కన్నుల పండుగగా ఐఎస్ఎల్ ఆరంభం(ఫోటోలు)
న్యూఢిల్లీ: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఆరంభోత్సవం కన్నుల పండుగగా సాగింది. ఆదివారం సాయంత్రం కోల్‌కత్తాలోని ప్రఖ్యాత సాల్ట్ లేదక్ స్టేడియంలో 70 వేల మందితో కిక్కిరిసిన స్టేడియంలో లీగ్‌కు ప్రారంభమైంది. బాలీవుడ్, క్రికెట్, ప్రపంచ ఫుట్‌బాల్ సెలబ్రిటీల మధ్య ఐఎస్‌ఎల్‌ను అధికారికంగా ప్రారంభిస్తున్నట్లు ఐఎంజీ-రిలయన్స్, ఫుట్‌బాల్ స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ (ఐఎస్‌ఎల్) చైర్ పర్సన్ నీతా అంబానీ బెంగాలీ భాషలో ప్రకటించారు.
అంతక ముందు 12-14 ఏళ్ల మధ్య వయసున్న 200 మంది అమ్మాయిలు, అబ్బాయిలు వంద మంది నృత్య కళాకారులతో కలిసి.. వెలుగులు నిండిన 600 పుట్ బాల్స్‌తో చేసిన సాంస్కృతిక ప్రదర్శన ఆరంభోత్సవానికి హైలెట్‌గా నిలిచింది. ఆనంతరం ప్రఖ్యాత డ్రమ్స్ శివమణి 160 మంది సంగీత కళాకారులు, ఎనిమిది ప్రాంఛైజీలకు ప్రాతినిధ్యం వహించిన ఎనిమిది మంది సంగీత దర్శకులతో కలిసి ఇచ్చిన ప్రదర్శన కూడా ఆకట్టుకుంది.
భారత్ పుట్ బాల్ లో స్వర్ణయుగంగా 1951-62 మధ్య ఆడిన దిగ్గజాల మీద ప్రదర్శించిన 'బ్లేజింగ్ ఫీట్ ఆఫ్ ఇండియన్ ఫుట్‌బాలింగ్ లెజెండ్స్'వీడియో కూడా ఆకట్టుకుంది. ఈ షోలో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఆటపాటలతో కిక్కెక్కించింది. అట్లెటికో డి కోల్‌కాతాతో మొదలుపెట్టి వరుసగా టీమ్ యజమాన్లను ప్రియాంక స్టేజ్‌పైకి ఆహ్వానించింది.
అట్లెటికో ఓనర్ సౌరభ్ గంగూలీ వేదికపైకి వచ్చినప్పుడు 'ఎప్పుడు కావాలంటే అప్పుడు జెర్సీ విప్పేందుకే దాదా ఓ టీమ్ దక్కించుకున్నాడు'అని ప్రియాంక చమత్కరించడంతో స్టేడియంలో హర్షధ్వానాలు మారుమోగాయి. గౌహతికి జాన్ అబ్రహాం, గోవాకు రాబర్ట్ పైన్స్, చెన్నైకి అభిషేక్ బచ్చన్, పూణెకు హృతిక్ రోషన్, ముంబయికి రణబీర్ కపూర్ ప్రాతినిధ్యం వహించారు. చివరకు కేరళ బ్లాస్టర్స్ సచిన్ టెండూల్కర్, ఆ జట్టు ప్రధాన ఆటగాడు జేమ్స్ వేదిక మీదకి వచ్చారు.
ఐఎస్ఎల్ ఆరంభోత్సవంలో భారత్ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కరే ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. సచిన్ క్రికెట్ ఆడే రోజుల్లో బ్యాటింగ్ దిగడానికి ముందు స్టేడియంలో ప్రేక్షకులు సా...చిన్, సా...చిన్ అంటూ లయబద్దమైన నినాదాలతో ఏవిధంగానైతే అరుస్తారో.. అదే విధంగా నిన్న జరిగిన ప్రారంభోత్సవ వేడుకల్లో అరిచారు.

