For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

ఐఎస్ఎల్: కోల్‌కత్తా Vs ముంబయి, రాత్రి 7 గంటలకు

By Nageswara Rao

న్యూఢిల్లీ: పుట్‌బాల్ ప్రేక్షాభిమానులు ఎప్పుడెప్పుడూ అని ఎదురుచూస్తున్న ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఆరంభం నేడే. సచిన్ టెండూల్కర్, సౌరభ్ గంగూలీ, విరాట్ కోహ్లీ, ధోని వంటి స్టార్ క్రికెటర్లతో పాటు బాలీవుడ్ హీరోలు రణబీర్ కపూర్, హృతిక్ రోషన్ లాంటి వారు ఫ్రాంజైజీ యజమానలుగా పాలుపంచుకుంటున్నారు.

ఐఎస్ఎల్ ప్రారంభ కార్యక్రమంలో బాలీవుడ్ ప్రియాంక చోప్రా తన ప్రదర్శనతో అలరించనుంది. అమితాబ్ బచ్చన్, సచిన్ టండూల్కర్ సహా అనేక మంది క్రీడాకారులు ఈ ప్రారంభ కార్యక్రమానికి హాజరవనున్నారు. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి కోల్‌కత్తాలోని సాల్ట్ లేక్ స్టేడియం వేదక కానుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఐఎస్ఎల్ మొదలవుతున్నట్లు ప్రకటిస్తారు.

మొత్తం ఎనిమిది జట్లు పొటీపుడుతున్న ఈ ఐఎస్ఎల్ లీగ్ డిసెంబర్ 20న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. ఈ టోర్నీలో ఐదుగురు ప్రపంచ కప్ విజేతలు, బ్రెజిల్ దిగ్గజం జికో (కోచ్‌గా) లీగ్‌కు ప్రత్యేక ఆకర్షణ. కోల్ కత్తాతో పాటు గౌహతి, కోచి, ఫటోర్డా, పూణె, చెన్నై, ముంబై, ఢిల్లీలో ఐఎస్ఎల్ మ్యాచ్‌లు జరగనున్నాయి.

ఎట్టకేలకు క్రీడాభిమానులంతా ఫుట్‌బాల్‌వైపే చూస్తున్నారని, ఇది ఆహ్వానించదగ్గ పరిణామమని భారత క్రికెట్ మాజీ కెప్టెన్, నిఅట్లెటికో డి కోల్‌కతా సహ యజమాని సౌరభ్ గంగూలీ అన్నాడు. ఈ క్రెడిట్ అంతా ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్)దేనని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. సౌరభ్ గంగూలీ ఐఎస్ఎల్‌లో అట్లెటికో డి కోల్ కత్తా జట్టు సహ యజమాని.

Indian Super League starts amid huge expectations

ఇక ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) వ్యవస్దాపక ఛైర్ పర్సన్ నీతా అంబానీ మాట్లాడుతూ "ఇది సుదీర్ఘ ప్రయాణం. పుట్‌బాల్‌కు మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. అభిమానుల మద్దతే దేశంలో పుట్ బాల్ లీగ్‌ను విజయవంతం చేస్తుంది. క్రికెట్, పుట్‌బాల్‌తో పాటు అన్ని క్రీడలకు మా మద్దతు తప్పక ఉంటుంది. భారత్‌ను క్రీడా దేశంగా మలచాల్సిన బాధ్యత అందరిపై ఉంది." అని అన్నారు.

ఇండియన్ సూపర్ లీగ్‌లో అత్యంత బలమైన జట్టుగా రణబీర్ కపూర్ సహా యజమానిగా ఉన్న ముంబై సిటీ ఎఫ్‌సీ జట్టు ఉండగా.. అత్యంత బలహీనమై జట్టుగా సచిన్ టెండూల్కర్ సహా యజమానిగా ఉన్న కేరళ బ్లాస్టర్స్ జట్టు ఉంది.

ఇండియన్ సూపర్ లీగ్‌లో ఈరోజు
అట్లెటికో ది కోల్‌కత్తా వర్సెస్ ముంబయి సిటీ
రాత్రి 7 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్ లో ప్రత్యక్ష ప్రసారం

Story first published: Tuesday, November 14, 2017, 10:06 [IST]
Other articles published on Nov 14, 2017
-
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+