Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చెన్నై కోసమే నేనిక్కడ ఉన్నా: రైస్

చెన్నై: ఐఎస్‌ఎల్ 3 ఎడిషన్‌ చాంపియన్‌షిప్‌ను తామే తిరిగి సొంతంచేసుకుంటామని డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నైయిన్‌ ఎఫ్‌సి సారధి జాన్‌ ఆర్న్‌ రైస్‌ స్పష్టంచేశారు. చెన్నైకి రెండో ఐఎస్‌ఎల్‌ టైటిల్‌ సాధించడానికి సహకారం కోసమే తానిక్కడ ఉన్నానన్నాడు.

'నేను టైటిల్‌ గెలుచుకోవడానికే ఇక్కడ ఉన్నా. వారు చాంపియన్లు, తొలి ఐఎస్‌ఎల్‌ టోర్నీని గెలుచుకున్నా,రు. నేను ఫస్ట్‌ ఆడిన జట్టు ఐఎస్‌ఎల్‌లో టైటిల్‌ గెలుచుకున్నది. రెండోసారి టెటిల్‌ గెలుచుకునేందుకు సహకరించాలని కోరుకున్నా. మార్కో మాటరాజ్జీ నన్ను అతడి కోసం ఆడాలని అడగడంతో సరేనని సమాధానం చెప్పడానికి కష్టమైంది. అయితే ఇప్పుడు నేను లీగ్‌లో మంచి జట్టులో ఉన్నానని భావిస్తున్నా.

ఈ సీజన్‌ చాలా కష్టతరమైంది. మేం డిఫెండింగ్‌ చాంపియన్లం కావడంతో ప్రతి ఒక్కరూ మమ్ముల్ని ఓడించాలని చూస్తారు. ప్రత్యేకించి తొలి టైటిల్‌ గెలుచుకున్న వారు ఈసారి టైటిల్‌ గెలుచుకొనేందుకు.. మమ్ముల్ని దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తారు. ఇది పెద్ద సవాల్‌. నాకు మాత్రం మంచి సవాల్‌' అని ఓ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జాన్‌ అర్నె రైస్‌ చెప్పాడు.

'ప్రస్తుతం నేను నా టీమ్‌ను రక్షించుకుని, డిఫెండ్‌చేసుకోవాలి. బెర్నాండ్‌ మెండీతో నాకు ఉన్న అనుబంధం చాలా గట్టిది. శిక్షణలో నేనెప్పుడు అఫెన్సివ్‌ మైండ్‌సెట్‌ కలిగి ఉంటా, ఫార్వర్డ్‌, షాట్‌, స్టఫ్‌లకు ప్రాధాన్యం ఇస్తా. ప్రస్తుతం జట్టును డిఫెండింగ్‌ చేసుకోవడంపైనే దృష్టి సారించా' అని తెలిపాడు.

ఐఎస్‌ఎల్‌లో ఇద్దరు కోచ్‌లతోనూ తనకు సౌకర్యంగానే ఉందన్నాడు. వారు ఆటాడినప్పుడు డిఫెండర్లుగా ఆడే వారన్నాడు. రొబెర్టో వెరీ అటాకింగ్‌ ప్లేయర్‌, వారిద్దరి నుంచి చాలా నేర్చుకున్నా అని తెలిపాడు. గత ఏడాది ఢిల్లీ డైనమోస్‌తో ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు అంతా ఆశ్చర్యపోయారని అన్నాడు.

Indian Super League: John Arne Riise: 'I'm here to help Chennaiyin FC win their second ISL'

భారత్‌ ప్లేయర్లు వచ్చీరాగానే చాలా కష్టపడి ప్రాక్టీస్‌ చేయడం ప్రారంభిస్తారన్నాడు. వారు పిచ్‌బయట వారి వ్యక్తిగత, కుటుంబ వ్యవహారాల గురించి ఆలోచిస్తారని జాన్‌ ఆర్నె రైస్‌ వ్యాఖ్యానించాడు.

ఇంప్రూవ్‌ కావాల్సింది చాలా ఉంది: జాఫ్రీ

తాము పలు విభాగాల్లో ఆటతీరు మెరుగు పరుచుకోవాల్సి ఉందని ఎఫ్‌ సి గోవా మిడ్‌ ఫీల్డర్‌ జాఫ్రీ వ్యాఖ్యానించాడు. మంగళవారం నార్త్‌ఈస్ట్‌తో ఓటమి తర్వాత ఓ వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ తమకు స్కోర్‌ ముఖ్యం కాదని, పలు అంశాల్లో మెరుగు పడాల్సి ఉందన్నారు.

ఆటలో పరిస్థితి మాకు అంత చెడ్డగా ఏమీ లేదు. బంతితో ఆడేందుకు ప్రయత్నించాం, కానీ నేర్చుకోవాల్సింది చాలా ఉందన్నాడు. తాను వ్యక్తిగతంగా తెలుసుకుని మెరుగు పరుచుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయని జాఫ్రీ వ్యాఖ్యానించాడు.

గోవాపై విజయంతో అల్ఫారోకు నార్జారీ అభినందనలు

ఐఎస్‌ఎల్‌ ప్రారంభమైన తర్వాత ఎఫ్‌సి గోవా జట్టుపై అద్భుతమైన రీతిలో విజయం సాధించడంతో నార్జరీ తనను అభినందించాడని నార్త్‌ఈస్ట్‌ అటాకర్‌ ఎమిలియానో అల్ఫారో వ్యాఖ్యానించాడు.

చాలా మంచిగా ఆడినందుకు తనకు చాలా సంతోషంగా ఉందని, తాను జట్టు కోసం పని చేయడం చాలా ముఖ్యమని తెలిపాడు. తమ అభిమానుల నుంచి చాలా మద్దతు లభిస్తున్నదని అల్ఫారో చెప్పాడు.

జట్టు సారధి హోలీ టీం కోసం అద్భుతంగా పనిచేస్తున్నాడు. ఆయన తమకు చాలా ముఖ్యమని ఎఫ్‌సి గోవాపై విజయం తర్వాత ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+