కన్నుల పండుగగా ఐఎస్ఎల్ ఆరంభ వేడుకలు
బాలీవుడ్, క్రికెట్, ప్రపంచ ఫుట్‌బాల్ సెలబ్రిటీల మధ్య ఐఎస్‌ఎల్‌ను అధికారికంగా ప్రారంభిస్తున్నట్లు ఐఎంజీ-రిలయన్స్, ఫుట్‌బాల్ స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ (ఐఎస్‌ఎల్) చైర్ పర్సన్ నీతా అంబానీ బెంగాలీ భాషలో ప్రకటించారు.

కన్నుల పండుగగా ఐఎస్ఎల్ ఆరంభ వేడుకలు
'ప్రారంభ వేడుకలకు కోల్‌కాతాను ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు. ఇక ఫుట్‌బాలే సర్వస్వంగా బతుకుదాం' అని మమత అన్నారు. దేశ నలుమూలకు ఫుట్‌బాల్‌ను తీసుకెళ్లేందుకు ఇదో మంచి తరుణమని ప్రఫుల్ పటేల్ చెప్పారు.

కన్నుల పండుగగా ఐఎస్ఎల్ ఆరంభ వేడుకలు
ఈ షోలో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఆటపాటలతో కిక్కెక్కించింది. అట్లెటికో డి కోల్‌కాతాతో మొదలుపెట్టి వరుసగా టీమ్ యజమాన్లను ప్రియాంక స్టేజ్‌పైకి ఆహ్వానించింది.

కన్నుల పండుగగా ఐఎస్ఎల్ ఆరంభ వేడుకలు
అట్లెటికో ఓనర్ సౌరభ్ గంగూలీ వేదికపైకి వచ్చినప్పుడు ‘ఎప్పుడు కావాలంటే అప్పుడు జెర్సీ విప్పేందుకే దాదా ఓ టీమ్ దక్కించుకున్నాడు'అని ప్రియాంక చమత్కరించడంతో స్టేడియంలో హర్షధ్వానాలు మారుమోగాయి. గౌహతికి జాన్ అబ్రహాం, గోవాకు రాబర్ట్ పైన్స్, చెన్నైకి అభిషేక్ బచ్చన్, పూణెకు హృతిక్ రోషన్, ముంబయికి రణబీర్ కపూర్ ప్రాతినిధ్యం వహించారు. చివరకు కేరళ బ్లాస్టర్స్ సచిన్ టెండూల్కర్, ఆ జట్టు ప్రధాన ఆటగాడు జేమ్స్ వేదిక మీదకి వచ్చారు.

కన్నుల పండుగగా ఐఎస్ఎల్ ఆరంభ వేడుకలు
ఐఎస్ఎల్‌లో కేరళ బ్లాస్టర్స్ జట్టుకి సహా యజమానిగా ఉన్న సచిన్ టెండూల్కర్ పసుపు రంగు జెర్సీ ధరించాడు. ఐఎస్ఎల్ ప్రారంభోత్సవ వేడుకల్లో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ, బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, ఏఐఎఫ్‌ఎఫ్ అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్ పాల్గొన్నారు.
ఐఎస్ఎల్‌లో కేరళ బ్లాస్టర్స్ జట్టుకి సహా యజమానిగా ఉన్న సచిన్ టెండూల్కర్ పసుపు రంగు జెర్సీ ధరించాడు. ఐఎస్ఎల్ ప్రారంభోత్సవ వేడుకల్లో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ, బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, ఏఐఎఫ్‌ఎఫ్ అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్ పాల్గొన్నారు.
'ప్రారంభ వేడుకలకు కోల్‌కాతాను ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు. ఇక ఫుట్‌బాలే సర్వస్వంగా బతుకుదాం' అని మమత అన్నారు. దేశ నలుమూలకు ఫుట్‌బాల్‌ను తీసుకెళ్లేందుకు ఇదో మంచి తరుణమని ప్రఫుల్ పటేల్ చెప్పారు. ఇండియన్ సూపర్ లీగ్‌లో మొత్తం ఎనిమిది జట్లు పోటీ పడుతున్నాయి. డిసెంబర్ 20తో సూపర్ లీగ్ ముగియనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications