపారు. 'కొందరు భారతీయ ప్లేయర్లతో కలిసి బ్రెజిల్‌పై ఆడిన మ్యాచ్‌లో ఒకే స్థాయి సామర్థ్యం కలిగి ఉన్నట్లు రుజువైంది' అని ఆయన అన్నాడు. అఖిల భారత ఫుట్ బాల్ ఫెడరేషన్ (ఎఐఎఫ్ఎఫ్) సాంకేతిక కమిటీ చైర్మన్‌గా కూడా వ్యవహరిస్తున్నారు.

'మీరు మ్యాచ్‌ల్లో సరిగ్గా ఆడకపోతే మీరు వ్యక్తిగతంగా ప్రతిభ సాధించలేరు' అని భాయిచుంగ్ చెప్పాడు. యు - 17 జట్టును మెరుగ్గా తీర్చిదిద్దేందుకు.. క్షేత్రస్థాయిలో ఫుట్ బాల్ ఆటను అభివ్రుద్ది చేసే అంశంపై ద్రుష్టి సారించగల సామర్థ్యం ఉంటుందన్నాడు. అన్ని యువ భారత టీం కుర్రాళ్లకు సమానమైన స్థాయిలోనే శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందని భాయిచుంగ్ అన్నాడు. భాయిచుంగ్ అభిప్రాయాలనే అఖిల భారత ఫుట్ బాల్ సమాఖ్య (ఎఐఎఫ్ఎఫ్) అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్ సైతం బలపరిచాడు.

భారత ఫుట్ బాల్ ఆట అభివ్రుద్ధికి సమూల మార్పులు తేవాల్సిన అవసరం ఉందని ప్రఫుల్ పటేల్ అభిప్రాయ పడ్డాడు. 'ఉత్తమ శిక్షకులు పర్యవేక్షణలో మన భారత టీం వివిధ మ్యాచ్‌లు ఆడుతుంది. ప్రతిభను పెంచుకునే దిశగా వారు మెరుగుదల సాధించారు. కాంపిటీటివ్ ద్రుక్పథం క్రమంగా పెరుగుతున్నది' అని ఎఐఎఫ్ఎఫ్ పేర్కొంది. యు - 17 జట్టు ఆధారంగా మరికొన్ని ఉత్తమ యువ ఫుట్ బాల్ జట్లను అభివ్రుద్ది చేయవచ్చునన్నాడు.

Indian U17 football team is on same page as brazil:bhaichug bhutia

కోచ్ కాంస్టటైన్ భవితవ్యంపై చర్చించనున్న ఎఐఎఫ్ఎఫ్

భారత్ ఫుట్ బాల్ జాతీయ జట్టు ప్రధాన కోచ్ స్టీఫెన్ కాంస్టాటైన్ భవితవ్యంపై కూలంకషంగా చర్చించేందుకు అఖిల భారత ఫుట్ బాల్ సమాఖ్య (ఎఐఎఫ్ఎఫ్) సంసిద్ధమవతున్నది. తదుపరి సమాఖ్య కార్యవర్గ భేటీలో కాంస్టాటైన్ భవితవ్యంపై చర్చిస్తామని ఎఐఎఫ్ఎఫ్ ప్రధాన కార్యదర్శి కుశాల్ సింగ్ తెలిపారు. ఈ విషయాన్ని ఎఐఎఫ్ఎఫ్ సాంకేతిక కమిటీ ద్రుష్టికి తెచ్చారు.

ఈ కమిటీలో మాజీ లెజెండ్ భాయిచుంగ్ భూటియాతోపాటు కేరళ ఫుట్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి అనిల్ కుమార్, ఎఐఎఫ్ఎఫ్ అకాడమీ ఇన్ స్రక్టర్ స్కూట్ ఓ'డొన్నెల్ సమావేశమై చర్చించారు. 2015 జనవరిలో భారత జాతీయ జట్టు ప్రధాన కోచ్ గా ఎఐఎఫ్ఎఫ్ నియమించుకున్నది. ఎఐఎఫ్ఎఫ్ వర్గాల కథనం ప్రకారం అయితే కాంస్టాటైన్ స్థానంలో మరొక కోచ్ నియామకం గురించి చర్చించే అవకాశమే లేదని తేల్చి చెప్పాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఇండియన్ కోచ్‌గా కాంస్టాటైన్ గడువు పూర్తవుతుంది.

భారత్ ఫుట్ బాల్ జాతీయ జట్టు కోచ్ గా కాంస్టాటైన్ జట్టులో స్ఫూర్తి నింపడంలో పూర్తిగా విఫలమయ్యాడన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వరల్డ్ కప్ లో గానీ, ఆసియా కప్ క్వాలిఫయర్స్ స్థాయికి దూసుకెళ్లేలా భారత జట్టును అభివ్రుద్ధి చేయడంలో విఫలమయ్యాడు. ఆసియా కప్ గ్రూప్ డీలో ఆసియా హెవీ వెయిట్స్ ఇరాన్, ఒమన్ తర్వాత గువాం కింద భారత్ చోటు దక్కించుకున్నది. గత జనవరిలో జరిగిన సాఫ్ఫ్ చాంపియన్ షిప్ టోర్నీలోనూ భారత జట్టుకు మార్గదర్శిగా వ్యవహరించిన కాంస్టాటైన్ ఆధ్వర్యంలోనూ మెరుగైన ఫలితాలేమీ సాధించలేదు.

ఆ చాంపియన్ షిప్ టోర్నీ ఫైనల్స్ మ్యాచ్ లో భారత్ జట్టు, ఆప్ఘనిస్తాన్ జట్టు చేతిలో 1- 0 స్కోర్ తేడాతో ఓటమి పాలైంది. అయితే ఎఐఎఫ్ఎఫ్ మాత్రం ఓవరాల్‌గా జట్టు ప్రతిభను పెంపొందించడంలో కాంస్టాటైన్ స్ఫూర్తిదాయక ఫలితాలు సాధిస్తున్నాడని విశ్వసిస్తోంది. మళ్లీ కాంస్టాటైన్ ను కోచ్ గా నియమించే విషయమై ఎఐఎఫ్ఎఫ్ అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్ తుది నిర్ణయం తీసుకోనున్నారు.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
-
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+